ప్రాధాన్యత లేదు | not give preference heroine priya anand | Sakshi
Sakshi News home page

ప్రాధాన్యత లేదు

Published Wed, Sep 3 2014 12:23 AM | Last Updated on Sat, Sep 2 2017 12:46 PM

ప్రాధాన్యత లేదు

ప్రాధాన్యత లేదు

 హీరోయిన్లకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని గగ్గోలు పెడుతోంది ప్రియా ఆనంద్. తమిళంలో హీరోల చుట్టూనే కథలల్లుతున్నారు. హీరోయిన్లను ప్రేమించడానికి డ్యూయెట్లు పాడటానికి మాత్రమే పరిమితం చేస్తున్నారంటూ అమ్మడు ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ బ్యూటీ వేదనకు అర్థం లేకపోలేదు. తెలుగు, హిందీ భాషల్లో హీరోయిన్లకు బలమైన పాత్రలు లభిస్తున్నాయి. హిందీ చిత్రం ద డర్టీ పిక్చర్‌లో నటించిన విద్యాబాలన్ జాతీయ అవార్డును సొంతం చేసుకుంది.
 
 ఇక తెలుగులో నటి అనుష్క అరుంధతి లాంటి పవర్‌ఫుల్ పాత్రలో నటించి నటిగా తన కెరీర్‌కు గట్టి పునాదిని ఏర్పరచుకుంది. ప్రస్తుతం రుద్రమదేవి, బాహుబలి లాంటి చారిత్మ్రాతక కథా చిత్రాల్లో నటిస్తోంది. ప్రస్తుతం అలాంటి బలమైన పాత్రలు తమిళంలో హీరోయిన్లకు రావడం లేదు. అయితే తొలి రోజుల్లో హిట్స్ కోసం ముఖం వాచిన ప్రియా ఆనంద్ ఈ మధ్య రెండు మూడు విజయాలు రావడంతో తానేదో పెద్ద స్టార్ నయిపోయినట్టు హీరోయిన్లకు ప్రాధాన్యత నివ్వడం లేదని స్టేట్‌మెంట్స్ ఇవ్వడం హాస్యాస్పదం అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement