కమల్‌తో ఐశ్వర్యా ధనుష్ ఢీ | Vai Raja Vai Clash with Uthama Villain on May 1 | Sakshi
Sakshi News home page

కమల్‌తో ఐశ్వర్యా ధనుష్ ఢీ

Published Mon, Apr 20 2015 2:27 AM | Last Updated on Sun, Sep 3 2017 12:32 AM

కమల్‌తో ఐశ్వర్యా ధనుష్ ఢీ

కమల్‌తో ఐశ్వర్యా ధనుష్ ఢీ

 కమలహాసన్‌తో నటుడు ధనుష్ భార్య ఐశ్వర్యా ఢీ కొంటున్నారు. సాధారణంగా ఒక భారీ చిత్రం విడుదలవుతుందంటే చిన్న చిత్రాలను ఆ సమయంలో విడుదల చేయడానికి ఆలోచిస్తారు. అయితే గత శుక్రవారం మణిరత్నం చిత్రం ఓ కాదల్ కణ్మణి, లారెన్స్ చిత్రం కాంచన -2 చిత్రాలు ఒకేరోజు తెరపైకి వచ్చి ప్రేక్షకాదరణతో విజయబాటలో పయనిస్తున్నాయి. తాజగా విశ్వనాయకుడు కమలహాసన్ నటించిన ఉత్తమ విలన్ చిత్రం ఐశ్వర్యా ధనుష్ దర్శకత్వం వహించిన వై రాజా వై చిత్రాలు ఒకే రోజు తెరపైకి రానున్నాయి.
 
 ఉత్తమవిలన్: విశ్వరూపం వంటి విజ యవంతమైన చిత్రం తరువాత కమలహాసన్ నటించిన ఉత్తమ విలన్ మేనె ల ఒకటో తారీఖున విడుదల కానుంది. కమల్ సరసన పూజాకుమార్, ఆండ్రి య, ఊర్వశి, పార్వతినాయర్, పార్వతి మీనన్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి నటుడు రమేష్ అరవింద్ దర్శకుడు. తిరుపతి బ్రదర్స్ పతాకంపై దర్శకుడు లింగుస్వామి సమర్పణలో ఆయ న సోదరుడు సుభాష్ చంద్రబోస్ నిర్మిం చిన భారీ చిత్రం ఉత్తమవిలన్. దివంగత ప్రఖ్యాత దర్శకుడు కె.బాలచందర్, టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం 18వ శతాబ్దం ప్రస్తుత కాలానికి చెందిన సంఘటనలతో కూడిన నాటక, సినీ కళాకారుల ఇతివృత్తంగా రూపొం దించిన చిత్రం ఉత్తమవిలన్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
 
 వై రాజా వై : 3 వంటి సంచలన ప్రేమ కథా చిత్రాల ద్వారా దర్శకురాలిగా పరి చయమైన ఐశ్వర్యా ధనుష్ ఆ చిత్రం మిశ్రమ స్పందన తెచ్చుకున్న అందులోని వై దిస్ కొలవెరి పాట అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం పొందింది. ఆ విధంగా బహుళ ప్రచారం పొందిన చిత్రం 3. తరువాత ఐశ్వర్య ధనుష్ తెరకెక్కించిన చిత్రం వై రాజా వై. గౌతమ్ కార్తీక్ హీరోగా నటించిన ఈ చిత్రంలో ప్రియా ఆనంద్ హీరోయిన్‌గా నటించారు. ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మించిన ఈ చిత్రాన్ని ఉత్తమవిలన్  విడుదలవుతున్న రోజునే విడుదల చేయడానికి చిత్ర దర్శక నిర్మాతలు సిద్ధమయ్యారు. మరి ఈ చిత్రాల మధ్య పోటీ  తెలియాలంటే మరో పదిరోజులు ఆగాల్సిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement