swami nithyananda
-
ఆ అక్కాచెల్లెళ్లు.. నిత్యానంద ‘కైలాస’లో
అహ్మదాబాద్: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద ఆశ్రమంలో చేరి కనిపించకుండా పోయిన అక్కాచెల్లెళ్లు ప్రస్తుతం.. ‘‘కైలాస’’లో ఉన్నట్లు తెలిసిందని గుజరాత్ పోలీసులు వెల్లడించారు. భారత- కరేబియన్ సంస్కృతుల మేళవింపుతో కూడిన ‘చట్నీ మ్యూజిక్’ అనే కళను అభ్యసిస్తూ.. వారిద్దరు అక్కడ ప్రదర్శనలు కూడా ఇస్తున్నట్లు సమాచారం అందిందన్నారు. అదే విధంగా కరేబియన్ దీవుల్లో నిత్యానంద కొనుగోలు చేసిన ‘కైలాస’ నిర్వహణ బాధ్యతల్లో కూడా పాలుపంచుకుంటున్నట్లు తెలిసిందన్నారు. కాగా కర్ణాటకకు చెందిన జనార్థన శర్మ కూతుళ్లే ఈ అక్కాచెల్లెళ్లు. శర్మకు నలుగురు కూతుళ్లు ఉండగా.. 2013లో వీరిని నిత్యానంద ఆశ్రమానికి చెందిన విద్యా సంస్థలో చేర్పించారు.(నిత్యానంద దేశం.. కైలాస!) ఈ క్రమంలో తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండానే వారిని 2019లో అహ్మదాబాద్‌లో ఉన్న యోగిని సర్వజ్ఞాన పీఠానికి పంపించారు. విషయం తెలుసుకున్న శర్మ దంపతులు.. అహ్మదాబాద్ ఆశ్రమానికి వెళ్లగా నిర్వాహకులు వారిని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులను ఆశ్రయించిన బాధితులు.. వారి సాయంతో లోపల ప్రవేశించి తమ ఇద్దరు మైనర్ కూతుళ్లను ఇంటికి తీసుకురాగా.. మేజర్లైన మరో ఇద్దరు కూతుళ్లు లోముద్ర శర్మ(21), నందిత(18) వారితో వెళ్లేందుకు ఇష్టపడలేదు. దీంతో బెదిరింపులకు లొంగి ఆశ్రమంలో ఉండిపోయిన.. తమ ఇద్దరు కూతుళ్లను అప్పగించాలని కోరుతూ శర్మ దంపతులు గుజరాత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో నిత్యానంద వారిని విదేశాలకు తీసుకువెళ్లినట్లు తాజా సమాచారం ద్వారా వెల్లడైంది.(నిత్యానందకు నోటీసులపై వింత జవాబు) ఈ విషయం గురించి ఓ పోలీసు ఉన్నతాధికారి టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘నిత్యానందకు వ్యతిరేకంగా ఇంతవరకు మేము రెడ్ కార్నర్ నోటీసు పొందలేకపోయాం. ఇప్పుడు వాళ్లు ఒకవేళ కైలాసలో ఉన్న విషయం నిజమే అయినా.. వారిని ఎలా వెనక్కి తీసుకురావాలో అర్థం కావడంలేదు. అప్పగింత ఒప్పందం ప్రకారం నిర్ణయం తీసుకోవాలని భావించినా.. ఏ దేశంతో ఈ మేరకు సంప్రదింపులు జరపాలో అన్న విషయంపై స్పష్టత లేదు’’అని వాపోయారు. కాగా ఆధ్మాత్మికత ముసుగులో మహిళలపై అకృత్యాలకు పాల్పడిన నిత్యానంద దేశాన్ని విడిచి పారిపోయిన విషయం తెలిసిందే. ఈక్వెడార్ నుంచి ఒక చిన్న ద్వీపాన్ని కొనుగోలు చేసి, దానికి ‘కైలాస’ అనే పేరు కూడా పెట్టినట్లు వెల్లడించాడు. అంతేగాక తన దేశానికి ఒక పాస్‌పోర్ట్, జెండా, జాతీయ చిహ్నాన్ని డిజైన్ చేసినట్లు పేర్కొన్నాడు. అదే విధంగా ప్రధాన మంత్రిని, కేబినెట్‌ను కూడా ఏర్పాటు చేసి పాలన చేస్తున్నట్లు వెల్లడించాడు. -
కైలాసం పూర్తయింది!
సాక్షి, చెన్నై: పరారీలో ఉన్న స్వామి నిత్యానంద తాజా వీడియో మరోసారి సంచలనం సృష్టిస్తోంది. కైలాసం నిర్మాణం పూర్తయిందని, ఇకపై తాను తమిళనాడుకు రానని అతడు చేసిన వ్యాఖ్యల వీడియో ప్రస్తుతం హల్చల్ చేస్తోంది. కాగా స్వామి నిత్యానందపై బెంగళూరుకు చెందిన జనార్దన్ శర్మ గుజరాత్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అందులో శర్మ తన ఇద్దరు కుమార్తెలను కిడ్నాప్ చేసి అహ్మదాబాద్ ఆశ్రమంలో నిర్బంధించారంటూ చేసిన ఫిర్యాదుతో నిత్యానందపై కిడ్నాప్ కేసు నమోదైంది. వరుస కేసుల క్రమంలో నిత్యానంద విదేశాలకు పరారయ్యాడు. కిడ్నాప్ కేసులో గుజరాత్ పోలీసులు అంతర్జాతీయ పోలీసుల (ఇంటర్‌పోల్) సాయం కోరారు. అయినప్పటికీ అతను ఉన్న ప్రాంతాన్ని గుర్తించలేకపోయారు. ఇలావుండగా నిత్యానంద వెల్లడించినట్లుగా ఒక కొత్త వీడియో విడుదలై సంచలనం సృష్టిస్తోంది. అందులో నిత్యానంద కైలాసం నిర్మాణం పూర్తయిందని, ఇకపై తాను తమిళనాడుకు రానని వెల్లడించాడు. తాను మృతి చెందితే తన భౌతికకాయాన్ని బిడది శ్రమంలో ఖననం చేయాలని, అదే తన చివరి ఆశ అని అందులో తెలిపాడు. కాగా నిత్యానంద ఈక్వెడార్ సమీపం కైలాసం పేరుతో కొత్త దీవిని ఏర్పాటుచేసి స్వత్రంత్ర దేశంగా రూపొందించే ప్రయత్నంలో ఉన్నట్లు వార్తలు వెలువడ్డ విషయం విదితమే. -
నిత్యానందకు నోటీసులపై వింత జవాబు
బెంగళూరు: దేశం విడిచి పారిపోయిన వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద గురించి కర్ణాటక పోలీసులు హైకోర్టుకు వింత సమాధానం ఇచ్చారు. నిత్యానంద ఆధ్యాత్మిక పర్యటనలో ఉన్న కారణంగా ఆయనకు నోటీసులు జారీ చేయలేకపోయామని న్యాయస్థానానికి విన్నవించారు. అత్యాచారం, మోసం, ఆధారాలు మాయం చేయడం, పోలీసులను తప్పుదోవ పట్టించడం సహా పలు కేసుల్లో నిత్యానంద నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఈ మేరకు 2010లో ఆయనపై కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో రెండుసార్లు అరెస్టైన నిత్యానంద.. రామనగరలోని అదనపు జిల్లా సెషన్స్ కోర్టులో విచారణ ఎదుర్కొని .. బెయిలుపై బయటకు వచ్చాడు. (నిత్యానందపై ఇంటర్‌పోల్ నోటీస్) ఇదిలా ఉండగా... బాలికలను అపహరించడం సహా వారిని లైంగికంగా వేధించినట్లు ఇటీవల ఆరోపణలు ఎదుర్కొన్న నిత్యానంద.. 2018లో దేశం విడిచి పారిపోయాడు. అంతేగాక ఈక్వెడార్ సమీపంలోని ఓ దీవిలో ‘కైలాస’ అనే పేరుతో హిందూ రాజ్యం స్థాపించినట్లు ప్రకటనలు విడుదల చేశాడు. అయితే ఈక్వెడార్ మాత్రం ఈ వార్తలను కొట్టిపారేసింది. ఈ క్రమంలో నిత్యానంద ఆచూకీ కోసం అంతర్జాతీయ పోలీస్ సంస్థ ఇంటర్‌పోల్ ఇటీవలే బ్లూకార్నర్ నోటీస్ జారీ చేసింది. (ఏ కోర్టూ నన్నేమీ చేయలేదు: నిత్యానంద) ఈ నేపథ్యంలో 2010 నాటి కేసులో నిత్యానంద బెయిలును రద్దు చేయాల్సిందిగా పిటిషన్ దాఖలైన నేపథ్యంలో.. అతడిని కోర్టులో ప్రవేశపెట్టాల్సిందిగా కర్ణాటక హైకోర్టు జనవరి 31న పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో వాళ్లు నిత్యానందకు చెందిన ఆశ్రమానికి వెళ్లగా.. అక్కడ ఆయన లేరని.. దీంతో ఆయన అనుచరురాలు కుమారి అర్చానందకు నోటీసులు ఇచ్చామని తెలిపారు. నిత్యానంద ఆధ్యాత్మిక టూర్లో ఉన్న కారణంగా ఆయనను న్యాయస్థానం ఎదుటకు తీసుకురాలేకపోయామని వెల్లడించారు. కాగా నిత్యానంద తరఫున కోర్టుకు హాజరైన కుమారి అర్చానంద.. నిత్యానంద ఎక్కడ ఉన్నాడో తనకు తెలియదని.. ఈ విషయం చెప్పినప్పటికీ పోలీసులు తనను ఇక్కడి తీసుకువచ్చారంటూ న్యాయస్థానం ఎదుట వాపోయింది. ఈ క్రమంలో పోలీసుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వివిధ కేసుల్లో నిందితుడైన నిత్యానందపై ఇంటర్‌పోల్ నోటీసులు జారీ చేసినప్పటికీ ఆయన ఆధ్యాత్మిక టూర్లో ఉన్నారని పోలీసులు చెప్పడమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇంతకూ నిత్యానంద కథేంటి? -
నిత్యానంద దేశం.. అశ్విన్ ఆసక్తి!
హైదరాబాద్: అత్యాచారం సహా పలు ఆరోపణలు ఎదుర్కొంటూ దేశం విడిచి పారిపోయిన వివాదాస్పద స్వామీజీ నిత్యానంద కొత్తగా సృష్టించిన కైలాస దేశంపై సర్వత్రా ఆసక్తికర చర్చ జరుగుతోంది. నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఈ అంశంపై విభిన్న రకాలుగా స్పందిస్తున్నారు. తాజాగా టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చేసిన ట్వీట్ ఆసక్తి రేపింది. ‘కైలాసానికి వెళ్లేందుకు వీసా ఎలా పొందాలి? లేదంటే అక్కడికి వెళ్లాక వీసా ఇస్తారా?’ అంటూ అశ్విన్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ తెగ వైరల్‌గా మారింది. కైలాస దేశం చూడటానికి వెళతావా? లేదంటే అక్కడే స్థిరపడతావా? అంటూ నెటిజన్లే ప్రశ్నిస్తున్నారు. ఇక నిత్యానంద దేశంపై అశ్విన్‌కు ఎందుకంత ఆసక్తి అంటూ మరొకరు వ్యంగ్యంగా ప్రశ్నించారు. అసలు ఈ కొత్త దేశం ముచ్చటేంటంటే! వివాదాస్పద స్వామీజీ నిత్యానంద సొంతంగా ఓ దేశాన్నే ఏర్పాటు చేసుకున్నారు. ఈక్వెడార్ నుంచి ఒక చిన్న ద్వీపాన్ని కొనుగోలు చేసి, దానికి ‘కైలాస’ అనే పేరు కూడా పెట్టారు. ట్రినిడాడ్ అండ్ టొబాగోకు దగ్గర్లో ఉన్న తన ద్వీప దేశానికి ఒక పాస్‌పోర్ట్‌ను, జెండాను, జాతీయ చిహ్నాన్ని డిజైన్ చేశారు. ఒక ప్రభుత్వాన్ని, ప్రధాన మంత్రిని, కేబినెట్‌ను కూడా ఏర్పాటు చేశారు. రోజూ కేబినెట్ భేటీలు కూడా జరుపుతున్నారని సమాచారం. ప్రధానిగా ‘మా’ని నియమించారని, గోల్డ్, రెడ్ కలర్లలో పాస్‌పోర్ట్‌ను రూపొందించారని ఆ ‘దేశ’ వెబ్సైట్ పేర్కొంది. తన ‘కైలాస’కు ఒక దేశంగా గుర్తింపునివ్వాలని కూడా నిత్యానంద ఐక్యరాజ్య సమితికి విజ్ఞప్తి చేయనున్నారు. హిందూత్వని ప్రచారం చేస్తున్నందువల్ల భారత్‌లో తన జీవితం ప్రమాదంలో పడిందని ఐరాసకు పంపనున్న వినతి పత్రంలో నిత్యానంద పేర్కొన్నారు. కైలాస రాజకీయేతర హిందూ దేశమని, హిందూత్వ పునరుద్ధరణ కోసం కృషి చేస్తుందని ఆ వెబ్సైట్లో పేర్కొన్నారు. దేశ పౌరసత్వం కావాలనుకునేవారు విరాళాలు ఇవ్వాలనే విజ్ఞప్తిని కూడా అందులో పొందుపర్చారు. మెరూన్ కలర్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఓ సింహాసనం ముందు నిత్యానంద కూర్చుని ఉండగా పక్కన నంది ఉన్న చిత్రంతో జెండాను రూపొందించారు. ప్రభుత్వంలో 10 శాఖలను కూడా ఏర్పాటుచేశారు. అందులో ఒకటి నిత్యానంద స్వామి కార్యాలయం కాగా, విదేశీ వ్యవహారాలు, రక్షణ, సోషల్ మీడియా, హోం, కామర్స్, విద్య.. మొదలైన ఇతర శాఖలు ఉన్నాయి. -
నిత్యానంద దేశం.. కైలాస!
న్యూఢిల్లీ: అత్యాచారం సహా పలు ఆరోపణలు ఎదుర్కొంటూ దేశం విడిచి పారిపోయిన వివాదాస్పద స్వామీజీ నిత్యానంద సొంతంగా ఓ దేశాన్నే ఏర్పాటు చేసుకున్నారు. ఈక్వెడార్ నుంచి ఒక చిన్న ద్వీపాన్ని కొనుగోలు చేసి, దానికి ‘కైలాస’ అనే పేరు కూడా పెట్టారు. ట్రినిడాడ్ అండ్ టొబాగోకు దగ్గర్లో ఉన్న తన ద్వీప దేశానికి ఒక పాస్‌పోర్ట్‌ను, జెండాను, జాతీయ చిహ్నాన్ని డిజైన్ చేశారు. ఒక ప్రభుత్వాన్ని, ప్రధాన మంత్రిని, కేబినెట్‌ను కూడా ఏర్పాటు చేశారు. రోజూ కేబినెట్ భేటీలు కూడా జరుపుతున్నారని సమాచారం. ప్రధానిగా ‘మా’ని నియమించారని, గోల్డ్, రెడ్ కలర్లలో పాస్‌పోర్ట్‌ను రూపొందించారని ఆ ‘దేశ’ వెబ్సైట్ పేర్కొంది. తన ‘కైలాస’కు ఒక దేశంగా గుర్తింపునివ్వాలని కూడా నిత్యానంద ఐక్యరాజ్య సమితికి విజ్ఞప్తి చేయనున్నారు. హిందూత్వని ప్రచారం చేస్తున్నందువల్ల భారత్‌లో తన జీవితం ప్రమాదంలో పడిందని ఐరాసకు పంపనున్న వినతి పత్రంలో నిత్యానంద పేర్కొన్నారు. కైలాస రాజకీయేతర హిందూ దేశమని, హిందూత్వ పునరుద్ధరణ కోసం కృషి చేస్తుందని ఆ వెబ్సైట్లో పేర్కొన్నారు. దేశ పౌరసత్వం కావాలనుకునేవారు విరాళాలు ఇవ్వాలనే విజ్ఞప్తిని కూడా అందులో పొందుపర్చారు. మెరూన్ కలర్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఓ సింహాసనం ముందు నిత్యానంద కూర్చుని ఉండగా పక్కన నంది ఉన్న చిత్రంతో జెండాను రూపొందించారు. ప్రభుత్వంలో 10 శాఖలను కూడా ఏర్పాటుచేశారు. అందులో ఒకటి నిత్యానంద స్వామి కార్యాలయం కాగా, విదేశీ వ్యవహారాలు, రక్షణ, సోషల్ మీడియా, హోం, కామర్స్, విద్య.. మొదలైన ఇతర శాఖలు ఉన్నాయి. ప్రతిపాదిత కైలాస దేశ పాస్‌పోర్టు తమది సరిహద్దులు లేని దేశమని, తమ తమ దేశాల్లో స్వేచ్ఛగా హిందూయిజాన్ని అనుసరించలేని వారి కోసం ఈ దేశం ఏర్పాటయిందని కైలాస వెబ్ సైట్లో పేర్కొన్నారు. తమ దేశంలో ఉచితంగానే భోజనం, విద్య, వైద్యం లభిస్తాయని, ఆధ్యాత్మిక విద్య, ప్రత్యామ్నాయ వైద్య విధానాలపై దృష్టి పెడతామని ఆ వెబ్సైట్లో పేర్కొన్నారు. ‘మాది భౌగోళికపరమైన దేశం కాదు. ఒక భావనాత్మక దేశం. శాంతి, స్వేచ్ఛ, సేవాతత్పరతల దేశం. ఏ దేశ ఆధిపత్యం కింద లేని మేం ఇతర దేశాలతో, అంతర్జాతీయ సంస్థలతో దౌత్య సంబంధాలు ఏర్పాటు చేసుకుంటాం’ అని అందులో తెలిపారు. నకిలీ పాస్‌పోర్ట్‌తో, నేపాల్ మీదుగా ఇటీవల నిత్యానంద పారిపోయారు. -
మా కూతుళ్లను అప్పగించండి ప్లీజ్..!
అహ్మదాబాద్ : స్వామి నిత్యానంద ఆశ్రమంలో నిర్బంధించిన తమ కూతుళ్లను విడిపించాలంటూ ఓ జంట గుజరాత్ హైకోర్టును ఆశ్రయించింది. తమ ఇద్దరు కూతుళ్లను తమకు అప్పగించాలని కోరుతూ సోమవారం పిటిషన్ దాఖలు చేసింది. వివరాలు... జనార్థన శర్మ దంపతులకు నలుగురు కూతుళ్లు ఉన్నారు. 2013లో వీరిని బెంగళూరులోని నిత్యానంద ఆశ్రమానికి చెందిన విద్యాసంస్థలో చేర్పించారు. అప్పటి నుంచి అక్కడికి వెళ్లి వస్తూ వారి క్షేమ సమాచారాలు తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో ఈ ఏడాది ప్రారంభంలో శర్మ నలుగురు కూతుళ్లను నిత్యానంద ధాన్యపీఠం నుంచి అహ్మదాబాద్‌లోని యోగిని సర్వఙ్ఞాన పీఠానికి బదిలీ చేశారు. విషయం తెలుసుకున్న వీరు తమ కూతుళ్లను కలిసేందుకు వెళ్లగా... సర్వఙ్ఞాన పీఠ అధికారులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసుల సహాయంతో శర్మ దంపతులు ఆశ్రమానికి వెళ్లి తమ ఇద్దరు మైనర్ కూతుళ్లను ఇంటికి తీసుకువచ్చారు. అయితే మేజర్లైన మరో ఇద్దరు కూతుళ్లు లోముద్ర శర్మ(21), నందిత(18) తల్లిదండ్రులతో వచ్చేందుకు నిరాకరించారు. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేసిన శర్మ దంపతులు.. తమ ఇద్దరు కూతుళ్లను ఆశ్రమ నిర్వాహకులు బెదిరించి.. తమతో రాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశామని.. దయచేసి తమ అభ్యర్థనను మన్నించి తమ కూతుళ్లు ఇంటికి తిరిగి వచ్చేలా ఆశ్రమ నిర్వాహకులను ఆదేశించాలని కోర్టుకు విన్నవించారు. పోలీసుల సహాయంతో వారిద్దరినీ కోర్టు ఎదుట ప్రవేశపెట్టిన తర్వాత తమకు అప్పగించాలని కోరారు. కాగా స్వామీజీగా చెప్పుకొనే నిత్యానంద రాసలీల వీడియోలు బయటపడటంతో తీవ్ర ప్రకంపనలు రేగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయనపై పలు అత్యాచార కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఇవి కర్ణాటక కోర్టులో విచారణలో ఉన్నాయి. -
నిత్యానందపై కోర్టు కన్నెర్ర
సాక్షి, చెన్నై: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానందపై సోమవారం మద్రాసు హైకోర్టు, మదురై ధర్మాసనం కన్నెర్ర చేసింది. అరెస్టుకు ఆదేశాలు ఇవ్వమంటారా? అని నిత్యానందను ఉద్దేశించి న్యాయమూర్తి జస్టిస్ మహాదేవన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టులో వాదనలను ఎస్ఎంఎస్ ద్వారా నిత్యానందకు చేరవేస్తున్న ఆయన శిష్యుడు నరేంద్రన్ను అరెస్టు చేయాలని ఆదేశించారు. తమిళనాడులో ప్రసిద్ధి చెందిన మదురై మఠాన్ని చేజిక్కించుకునేందుకు నిత్యానంద తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. తానే ఆ మఠానికి 293వ ఆధీనంగా ప్రకటించుకున్నారు. దీనిని వ్యతిరేకిస్తూ జగదల ప్రతాప్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై మదురై ధర్మాసనంలో విచారణ జరుగుతోంది. 292వ ఆధీనం జీవించి ఉండగానే, ఎలా 293వ ఆధీనం తెరమీదకు వస్తారని, ఇందుకు వివరణ ఇవ్వాలని నిత్యానందను ఏడాది క్రితం న్యాయమూర్తి ఆదేశించారు. అయితే నిత్యానంద తరఫున ఎలాంటి వివరణ కోర్టుకు చేరలేదు. సోమవారం ఈ పిటిషన్ విచారణకు రాగా తమకు మరింత సమయం కావాలని నిత్యానంద తరఫు న్యాయవాది కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీనికి న్యాయమూర్తి స్పందిస్తూ.. ఏడాది సమయం ఇచ్చినా చాలదా? నిత్యానందను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిలా ఆదేశాలు ఇవ్వమంటారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిత్యానందపై రోజురోజుకు ఫిర్యాదులు పెరుగుతున్నాయని, అరెస్టు చేసి కోర్టు బోనులో ఎక్కించేలా ఆదేశాలు ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించారు. తదుపరి విచారణను ఫిబ్రవరి 2వ తేదీకి వాయిదా వేశారు. అదే సమయంలో కోర్టులో సాగుతున్న వాదనల పర్వాన్ని ఎస్ఎంఎస్ ద్వారా నిత్యానందకు ఎప్పటికప్పుడు ఆయన శిష్యుడు నరేంద్రన్ అందిస్తుండటాన్ని కోర్టు సిబ్బంది గుర్తించి సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. దీంతో నరేంద్రన్ను అరెస్టు చేయాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. -
రంజితగా మారిన శ్రీవల్లి!
వివాదస్పద ఆధ్యాత్మిక గురువు స్వామి నిత్యానందకు సంబంధించిన రాసలీలల వీడియో 2010లో వెలుగులోకి రావడంతో దేశంలో కలకలం రేగింది. ఒకప్పటి హీరోయిన్ రంజిత, ఆయన ఏకాంతంగా కలిసి ఉన్న దృశ్యాలు దక్షిణాదిలోని టీవీ చానెళ్లు పదేపదే ప్రచారం చేశాయి. అయితే ఈ వీడియోలో ఉన్నది తాము కాదని, మార్ఫింగ్ జరిగిందని వీరిద్దరూ వాదించారు. ఈ టేపుల్లో ఉన్నది ఎవరో తేల్చాలని కోర్టు కెక్కారు కూడా. వీడియో