Tiruvannamalai
-
తిరువణ్ణామలైలో ఘనంగా కార్తీక దీపోత్సవం
తమిళనాడులోని తిరువణ్ణామలైలో కార్తీక మాస దీపోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలు ఈనెల 17న ప్రారంభమయ్యాయి. పూలతో అందంగా అలంకరించిన వాహనాల్లో ప్రతిరోజూ అన్నామలైయార్, నిమ్ములై అమ్మన్లను వీధుల్లో ఊరేగిస్తున్నారు. ఈ నేపధ్యంలోనే పంజరథ రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకల్లోని పలు ఘట్టాలు భక్తులను అమితంగా అలరిస్తాయి. భరణి దీపం: కార్తీక దీపోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన భరణి దీపం వేడుకను ఈరోజు (ఆదివారం) ఉదయం 5 గంటలకు నిర్వహించారు. అన్నామలైయార్ గర్భగుడి ఎదుట శివాచార్యులు వేద మంత్రోచ్ఛారణలతో పారాణి దీపం వెలిగించారు. ఈ సందర్భంగా ఆయన అనేకత్వంలోని ఏకత్వాన్ని వివరించారు. అనంతరం అరుణాచలేశ్వర ఆలయం లోపలి ప్రాకారం చుట్టూ తిరుగుతూ నిన్నములైయమ్మన్‌తోపాటు అన్ని సన్నిధానాల్లో పారాణి దీపం వెలిగించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో స్వామివారి దర్శనం చేసుకున్నారు. మహాదీపం: ఉత్సవాల్లో ‘మహాదీపం’ వేడుక ఉత్కృష్టంగా నిలుస్తుంది. ఆలయం వెనుకవైపు ఉన్న 2,668 అడుగుల ఎత్తయిన కొండపై నేటి (ఆదివారం) సాయంత్రం 6 గంటలకు మహాదీపం వెలిగిస్తారు. గిరివాలం: కార్తీక దీపోత్సవాన్ని పురస్కరించుకుని స్వామివారి దర్శనం కోసం ఇప్పటికే 30 లక్షల మందికి పైగా భక్తులు గిరివాలానికి (ప్రదక్షిణ) తరలివచ్చారు. ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం కొండపై 7 అడుగుల పొడవు, 200 కిలోల బరువు కలిగిన జ్యోతిని వెలిగిస్తారు. 3500 లీటర్ల నెయ్యి వినియోగం: మహాదీపం వెలిగించేందుకు భక్తుల నుంచి స్వీకరించిన 3500 లీటర్ల నెయ్యి, వెయ్యి మీటర్ల ఖాదీ వస్త్రాన్ని ఇంతకుముందే కొండపైకి తీసుకెళ్లారు. మహా దీపాన్ని వీక్షించేందుకు 2,500 మందిని మాత్రమే కొండపైకి ఎక్కేందుకు అనుమతించనున్నారు. కార్తీక దీపోత్సవం సందర్భంగా తిరువణ్ణామలై దీపాల వెలుగులతో మెరిసిపోతోంది. ఇది కూడా చదవండి: నాడు కసబ్‌ను గుర్తించిన బాలిక ఇప్పుడేం చేస్తోంది? -
తమిళనాడులో రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి!
దేశంలో రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. మద్యం తాగి వాహనాలు నడపడం, అతివేగం, ఓవర్‌టెక్ తదితర కారణాలతో వాహన ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈరోజు(మంగళవారం) తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తిరువన్నామలై వద్ద ఓ టాటా సుమోను బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. సంగం-కృష్ణగిరి హైవేపై ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గురైన టాటా సుమోలో ఉన్నవారంతా అసోం రాష్ట్రానికి చెందిన వారని తెలుస్తోంది. వీరంతా తిరువన్నామలై అన్నామలైయార్ ఆలయ దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇది కూడా చదవండి: ఆర్ఎస్ఎస్ విజయదశమి వేడుకలు -
మందుబాబును బస్సు నుంచి తోసేసిన కండక్టర్.. వీడియో వైరల్..
చెన్నై: తమిళనాడు ఆర్టీసీ బస్సు కండక్టర్ ఓ మందుబాబుతో విచక్షణా రహితంగా ప్రవర్తించాడు. ఫుల్లుగా మద్యం తాగి బస్సు ఎక్కిన వ్యక్తిని తిట్టి బస్సు నుంచి కిందకు తోసేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. మద్యం మత్తులో బస్సు ఎక్కిన వ్యక్తి తూలుతూ కన్పించాడు. కనీసం నడవలేని స్థితిలో ఉన్నాడు. అతన్ని బస్సు దిగిపోవాలని కండక్టర్ వారించాడు. దీంతో ఆ వ్యక్తి ఆపసోపాలు పడుతూ కిందకు దిగడానికి ప్రయత్నిస్తుండగా.. కండక్టర్ అతనిపై బాటిల్‌తో నీళ్లుపోశాడు. అనంతరం మెట్లపై నుంచి తోసేశాడు. ఫలితంగా అమాంతం అతడు కిందపడిపోయాడు. అయితే అతనికి గాయాలయ్యయా, పరిస్థితి ఎలా ఉందని కూడా చూడకుండా కండక్టర్ బస్సును పోనివ్వమన్నాడు. #government #TamilNadu #TamilnaduNews #bus #conductor pic.twitter.com/rGI9BMv1Rv — MAHES ARUN AMD (@mahes_arun_amd) November 19, 2022 తిరవన్నమళైలో జరిగిన ఈ ఘటనపై అధికారులు విచారణకు ఆదేశించారు. అయితే ఆ వ్యక్తి బస్సులోనే మద్యం తాగుతున్నాడని, ప్రయాణికులతో దురుసుగా ప్రవర్తిస్తూ రచ్చ చేయడం వల్లే బస్సు నుంచి దించేసినట్లు కండక్టర్ వివరించాడు. ప్రయాణికులకు అసౌకర్యం కలగవద్దనే ఇలా చేసినట్లు చెప్పుకొచ్చాడు. చదవండి: ఉద్ధవ్ శివసేన కార్యాలయం కూల్చివేత..ముంబైలో ఉద్రిక్తత.. -
సలసల కాగుతున్న నూనెలో చేతితో వడలు కాల్చి నైవేద్యం
సాక్షి, చెన్నై(వేలూరు): తిరువణ్ణామలై జిల్లాలో కాగుతున్న నూనెలో చేతితో వడలు కాల్చి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించారు. తిరువణ్ణామలై జిల్లా కె.అగరం గ్రామంలో అయ్యారమ్మన్ ఆలయ జాతర తమిళ ఆడి మాసంలో మూడు రోజుల పాటు నిర్వహించడం ఆనవాయితీ. 14వ తేదీన ప్రారంభమైన ఈ ఉత్సవాలు మూడు రోజుల పాటు జరిగాయి. ఆఖరి రోజైన మంగళవారం సాయంత్రం అయ్యారమ్మన్‌కు పాపంపట్టి గ్రామానికి చెందిన శాంతి అమ్మాల్ అనే భక్తురాలు కాలే నూనెలో వడలను చేతితో తీసి భక్తులకు చూపించి వాటితో అమ్మవారికి చెల్లించి మొక్కులు తీర్చుకుంది. ఇందుకోసం 48 రోజుల పాటు ఉపవాసం ఉన్నట్లు భక్తురాలు తెలిపింది. ఈ ఉత్సవాలను తిలకించేందుకు చుట్టు పక్కల ఉన్న గ్రామాల నుంచి భక్తులు పోటెత్తారు. అమ్మవారిని దర్శించుకుని అక్కడే పొంగళ్లు పెట్టి మొక్కులు చెల్లించుకున్నారు. చదవండి: (మరోసారి ఉదారతను చాటుకున్న ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి) -
లోక క్షేమం కోరుతూ.. ఏకంగా 14 కి.మీ గిరిప్రదక్షిణ
