నిత్యానంద
బెంగళూరు: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానందకు పురుషత్వ పరీక్షలు నిర్వహించడానికి రాష్ట్ర హై కోర్టు అనుమతించింది. పురుషత్వ పరీక్షల నుంచి తనను మినహాయించాలని ఆయన వేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది.జులై 28 నుంచి నిత్యానందను పోలీసులు కష్టడీలోకి తీసుకుని పురుషత్వ, రక్త తదితర పరీక్షలతో పాటు విచారణ కూడా చేయవచ్చునని హై కోర్టు తెలిపింది.
ఈ కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే నిత్యానందకు పురుషత్వ పరీక్షలు నిర్వహించాలని రామనగర సెషన్స్ కోర్టు ఆదేశించింది. అయితే దీనిని ప్రశ్నిస్తూ నిత్యానంద హై కోర్టును ఆశ్రయించారు. తాను థార్మిక గురువునని, తనకు ఐహిక సుఖాలపై వాంఛలు ఉండవన్నారు. అందువల్ల తనకు పురషత్వ పరీక్షలు నిర్వహించకూడదని పేర్కొన్నాడు. ఈ కేసును విచారించిన హై కోర్టు నిత్యానంద దాఖలు చేసిన పిటిషన్ను కొట్టి వేసింది. కేసుకు సంబంధించిన సాధారణ ప్రజల మాదిరిగానే నిత్యానందను విచారించాలని అవసరమైన పరీక్షలు నిర్వహించవచ్చునని కోర్టు తీర్పు చెప్పింది.