సెప్టెంబర్ 17 హ్యాపీ బర్త్ డే | September 17 Happy Birthday | Sakshi
Sakshi News home page

సెప్టెంబర్ 17 హ్యాపీ బర్త్ డే

Published Thu, Sep 17 2015 12:55 AM | Last Updated on Sun, Sep 3 2017 9:31 AM

సెప్టెంబర్ 17 హ్యాపీ బర్త్ డే

సెప్టెంబర్ 17 హ్యాపీ బర్త్ డే

ఈరోజు మీతో పాటు పుట్టినరోజు
 జరుపుకుంటున్న ప్రముఖులు
 రవిచంద్రన్ అశ్విన్ (క్రికెటర్), ప్రియా ఆనంద్ (నటి)

 
 ఈ రోజు పుట్టిన వారి సంవత్సర సంఖ్య 7. ఇది మోక్షకారకుడు, ఆధ్యాత్మిక వేత్త అయిన కేతుగ్రహానికి సంబంధించి నది కావడం వల్ల ఈ సంవత్సరం వీరు పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు. పలుకుబడి పెరుగుతుంది. మంచి సలహాదారుగా పేరు గడిస్తారు. కుటుంబ పరంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అయితే ఆధ్యాత్మికతతో సంసార జీవితం నుంచి దూరంగా వెళ్లడం వల్ల కొన్ని చిక్కులు ఏర్పడవచ్చు. అందువల్ల వీలయినంత వరకు జీవిత భాగస్వామితో అన్యోన్యంగా గడపడం మంచిది.

వీరు పుట్టిన తేదీ 17 శనికి సంబంధించిన సంఖ్య కావడం వల్ల పనులు కొంచెం ఆలస్యంగా జరుగుతాయి. అయితే ఉద్యోగంలో, వ్యాపారంలో స్థిరత్వాన్ని పొందుతారు. మనోబలం పెరుగుతుంది. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. మేనేజిమెంట్ రంగంలో రాణిస్తారు. కొద్దిపాటి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు ఉత్సాహకరంగా ఉంటుంది. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకొస్తుంది. ఐ.ఎ.ఎస్‌లు తదితర అధికారులకు ప్రమోషన్లు లభిస్తాయి.

 లక్కీ డేస్: 1,3,8,9; లక్కీ కలర్స్: ఎల్లో, గోల్డెన్, బ్లూ, బ్లాక్; లక్కీ డేస్: గురు, శుక్ర, శనివారాలు.
 సూచనలు: గణపతి ఆరాధన, శనికి తైలాభిషేకం, శివునికి మహన్యాసపూర్వక రుద్రాభిషేకం చేయించుకోవడం, అనాథలకు అన్నదానం చేయడం, వృద్ధులను ఆదరించడం. మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement