నిత్యానంద- వెనుక రంజిత
బెంగళూరు : వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద స్వగ్రామానికి పయనమవుతున్నారు. బిడది వద్ద 2003లో ధ్యాన పీఠం ఆశ్రమం స్థాపించిన నిత్యానంద సినిమా నటి రంజితతో రాసలీలల సీడీ వెలుగులోకి వచ్చేవరకు అప్రతిహతంగా తన బోధనలు సాగించారు. ఆ తరువాత వరుస వివాదాలు, పోలీస్ కేసులు, అత్యాచారం ఆరోపణలు, వివిధ సంఘాల నిరసనలను ఎదుర్కోవలసిన పరిస్థితి ఏర్పడింది. దాంతో బెంగళూరును వదిలి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపధ్యంలో తన స్వగ్రామం తమిళనాడులోని తిరువణ్ణామలై వెల్లిపోయి అక్కడే ఉండిపోవాలని నిర్ణయించుకున్నారు.
సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సోమవారం ఆయనకు పుంసత్వ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ రోజు ఆశ్రమంలో ప్రవచనాల సందర్భంగా బిడదిని వదిలి తిరువణ్ణామలైకు వెళ్లిపోవాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. ఇక మళ్లీ ఈ ఆశ్రమానికి రానని చెప్పారు. కోర్టు కేసులకు మాత్రం హాజరవుతానన్నారు. నిత్యానంద మానసికంగా బాగా కుంగిపోయినట్లుగా భక్తులు భావిస్తున్నారు.
**