ఐశ్వర్యలో అదే నచ్చింది | vai raja vai audio released | Sakshi
Sakshi News home page

ఐశ్వర్యలో అదే నచ్చింది

Published Thu, Dec 11 2014 2:30 AM | Last Updated on Sat, Sep 2 2017 5:57 PM

ఐశ్వర్యలో అదే నచ్చింది

ఐశ్వర్యలో అదే నచ్చింది

 ఐశ్వర్య ధనుష్‌లోని ఆత్మవిశ్వాసం నచ్చిందని ప్రముఖ దర్శకుడు బాలా ప్రశంసించారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ పెద్ద కూతురు, నటుడు ధనుష్ భార్య ఐశ్వర్య, మెగాఫోన్ పట్టి తొలి ప్రయత్నంగా 3 అనే సంచలన చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. తాజాగా ఐశ్వర్య  వై రాజా వై అంటున్నారు. యువ నటుడు గౌతమ్ కార్తీక్, ప్రియా ఆనంద్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో తాప్సీ ఒక ముఖ్య భూమికను పోషించడం విశేషం. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించారు.
 
 ఈ చిత్రం కోసం నటుడు ధనుష్ ఒక పాట రాసి పాడటం మరో విశేషం. ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ బుధవారం జరిగింది. దర్శకుడు బాలా మాట్లాడుతూ ఐశ్వర్య పట్టుదల, శ్రమకు తగ్గ ఫలితా న్ని ఈ చిత్రం ఇస్తుందన్నారు. ధనుష్, లతా రజనీకాంత్, కెవి ఆనంద్, గౌతమ్ కార్తీక్, తాప్సీ, ప్రియా ఆనంద్, ఎస్‌జె సూర్య, కస్తూరిరాజా, అనిరుధ్, మనోబాల పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement