
నివీన్ పౌలీ
చేతిలో ఆయుధం ఉంది. గుండెల్లో తెగువ ఉంది. ఒంట్లో సత్తా ఉంది. ఇన్ని ఉంచుకుని కూడా ఒక హీరో తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడంటే అందుకో కారణం ఉంటుంది. ఇక్కడ నివీన్ పౌలీకి కూడా ఓ కారణం ఉంది. ఎందుకంటే అతను దొంగ. మాములు దొంగ కాదు. రాబిన్ హుడ్ టైప్. అంటే ధనవంతులను దోచి పేదలకు పంచుతాడన్నమాట. రోషన్ ఆండ్రూస్ దర్శకత్వంలో నివీన్ పౌలీ హీరోగా మలయాళంలో తెరకెక్కిన సినిమా ‘కాయమ్‌కులమ్ కొచ్చిన్’.
గోకులమ్ గోపాలన్ నిర్మించారు. ప్రియా ఆనంద్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో మోహన్‌లాల్ ఓ కీలక పాత్ర చేశారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ ఏడాది ఓనమ్ ఫెస్టివల్‌కు సినిమాను రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. అప్పటి ట్రవాంకూర్ ఏరియాలో దారిదోపిడి దొంగగా హడలెత్తించిన కాయమ్‌కులమ్ జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందిందని మాలీవుడ్ టాక్. ప్రియాంకా త్రిమ్మేష్, సున్నీ వాణ్నే, బాబు ఆంటోనీ తదితరులు నటించిన ఈ సినిమాకు గోపీ సుందర్ స్వరకర్త.
Comments
Please login to add a commentAdd a comment