Masculinity test
-
నిత్యానంద పురుషత్వ పరీక్షలపై స్టే
న్యూఢిల్లీ: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానందకు పురుషత్వ పరీక్షలు నిర్వహించడంపై సుప్రీం కోర్టు తాత్కాలికంగా స్టే విధించింది. అత్యాచారం కేసులో నిందితుడైన నిత్యానందకు పురుషత్వ పరీక్షలు నిర్వహించడానికి కర్ణాటక హై కోర్టు గత నెలలో అనుమతించిన విషయం తెలిసిందే. పురుషత్వ పరీక్షల నుంచి తనను మినహాయించాలని నిత్యానంద దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. జులై 28 నుంచి నిత్యానందను పోలీసులు కష్టడీలోకి తీసుకుని పురుషత్వ, రక్త తదితర పరీక్షలతో పాటు విచారణ కూడా చేయవచ్చునని హై కోర్టు తెలిపింది. నిత్యానందపై అత్యాచార కేసు పూర్వాపరాలను పరిశీలించిన రామనగర సెషన్స్ కోర్టు తొలుత నిత్యానందకు పురుషత్వ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. అయితే దీనిని ప్రశ్నిస్తూ నిత్యానంద హై కోర్టును ఆశ్రయించారు. తాను థార్మిక గురువునని, తనకు ఐహిక సుఖాలపై వాంఛలు ఉండవన్నారు. అందువల్ల తనకు పురషత్వ పరీక్షలు నిర్వహించకూడదని పేర్కొన్నాడు. ఈ కేసును విచారించిన హై కోర్టు నిత్యానంద దాఖలు చేసిన పిటిషన్ను కొట్టి వేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఈ నెల 6న పురుషత్వ పరీక్షల కోసం బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రికి హాజరు కావాలని సిఐడి అధికారులు గత నెల 27న నిత్యానందకు నోటీసులు జారీ చేశారు. పరీక్షలకు హాజరుకాకపోతే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ నేపధ్యంలో నిత్యానంద సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సుప్రీం కోర్టు పురుషత్వ పరీక్షలపై ప్రస్తుతానికి స్టే విధిస్తూ, ఇతర వైద్య పరీక్షలకు, విచారణకు నిత్యానంద సహకరించాలని ఆదేశించింది. పూర్వాపరాలు తెలుసుకునేందుకు ఈ కేసు లోతులకు వెళ్లవలసిన అవసరం ఉందని కోర్టు తెలిపింది. అత్యాచారం కేసులో నిందుతులైన నిత్యానంద, అతని సహచరులు ఈ నెల 6న సిఐడి అధికారుల ముందు హాజరుకావాలని ఆదేశించింది. అదేవిధంగా ఈ నెల 18న బెంగళూరులోని రామనగర చీఫ్ జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ ముందర హాజరు కావాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
బయటపడనున్న నిత్యానంద బండారం!
బెంగళూరు: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద అసలు బండారం బయట పడనుంది. అతనికి పురుషత్వ పరీక్షలు చేయనున్నారు. వచ్చే నెల 6న పురుషత్వ పరీక్షల కోసం విక్టోరియా ఆస్పత్రికి హాజరు కావాలని సిఐడి అధికారులు ఆదివారం నిత్యానందకు నోటీసులు జారీ చేశారు. పరీక్షలకు హాజరుకాకపోతే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. అతనిపై పలు కేసులు ఉన్న విషయం తెలిసిందే. వాటిలో ఒక కేసుకు సంబంధించి అతనికి పురుషత్వ పరీక్షలు నిర్వహించాలని రామనగర జిల్లా కోర్టు ఆదేశించింది. జిల్లా కోర్టు ఆదేశాలపై నిత్యానంద హైకోర్టును ఆశ్రయించారు. పురుషత్వ పరీక్షల నుంచి తనను మినహాయించాలని హైకోర్టును కోరారు. తాను థార్మిక గురువునని, తనకు ఐహిక సుఖాలపై వాంఛలు ఉండవని, అందువల్ల తనకు పురషత్వ పరీక్షలు నిర్వహించకూడదని పేర్కొన్నాడు. ఈ కేసును విచారించిన హై కోర్టు నిత్యానంద దాఖలు చేసిన పిటిషన్ను కొట్టి వేసింది. కేసుకు సంబంధించిన సాధారణ ప్రజల మాదిరిగానే నిత్యానందను విచారించాలని అవసరమైన పరీక్షలు నిర్వహించవచ్చునని కోర్టు తీర్పు చెప్పింది. కింది కోర్టు ఆదేశాలను హైకోర్టు సమర్థించింది. జులై 28 నుంచి నిత్యానందను పోలీసులు కష్టడీలోకి తీసుకుని పురుషత్వ, రక్త తదితర పరీక్షలతో పాటు విచారణ కూడా చేయవచ్చునని హైకోర్టు తెలిపింది. దాంతో సిఐడి అధికారులు ఈ ఆదేశాలు జారీ చేశారు. -
నిత్యానందకు పురుషత్వ పరీక్షలకు హైకోర్టు అనుమతి
బెంగళూరు: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానందకు పురుషత్వ పరీక్షలు నిర్వహించడానికి రాష్ట్ర హై కోర్టు అనుమతించింది. పురుషత్వ పరీక్షల నుంచి తనను మినహాయించాలని ఆయన వేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది.జులై 28 నుంచి నిత్యానందను పోలీసులు కష్టడీలోకి తీసుకుని పురుషత్వ, రక్త తదితర పరీక్షలతో పాటు విచారణ కూడా చేయవచ్చునని హై కోర్టు తెలిపింది. ఈ కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే నిత్యానందకు పురుషత్వ పరీక్షలు నిర్వహించాలని రామనగర సెషన్స్ కోర్టు ఆదేశించింది. అయితే దీనిని ప్రశ్నిస్తూ నిత్యానంద హై కోర్టును ఆశ్రయించారు. తాను థార్మిక గురువునని, తనకు ఐహిక సుఖాలపై వాంఛలు ఉండవన్నారు. అందువల్ల తనకు పురషత్వ పరీక్షలు నిర్వహించకూడదని పేర్కొన్నాడు. ఈ కేసును విచారించిన హై కోర్టు నిత్యానంద దాఖలు చేసిన పిటిషన్ను కొట్టి వేసింది. కేసుకు సంబంధించిన సాధారణ ప్రజల మాదిరిగానే నిత్యానందను విచారించాలని అవసరమైన పరీక్షలు నిర్వహించవచ్చునని కోర్టు తీర్పు చెప్పింది.