టేపులు ట్యాంపరింగ్ జరగలేదని బెంగళూరు ఫోరెన్సిక్ ల్యాబ్ గతంలో స్పష్టం చేసింది. ఈ నివేదికను నిత్యానంద సవాల్ చేశారు. ఢిల్లీలోని సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా వీడియో ఉన్నది వీరిద్దరేనని తాజాగా నిర్ధారించడంతో నిత్యానంద, రంజిత వాదన అబ్ధమని తేలిపోయింది. ఎవరీ రంజిత..? తమిళనాడుకు చెందిన రంజిత 1975, జూన్ 4న జన్మించింది. ఆమె అసలు పేరు శ్రీవల్లి. ప్రముఖ దర్శకుడు పి. భారతిరాజా ఆమెను చిత్రసీమకు పరిచయం చేస్తూ పేరు మార్చారు. 1992లో ‘నాదోడి థెండ్రల్’ తమిళ సినిమాతో తెరంగ్రేటం చేసింది. ఆ తర్వాత ఆమె అగ్ర కథానాయకిగా ఎదిగింది. తమిళం పాటు తెలుగు, మలయాళం, కన్నడ సినిమాల్లో అగ్ర కథానాయకులతో నటించింది. 1996లో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘మావిచిగురు’ సినిమాకు ఉత్తమ సహాయనటిగా నంది అవార్డు అందుకుంది. ఆమె వాలీబాల్ క్రీడాకారిణి కూడా. పెళ్లి-విడాకులు సినిమాల్లో నటిస్తుండగానే 2000 సంవత్సరంలో ఆర్మీ మేజర్ రాకేశ్ మీనన్‌తో ఆమె వివాహమైంది. కాలేజీ రోజుల నుంచి వీరిద్దరికీ పరిచయం ఉంది. పెళ్లైన తర్వాత ఏడాది పాటు చిత్రసీమకు దూరంగా ఉన్న రంజిత 2001లో మళ్లీ పునఃప్రవేశం చేసింది. సహాయ పాత్రల్లో నటిస్తూ, టీవీ షోలు కూడా చేసింది. 2007లో భర్త నుంచి ఆమె విడాకులు తీసుకుంది. చివరిసారిగా 2010లో మణిరత్నం ‘రావణన్’ సినిమాలో కనిపించింది. వీడియోతో వెలుగులోకి.. స్వామి నిత్యానందతో ఏకాంతంగా గడిపిన వీడియో బహిర్గతం కావడంతో రంజిత పేరు మళ్లీ వెలుగులోకి వచ్చింది. సన్ టీవీ ఈ వీడియోను పదేపదే ప్రసారం చేయడంతో తీవ్ర కలకలం రేగింది. అయితే ఈ వీడియోలో ఉన్నది తాను కాదని రంజిత వాదించింది. తర్వాత కూడా ఆమె నిత్యానంద ఆశ్రమంలోనే ఉండిపోయింది. 2013, డిసెంబర్ 27న సన్యాసం స్వీకరించి ఆనందమయిగా పేరు మార్చుకుంది. బెంగళూరు శివారులోని నిత్యానంద ఆశ్రమంలో సన్యాసినిగా జీవితం గడుపుతోంది. -
శ్రీకాళహస్తిలో నిత్యానంద, రజిత
శ్రీకాళహస్తి(చిత్తూరు జిల్లా): వివాదస్పద ఆధ్యాత్మిక గురువు స్వామి నిత్యానంద గురువారం శ్రీకాళహస్తిలో ప్రత్యక్షమయ్యారు. తన అనుంగు శిష్యురాలు రజితతో కలిసి శ్రీకాళహస్తీశ్వరున్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా నిత్యానంద అనుచరులు అత్యుత్సాహం ప్రదర్శించారు. నిత్యానంద, రజితలను చిత్రీకరిస్తున్న మీడియా సిబ్బందిని అడ్డుకున్నారు. ఫొటోగ్రాఫర్ల పట్ల దురుసుగా ప్రవర్తించారు. నిత్యానంద, రజిత మీడియాతో మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. భక్తులు మాత్రం వీరిద్దరినీ ఆసక్తిగా గమనించారు. -
నిత్యానందా... ఏమిటిదంతా?
నిత్యా'ఆనందం'లో మునిగితేలే స్వాములోరికి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. శిష్యురాళ్ల 'అంతరంగిక సేవ'తో తరించే ఈ స్వయంప్రకటిత దేవుడికి పట్టరాని కోపం వచ్చింది. తన ప్రవచనాలతో భక్తులకు జ్ఞానబోధ చేసే ధ్యాన పీఠాధిపతి ఒంటికాలిపై లేచారు. తనకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న అలగా జనంపై స్వాములోనే చెణుకులు విసిరి చిక్కుల్లో పడ్డారు. అయినా చిక్కుల్లో పడడం చాకచక్యంగా తప్పించుకోవడం నిత్యానందుల వారికి 'వీడియో'తో పెట్టిన విద్య. అనుంగు శిష్యురాలు రంజితతో సన్నిహితంగా ఉన్న దృశ్యాలు రెచ్చకెక్కినప్పడు స్వాములోరు చూపిన సాహసం నిరూపమానం. తన దగ్గర 'విషయం' లేదని... విషయం లేకుండా వ్యవహారం ఎలా సాధ్యమంటూ ఎవరూ ఊహించని షాక్ ఇచ్చారు. దీంతో అంతవరకు స్వామిపై ఉన్న కోపం తగ్గిపోయి జాలి కలిగింది. 'రంజిత'నందాన్ని కొంతకాలం పక్కనపెట్టి పర్వత ప్రాంతాలకు పోతే అక్కడ కూడా స్వామలోరికి సుఖం లేదు. నిత్యానందుడు పర్వత సరస్సుల్లో విహరిస్తున్నారని ఛాయా చిత్రాలతో బయటపెట్టింది పాడులోకం. అన్ని మర్చిపోయి హాయిగా భక్తులతో కాలక్షేపం చేస్తున్న సర్వసంగ పరిత్యాగిని మళ్లీ యాగీ చేయడం న్యాయమా? అందుకో కాబోలు స్వామిలోరికి అంత కోపం వచ్చింది. కన్నడ భాష పేరిట తనకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నవారంతా డబ్బులు తీసుకుంటున్నారంటూ మండిపడ్డారు. 300 రూపాయల కోసం ఆశపడి మూడు గంటల ఆందోళన చేస్తున్నారని ఆరోపించారు. నిజానికి వారికి తనపై కోపం లేదని జాలి చూపారు. ఉద్యమానికి నేతృత్వం వహించే వారే కార్యకర్తల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని పరమ సత్యం వెల్లడించారు. నిత్యానందుల వారికి అంతా అలా తెలిసిపోతుటుంది మరి! -
శ్రీవారిని దర్శించుకున్న నిత్యానంద, రంజిత
తిరుమల: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద ధ్యాన పీఠాధిపతి నిత్యానంద స్వామి, ఆయన అంతరంగిక శిష్యురాలు, మాజీ నటి రంజిత బుధవారం తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయం అనంతరం వీరు శిష్యబృందంతో కలసి ఆలయానికి వచ్చారు. అధికారులు వారికి ప్రత్యేక దర్శనం చేయించారు. అనంతరం ఆలయం వద్ద మీడియా ఉండటాన్ని చూసిన రంజిత దూరంగా వెళ్లిపోయారు. చిత్రీకరిస్తున్న మీడియా సిబ్బందిని నిత్యానంద శిష్యబృందం ‘వద్దు..వద్దు..’ అంటూ అడ్డుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
స్వామి నిత్యానందపై ఫిర్యాదు
చెన్నై: స్వామి నిత్యానందపై ఓ ఇంజినీర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిత్యానంద నుంచి ప్రకటన హోర్డింగులకు సంబంధించి రూ.70 లక్షల బాకీ ఇచ్చించాలని కోరుతూ తిరుచెంగోడుకు చెందిన కంప్యూటర్ ఇంజినీరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తిరుచెంగోడు వీరరాఘవ మొదలియార్ వీధికి చెందిన సెంగోట్టువేలు (45) కంప్యూటర్ ఇంజినీరుగా పనిచేస్తున్నాడు. ఫిర్యాదులో పేర్కొన వివరాల్లోకి వెళితే.... బిడది ఆశ్రమానికి చెందిన నిత్యానంద పరమహంసకు 2011 నుంచి ఆధ్యాత్మిక ప్రకటనలు రూపొందించి సీడీల రూపంలో అందచేశానన్నాడు. దీనికి సంబంధించిన చార్జీలు, రాయల్టీ రూ.70 లక్షల వరకు తనకు రావాల్సి ఉందన్నాడు. ఆ డబ్బును నిత్యానంద నుంచి తనకు అందచేయాలని, అంతేకాకుండా తన ప్రకటన సీడీలు ప్రసారం చేయకుండా నిలిపివేయాలని కోరాడు. తనకు ప్రాణ రక్షణ కల్పించాలని, ఇటీవలి తనపై దాడి చేసిన నలుగురు మహిళా సన్యాసులపై చర్యలు తీసుకోవాలని కోరాడు.