వేలూరు (తమిళనాడు): కరోనా నుంచి మానవాళిని కాపాడాలని కోరుతూ ఓ భక్తురాలు భగవంతుడిని వినూత్న రీతిలో వేడుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడుకి చెందిన మాధవి తమిళనాడులోని తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయంలో మంగళవారం 14 కిలోమీటర్లు గిరివలయం రోడ్డుపై అంగప్రదక్షిణ చేసింది. అరుణాచలేశ్వరాలయంలో పౌర్ణమి రోజున భక్తులు గిరిప్రదక్షిణ (గిరివలయం) చేస్తుంటారు. ముఖ్యంగా చిత్ర పౌర్ణమి, కార్తీక దీపోత్సవ పౌర్ణమి రోజున వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వచ్చి గిరిప్రదక్షిణలో పాల్గొంటారు. చదవండి: నెలాఖరుకల్లా శ్రీశైలానికి కృష్ణమ్మ! -
దారుణం: దెయ్యం పట్టిందని కొడుకును కొట్టి చంపిన తల్లి
చెన్నై: వేలూరు: మూఢనమ్మకాలు ఓ బాలుడి ప్రాణాలను బలితీసుకుంది. దెయ్యం పట్టిందని కన్న తల్లే కుమారుడిని కర్రతో కొట్టి హత్య చేసింది. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రం వేలూరులో జరిగింది. వివరాలు.. అరియూర్ జేజేనగర్‌కు చెందిన కార్తీ, తిలగవది దంపతులకు కుమారుడు శబరి(7)ఉన్నారు. కార్తీ మూడేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. శబరి పిట్స్ వ్యా«ధితో బాధపడే వాడు. అప్పుడప్పుడు ఉన్న ఫలంగా కేకలు వేసేవాడు. దీంతో కుటుంబ సభ్యులు శబరికి దెయ్యం పట్టిందని భావించారు. తిరువణ్ణామలై జిల్లా వందవాసికి చెందిన ఓ పూజారి దెయ్యాన్ని తరిమేస్తాడని కొందరు చెప్పడంతో తిలగవది తన చెళ్లెల్లు కవిత, బాగ్యలక్ష్మిలను వెంట బెట్టుకుని కుమారుడు శబరిని తీసుకొని ఆదివారం సాయంత్రం వందవాసికి ఆటోలో బయలుదేరింది. ఆటోకు తగిన నగదు ఇవ్వకపోవడంతో ఆటో డ్రైవర్ కణ్ణమంగళం కొత్త బస్టాండ్ వద్ద నలుగురిని దింపి వెళ్లిపోయాడు. సాయంత్రం చీకటి పడడంతో కణ్ణమంగళం పంచాయితీ కార్యాలయం ముందు నిద్రించారు. సోమవారం వేకువజామున 3 గంటలకు శబరికి ఫిట్స్ వచ్చింది. శబరి శరీరంలో దెయ్యం ఉందని.. ఇతన్ని కొడితే దెయ్యం శరీరం విడిచి వెళ్లిపోతుందని ముగ్గురూ కలిసి బాలుడిని కర్రతో కొట్టడంతో మృతిచెందాడు. సోమవారం ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారిని అదుపులోకి విచారిండగా విషయం బటయపడింది. చదవండి: బంజారాహిల్స్: మూడేళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. భర్త కొట్టడంతో.. ఇన్‌స్టా పరిచయం.. యువతిని బయటకు రమ్మంటే రాలేదని.. -
Aari Arujunan: బిగ్‌బాస్ ఫేమ్ ఆరి దాతృత్వం
తమిళసినిమా: కరోనా మహమ్మారి పేద కుటుంబాలను తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తోంది. అభాగ్యుల పరిస్థితి వర్ణనాతీతం. అలాంటి వారి ఆకలి దప్పికలు తీర్చడానికి పలువురు మానవతావాదులు ముందుకొస్తున్నారు. అదే విధంగా నటుడు ఆరి కూడా పేదవారి కడుపులు నింపడానికి సిద్ధమయ్యారు. ఇటీవల జరిగిన బిగ్‌బాస్ రియాల్టీ షోలో విన్నర్‌గా నిలిచిన ఈయన ఇప్పటికే మారువోమ్ మాట్రువోమ్ ట్రస్ట్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తాజాగా తిరువణ్ణామలైలోని గిరివలం ప్రాంతంలో కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్న నిరుపేదల ఆకలి తీర్చే ప్రయత్నం చేశారు. శుక్రవారం ఆ ప్రాంతంలోని 100 మంది పేదలకు అన్నం పొట్లాలు అందించారు. చదవండి: ‘రియల్ హీరో’ మరో కీలక నిర్ణయం.. ‘సంభవం’ పేరుతో.. -
హిజ్రాల మధ్య ఘర్షణ
పోలీస్‌స్టేషన్ ముట్టడి చెన్నై, తిరువణ్ణామలై: మామూళ్ల వసూళ్లలో హిజ్రాల మధ్య జరిగిన ఘర్షణలో ఐదుగురు హిజ్రాలు గాయాలతో తిరువన్నామలై ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తిరువణ్ణామలై ఎళిల్ నగర్‌కు చెందిన అన్బు అలియార్ అన్బరసి హిజ్రా. ఈమె సహ హిజ్రాలతో బస్టాండు, గిరివలం రోడ్డు తదితర ప్రాంతాల్లోని దుకాణాల్లో మామూళ్లు వసూళ్లు చేస్తుండేది. దీనిపై మరో వర్గానికి చెందిన హిజ్రాలు అన్బరసిని మంగళవారం నిలదీశారు. అన్బరసి వర్గీయులు మరో సంఘానికి చెందిన హిజ్రాల మధ్య ఘర్షణ ఏర్పడింది. అన్బరసి వర్గీయులు ముందుగానే తెచ్చుకున్న కత్తులు, రాడ్లతో వ్యతిరేక వర్గ హిజ్రాలపై దాడిచేశారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో వేలూరు, తిరువణ్ణామలై, విల్లుపురం జిల్లాల హిజ్రాలతో బాధితులు పోలీస్స్టేషన్లను ముట్టడించారు. అన్బరసి వర్గీయులపై చర్యలు తీసుకోవాలని, లేదంటే బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 32 జిల్లాల్లో ఎస్పీ కార్యాలయాల ఎదుట ధర్నా చేస్తామన్నారు. -
అపార్ధం చేసుకొని మహిళ ప్రాణం తీశారు
చెన్నై : రోడ్డుపై ఆడుకుంటున్న పిల్లలకు చాకెట్లు ఇచ్చిన ఓ మహిళను అపార్ధం చేసుకున్న స్థానికులు ఆమెపై దాడిచేసి హతమార్చారు. ఈ దారుణమైన ఘటన తమిళనాడులోని తిరువన్నామలై జిల్లాలోని అతిమూర్‌లో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. చెన్నైకి చెందిన రుక్మిణి బంధువులు ఈ నెల మూడో తేదీన మలేషియా నుంచి రావడంతో.. వారితో కలిసి తమ కులదైవాన్ని దర్శించుకోవడానికి మంగళవారం సాయంత్రం అతిమూర్కు కారులో బయలుదేరారు. మార్గమధ్యలో రాత్రి నిదురించి ఉదయం వారి ప్రయాణాన్ని కొనసాగించారు. ఆ ప్రాంతానికి వెళ్లి చాలా ఏళ్లు కావడంతో వారు దారి తప్పారు. రోడ్డుపై వెళ్తున్న వారిని అడ్రస్ అడిగి ఆలయం వైపు బయలుదేరారు. ఆ సమయంలో రుక్మిణి రోడ్డుపై ఆడుకుంటున్న ఇద్దరు పిల్లలకు చాక్లెట్లు ఇచ్చారు. దీనిని అపార్ధం చేసుకున్న కొంతమంది.. వారిని కిడ్నాపర్లుగా భావించి ఊళ్లో వారికి సమాచారం అందించారు. అది నిజమని భావించిన గ్రామస్తులు వారి కారును అడ్డగించి.. ఒక్కసారిగా దాడికి దిగారు. ఈ దాడిలో రుక్మిణి అక్కడిక్కడే మరణించగా... తీవ్రంగా గాయపడిన ఆమె బంధువులను, కారు డ్రైవర్‌ను పోలీసులు తిరుమన్నామలై ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గ్రామస్తులు వారి వాహనాన్ని కూడా పూర్తిగా ధ్వంసం చేశారు. ఈ ఘటనపై పోలీసులు స్పందిస్తూ.. బాధితులను కిడ్నాపర్లు అంటూ పుకార్లు సృష్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ దాడి జరుగుతున్న సమయంలో కొంతమంది ఫొటోలు, వీడియోలు తీశారని.. నిందితులను గుర్తించడానికి వాటిని పరిశీలిస్తున్నట్టు తెలిపారు. -
రియల్టర్ కుటుంబం ఆత్మహత్యాయత్నం
- యజమాని మృతి.. భార్య, కుమారుల పరిస్థితి విషమం - కరీంనగర్‌కు చెందిన వారుగా అనుమానం తిరువణ్ణామలై (తమిళనాడు): తమిళనాడులోని తిరువణ్ణామలైలో ఓ లాడ్జిలో తెలంగాణకు చెందిన ఓ రియల్టర్ కుటుంబ సభ్యులందరూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో కుటుంబ యజమాని రవికుమార్ (55) మృతి చెందగా, అతని భార్య, ఇద్దరు కుమారుల పరిస్థితి విషమంగా ఉంది. భార్య పద్మ, కుమారులు శశి, శంకర్‌లతో కలసి రవికుమార్ మూడు నెలలక్రితం తిరువణ్ణామలై సెంగం రోడ్డులోని ఓ లాడ్జిలో గది అద్దెకు తీసుకున్నాడు. గది తీసుకున్న సమయంలో కరీంనగర్ అని మాత్రం నమోదుచేశారు. పూర్తి వివరాలు తెలియరాలేదు. సోమవారం ఉదయం 10 గంటల వరకు గది తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చిన లాడ్జి సిబ్బంది కిటికీలు తెరిచిచూడగా నలుగురూ స్పృహ తప్పి పడిఉన్నారు. తలుపులు పగలగొట్టి పరిశీలించగా శీతలపానీయాల్లో విషం కలిపి తాగినట్లు తెలిసింది. వెంటనే నలుగురినీ తిరువణ్ణామలై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రవికుమార్ మంగళవారం ఉదయం మృతిచెందాడు. మిగిలిన ముగ్గురి పరిస్థితి సైతం విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితి మెరుగుపడితే పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు చెబుతున్నారు. -
వ్యాపారి కుటుంబం ఆత్మహత్యాయత్నం
సాక్షి, తిరువణ్ణామలై: తమిళనాడులోని తిరువణ్ణామలైలో ఓ లాడ్జిలో తెలంగాణకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనలో కుటుంబ యజమాని మృతిచెందగా అతని భార్య, ఇద్దరు కుమారుల పరిస్థితి విషమంగా ఉంది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన రవికుమార్(55) రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. భార్య పద్మ, కుమారుడు శశి, శంకర్‌లతో కలిసి మూడు నెలల క్రితం తిరువణ్ణామలై సెంగం రోడ్డులోని వినాయకుడి ఆలయం వీధిలోని లాడ్జిలో అద్దెకు దిగాడు. సోమవారం ఉదయం 10 గంటల వరకు గది తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చిన లాడ్జి సిబ్బంది కిటికీలను తెరిచి చూడగా నలుగురూ స్పృహ తప్పి పడివున్నట్టు గమనించారు. వెంటనే గది తలుపులు పగలగొట్టి పరిశీలించగా శీతలపానీయాల్లో విషం కలిపి తాగినట్లు గుర్తించారు. వెంటనే నలుగురినీ తిరువణ్ణామలై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రవికుమార్ మంగళవారం ఉదయం మృతిచెందగా మిగతా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. రవికుమార్ కుటుంబ సభ్యుల ఆత్మహత్యాయత్నానికి అప్పులు కారణమై ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నష్టం రావడంతోనే మూడు నెలల క్రితం కుటుంబ సభ్యులతో కలిసి తిరువణ్ణామలై వచ్చి ఉండవచ్చునని భావిస్తున్నారు. కుటుంబ సభ్యుల పరిస్థితి మెరుగుపడితే వివరాలు తెలుస్తాయని పోలీసులంటున్నారు. -
కలెక్టర్‌పై హత్యాయత్నం
సాక్షి, తిరువణ్ణామలై: తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లా కలెక్టర్‌పై శనివారం మధ్యాహ్నం ముగ్గురు వ్యక్తులు హత్యాయత్నం చేశారు. కలెక్టర్ కందస్వామి విధులు పూర్తి చేసుకుని ఎదురుగా ఉన్న బంగ్లాకు కాలి నడకన బయలుదేరారు. ఆయన వెనుక పీఏ బాబు, జబేదార్ కొద్ది దూరంలో నడిచి వస్తున్నారు. కలెక్టర్ బంగ్లా ప్రాంగణంలోకి ప్రవేశించగానే వెనుక నుంచి ముగ్గురు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి ఆయనపై దాడి చేసేందుకు యత్నించగా కలెక్టర్ అదుపు తప్పి కింద పడ్డారు. గమనించిన కలెక్టర్ పీఏ కేకలు వేయడంతో బంగ్లాలో కాపలా ఉన్న పోలీసులు, సిబ్బంది పరుగున వచ్చి ఆ ముగ్గురినీ పట్టుకున్నారు. వారిని తిరువణ్ణామలై నార్త్ పోలీసులకు అప్పగించారు. వారి వద్ద ఉన్న కత్తి, మిరప పొడి, మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. దాడికి పాల్పడిన వారు కాంచీపురం జిల్లా కండిగ గ్రామానికి చెందిన శివ, మణిగండన్, తిరుప్పూరు జిల్లా తంబూరుకు చెందిన సంతోష్‌లుగా గుర్తించారు. వీరు విల్లుపురంలోని బంధువుల ఇంటికి వచ్చారని, తిరువణ్ణామలైలో ఓ బారులో మద్యం సేవిస్తున్నపుడు ఓ వ్యక్తితో ఘర్షణ పడ్డారని, అతన్ని హత్య చేసేందుకు వెంబడించారని, అతని చొక్కా, కలెక్టర్ వేసుకున్న చొక్కా ఒక్కటిగా ఉండటంతో హత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితులను ప్రత్యేకంగా విచారించేందుకు అడిషనల్ ఎస్పీ రవళి ప్రియ, డీఎస్పీ దేవనాథన్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని నియమించారు. కలెక్టర్‌కు ప్రత్యేక పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
రోడ్డు ప్రమాదంలో రిజర్వ్ పోలీస్ మృతి
తిరువణ్ణామలై: కణ్ణమంగలం సమీపంలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో రిజర్వ్ పోలీస్ మృతి చెందాడు. తిరువణ్ణామలై జిల్లా గురుమాతాంగల్ గ్రామానికి చెందిన దేవరాజ్(20) వేలూరులో రిజర్వ్ పోలీస్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం ఉదయం యథావిధిగా ఇంటి నుంచి బైకులో విధులకు బయలు దేరాడు. కణ్ణమంగళం సమీపంలోని వేలూరు–ఆరణి రోడ్డులో అమ్మాపాళ్యం క్రాస్ వద్ద వస్తుండగా గుర్తు తెలియని వాహనం బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో దేవరాజ్ అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కణ్ణమంగళం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృత దేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
దేవుడా..!
► కారు, లారీ ఢీ ►ఏడుగురి మృతి ►మృతుల్లో నవ వధువు ►ముగ్గురికి తీవ్ర గాయాలు ►కన్నీరుమున్నీరైన బంధువులు పెళ్లి పందిరి వాడనే లేదు. కాళ్లపారాణి ఆరనే లేదు. అంతలోనే విధి ఆ జంటను విడదీసింది. నవ వధువును ప్రమాదరూపంలో పొట్టన పెట్టుకుంది. మరో ఆరుగురిని కానరానిలోకాలకు పంపేసింది. తీవ్ర గాయాలతో వరుడు ఆస్పత్రి పాలయ్యాడు. ఈ విషాద ఘటన శుక్రవారం తిరువణ్ణామలై కొత్త బైపాస్ రోడ్డు యేందల్ ఎడపాళ్యం గ్రామం రింగ్‌రోడ్డు వద్ద చోటు చేసుకుంది. –తిరువణ్ణామలై తిరువణ్ణామలై: కారును, లారీ ఢీకొన్న ప్రమాదంలో నవవధువు సహా ఏడుగురు మృతిచెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన తిరువణ్ణామలై సమీపంలో చోటుచేసుకుంది. విల్లుపురం జిల్లా ఉలుందూ రు పేటకు తాలుకా పూమలైనూర్ గ్రామానికి చెందిన వాసుదేవన్(30) తిరుకోవలూర్ ఆర్టీవో కార్యాలయం లో ఉద్యోగి. ఇతనికి శశికళ(27)తో ఈనెల 5వ తేదీన వివాహం జరిగింది. ఈ దంపతులు గురువారం రాత్రి బంధువులతో కలిసి కారులో తిరుమలకు బయలుదేరారు. కారు తిరువణ్ణామలై కొత్త బైపాస్ రోడ్డు యేంద ల్ ఎడపాళ్యం గ్రామం వద్ద వస్తుండగా తిరుకోవలూరు రింగ్‌రోడ్డు వద్ద శుక్రవారం వేకువజామున ఒంటి గంటకు హŸసూరు నుంచి పుదుచ్చేరికి లోడుతో వెళుతున్న లారీ కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో కా రులో ప్రయాణిస్తున్న నవ వధువు శశికళ, అళగిరి గ్రా మానికి చెందిన ఏలుమలై(39), భార్య సెల్వ కుమారి(37), కుమార్తె దర్శన(8), ఏమం గ్రామానికి చెందిన సేట్టు(60) భార్య కొలంజి(57), కారు డ్రైవర్ విజయకుమార్(20) ఏడుగురు సంఘటన స్థలంలో మృతి చెందారు. నవ వరుడు వాసుదేవన్, ఏమం గ్రామానికి చెందిన వీరన్, మృతి చెందిన ఏలుమలై కుమారుడు హాసన్ లకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన సహ వాహన దారులు వెంటనే తిరువణ్ణామలై పోలీసులకు సమాచారం అందజేశారు. సమాచారం అందుకున్న ఎస్పీ పొన్ని అక్కడికి చేరుకుని తీవ్ర గా యాలైన ముగ్గురిని తిరువణ్ణామలై ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. మృత దేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ ప్రశాంత్ ము వడనేరే, వేలూరు డీఐజీ తమిళ్‌చంద్రన్, సంఘటన స్థలానికి చేరుకొని విచారణ జరపడంతో పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శిం చారు. గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందజేయాలని వైద్యాధికారులను ఆదేశించారు. పోలీసులు లారీ డ్రైవర్ ఏలుమలైని అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. -
వరకట్న వేధింపులు తాళలేక
మహిళ సజీవ దహనం వేలూరు: వరకట్న వేధింపులతో ఓ మహిళ సజీవ దహనమైంది. ఈ ఘటన వందవాసిలో చోటుచేసుకుంది. తిరువణ్ణామలై జిల్లా వందవాసి సమీపంలోని సూతంబేడు గ్రామానికి చెందిన తంగరాజ్ భార్య తమిళరసి(25) వీరికి రెండు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ఆ సమయంలో 15 సవరాల బంగారం, పెళ్లి సామాగ్రిని మహిళ తల్లిదండ్రులు కట్నంగా అందజేశారు. వివాహం జరిగి కొద్ది రోజులు మాత్రమే తంగరాజ్, ఇళవరసి కలిసి సంతోషంగా జీవించారు. అనంతరం అదనపు కట్నం తేవాలని కోరుతూ భర్త తంగరాజ్, అతని కుటుంబ సభ్యులు తరచూ వేధించడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో ఈనెల 7వ తేదీన ఇంట్లో ఉన్న ఇళవరసి కాలిన గాయాలతో ఉన్న విషయాన్ని స్థానికు లు గమనించారు. దాదాపు 90 శాతం కాలిన గాయాలతో ప్రాణాలతో కొట్టు మిట్టాడుతున్న ఇళవరసిని స్థానికులు వందవాసి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం చెన్నై కీల్పాక్కం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ఆ సమయంలో తమిళరసి వద్ద న్యాయమూర్తి వాంగ్మూలం తీసుకున్నారు. వరకట్నం కోసం తన ను చిత్ర హింసలు పెట్టి తనను కిరోసిన్ పోసి కాల్చారని తెలిపినట్లు తెలిసింది. ఇందుకు కారణం భర్త తంగరాజ్, అమ్మ పెరియమ్మాల్, భర్త అన్న సెల్వమణి, చెల్లెలు విమల నలుగురు కారణమని వాంగ్మూలం ఇచ్చింది. ఇదిలా ఉండగా తమిళరసి చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందింది. వీటిపై పోలీసులకు మహిళ తల్లి దండ్రులు ఫిర్యాదు చేయడంతో హత్యానేరం కింద కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న తంగరాజ్‌తో పాటు కుటుంబ సభ్యులు నలుగురి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వివాహం జరిగి రెండు సంవత్సరాలు కావడంతో సెయ్యారు సబ్ కలెక్టర్ ప్రభు శంకర్ విచారణ చేస్తున్నారు. -
ఎంత చదివినా ఇంగ్లిష్ రావడం లేదని..
