అలా చేయడం ఆనందమే | 'Vai Raja Vai' Starring Gautham Karthik and Priya Anand | Sakshi
Sakshi News home page

అలా చేయడం ఆనందమే

Published Fri, Dec 19 2014 2:47 AM | Last Updated on Sat, Sep 2 2017 6:23 PM

అలా చేయడం ఆనందమే

అలా చేయడం ఆనందమే

మా ఆయన్ని డెరైక్ట్ చేసినప్పుడు చాలా ఆనందం కలిగిందంటున్నారు సూపర్‌స్టార్ రజనీకాంత్ పెద్ద కూతురు నటుడు ధనుష్ అర్ధాంగి ఐశ్వర్య. ఈమె తొలిసారిగా మెగాఫోన్ పట్టి తెరకెక్కించిన చిత్రం ‘3’. ధనుష్, శ్రుతిహాసన్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం అంతగా విజయం సాధించకపోయినా ఆ చిత్రంలో సంగీత దర్శకుడు అనిరుధ్ బాణీలు కట్టిన వై దిస్ కొలెవైరి డీ పాట బహుళ ప్రాచుర్యం పొందింది. ఐశ్వర్య ధనుష్ మలి ప్రయత్నం వై రాజా వై చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో యువ నటుడు గౌతమ్ కార్తీక్ హీరోగాను ప్రియా ఆనంద్ హీరోయిన్‌గాను నటిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం ఇటీవలే మార్కెట్‌లోకి విడుదలయ్యాయి. వినోద భరిత చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రం త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది.
 
 ఈ సందర్భంగా చిత్ర దర్శకురాలు ఐశ్వర్య ధనుష్ మాట్లాడుతూ తాను తొలి చిత్రం దర్శకత్వం వహించినప్పుడు అధిక శ్రద్ధ చూపించలేదన్నారు. దీంతో తదుపరి చిత్రానికి కొత్త ప్రయోగం చేయాలని భావించానన్నారు. తాను, తన భర్త చిత్రాల పనిలో బిజీగా ఉండడంవలన ఇంటిలో మాట్లాడుకోవడానికి చాలా తక్కువ సమయమే ఉంటుందన్నారు. అయినా నా చిత్ర కథ ధనుష్‌కు తెలుసని తెలిపారు. ధనుష్ తన కంటే సీనియర్ అని అంతేకాకుండా తనకు మార్గదర్శకుడు కూడా అని అన్నారు. తనకాయన చాలా సాయం చేస్తారని వై రాజా వై చిత్రంలో కూడా అతిథి పాత్రలో నటించారని ఆయన్ని దర్శకత్వం వహించడం చాలా ఆనందం కలిగించిందని ఐశ్వర్య ధనుష్ పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement