స్వామి నిత్యానందపై ఫిర్యాదు | Engineer complaint against swami nithyananda | Sakshi
Sakshi News home page

స్వామి నిత్యానందపై ఫిర్యాదు

Published Sat, Jan 4 2014 8:14 AM | Last Updated on Sat, Sep 2 2017 2:17 AM

స్వామి నిత్యానందపై ఫిర్యాదు

స్వామి నిత్యానందపై ఫిర్యాదు

చెన్నై:  స్వామి నిత్యానందపై ఓ ఇంజినీర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిత్యానంద నుంచి ప్రకటన హోర్డింగులకు సంబంధించి రూ.70 లక్షల బాకీ ఇచ్చించాలని కోరుతూ తిరుచెంగోడుకు చెందిన కంప్యూటర్ ఇంజినీరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తిరుచెంగోడు వీరరాఘవ మొదలియార్ వీధికి చెందిన సెంగోట్టువేలు (45) కంప్యూటర్ ఇంజినీరుగా పనిచేస్తున్నాడు.  ఫిర్యాదులో పేర్కొన వివరాల్లోకి వెళితే....

బిడది ఆశ్రమానికి చెందిన నిత్యానంద పరమహంసకు 2011 నుంచి ఆధ్యాత్మిక ప్రకటనలు రూపొందించి సీడీల రూపంలో అందచేశానన్నాడు. దీనికి సంబంధించిన చార్జీలు, రాయల్టీ రూ.70 లక్షల వరకు తనకు రావాల్సి ఉందన్నాడు. ఆ డబ్బును నిత్యానంద నుంచి తనకు అందచేయాలని, అంతేకాకుండా తన ప్రకటన సీడీలు ప్రసారం చేయకుండా నిలిపివేయాలని కోరాడు. తనకు ప్రాణ రక్షణ కల్పించాలని, ఇటీవలి తనపై దాడి చేసిన నలుగురు మహిళా సన్యాసులపై చర్యలు తీసుకోవాలని కోరాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement