Bidadi
-
నిత్యానంద స్వగ్రామ పయనం
బెంగళూరు : వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద స్వగ్రామానికి పయనమవుతున్నారు. బిడది వద్ద 2003లో ధ్యాన పీఠం ఆశ్రమం స్థాపించిన నిత్యానంద సినిమా నటి రంజితతో రాసలీలల సీడీ వెలుగులోకి వచ్చేవరకు అప్రతిహతంగా తన బోధనలు సాగించారు. ఆ తరువాత వరుస వివాదాలు, పోలీస్ కేసులు, అత్యాచారం ఆరోపణలు, వివిధ సంఘాల నిరసనలను ఎదుర్కోవలసిన పరిస్థితి ఏర్పడింది. దాంతో బెంగళూరును వదిలి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపధ్యంలో తన స్వగ్రామం తమిళనాడులోని తిరువణ్ణామలై వెల్లిపోయి అక్కడే ఉండిపోవాలని నిర్ణయించుకున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సోమవారం ఆయనకు పుంసత్వ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ రోజు ఆశ్రమంలో ప్రవచనాల సందర్భంగా బిడదిని వదిలి తిరువణ్ణామలైకు వెళ్లిపోవాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. ఇక మళ్లీ ఈ ఆశ్రమానికి రానని చెప్పారు. కోర్టు కేసులకు మాత్రం హాజరవుతానన్నారు. నిత్యానంద మానసికంగా బాగా కుంగిపోయినట్లుగా భక్తులు భావిస్తున్నారు. ** -
స్వామి నిత్యానందపై ఫిర్యాదు
చెన్నై: స్వామి నిత్యానందపై ఓ ఇంజినీర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిత్యానంద నుంచి ప్రకటన హోర్డింగులకు సంబంధించి రూ.70 లక్షల బాకీ ఇచ్చించాలని కోరుతూ తిరుచెంగోడుకు చెందిన కంప్యూటర్ ఇంజినీరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తిరుచెంగోడు వీరరాఘవ మొదలియార్ వీధికి చెందిన సెంగోట్టువేలు (45) కంప్యూటర్ ఇంజినీరుగా పనిచేస్తున్నాడు. ఫిర్యాదులో పేర్కొన వివరాల్లోకి వెళితే.... బిడది ఆశ్రమానికి చెందిన నిత్యానంద పరమహంసకు 2011 నుంచి ఆధ్యాత్మిక ప్రకటనలు రూపొందించి సీడీల రూపంలో అందచేశానన్నాడు. దీనికి సంబంధించిన చార్జీలు, రాయల్టీ రూ.70 లక్షల వరకు తనకు రావాల్సి ఉందన్నాడు. ఆ డబ్బును నిత్యానంద నుంచి తనకు అందచేయాలని, అంతేకాకుండా తన ప్రకటన సీడీలు ప్రసారం చేయకుండా నిలిపివేయాలని కోరాడు. తనకు ప్రాణ రక్షణ కల్పించాలని, ఇటీవలి తనపై దాడి చేసిన నలుగురు మహిళా సన్యాసులపై చర్యలు తీసుకోవాలని కోరాడు.