తిరువాన్నమలై (తమిళనాడు): ఎంత కష్టపడి చదివినా ఇంగ్లిష్ రాకపోవడంతో మనస్తాపం చెందిన ఓ 16 ఏళ్ల విద్యార్థిని తీవ్ర నిర్ణయం తీసుకుంది. పదో తరగతి చదువుతున్న భవాని ఇంగ్లిష్ సబ్జెక్టులో తనకు తక్కువ మార్కులు రావడంతో బలవన్మరణానికి పాల్పడింది. గత సోమవారం ఉదయం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొంది. తిరువాన్నమలై పట్టణానికి చెందిన కష్టవలి, పుంగోడి దంపతుల కూతురైన భవాని స్థానిక మున్సిపల్ హైస్కూల్లో పదో తరగతి చదువుతోంది. ఇంగ్లిష్‌పై తనకు పట్టు లేకపోవడంతో భవాని చాలాసార్లు తీవ్ర నిరాశ చెందింది. ఈ సబ్జెక్ట్ టెస్టుల్లోనూ తక్కువ మార్కులు రావడంతో మనస్తాపం చెందిన ఆమె తనకు స్కూలుకు వెళ్లడం ఇష్టంలేదని పలుసార్లు తోబుట్టువులకు చెప్పిందని, ఈ నేపథ్యంలోనే భవాని ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు తెలిపారని పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. -
హారర్ సినిమా చూస్తూ గుండెపోటుతో మృతి
తిరువన్నామలై: హాలీవుడ్ హారర్ సినిమా ది కాంజురింగ్-2 చూస్తూ 65 ఏళ్ల వృద్ధుడు గుండెపోటుతో మరణించాడు. తమిళనాడులోని తిరువన్నామలైలో గురువారం రాత్రి ఈ విషాదకరం సంఘటన జరిగింది. పోలీసులు చెప్పిన సమాచారం మేరకు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు ఇటీవల విడుదలైన ది కాంజురింగ్-2 సినిమా చూసేందుకు ఓ థియేటర్‌కు నైట్ షోకు వెళ్లారు. ఈ సినిమా క్లైమాక్స్ చూస్తుండగా ఓ వ్యక్తికి ఛాతీలో నొప్పి వచ్చింది. ఆయన్ను సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే ఆయన మరణించినట్ట వైద్యులు ధ్రువీకరించారు. మృతుడి వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు విచారిస్తున్నారు. -
నిత్యానంద స్వగ్రామ పయనం
బెంగళూరు : వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద స్వగ్రామానికి పయనమవుతున్నారు. బిడది వద్ద 2003లో ధ్యాన పీఠం ఆశ్రమం స్థాపించిన నిత్యానంద సినిమా నటి రంజితతో రాసలీలల సీడీ వెలుగులోకి వచ్చేవరకు అప్రతిహతంగా తన బోధనలు సాగించారు. ఆ తరువాత వరుస వివాదాలు, పోలీస్ కేసులు, అత్యాచారం ఆరోపణలు, వివిధ సంఘాల నిరసనలను ఎదుర్కోవలసిన పరిస్థితి ఏర్పడింది. దాంతో బెంగళూరును వదిలి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపధ్యంలో తన స్వగ్రామం తమిళనాడులోని తిరువణ్ణామలై వెల్లిపోయి అక్కడే ఉండిపోవాలని నిర్ణయించుకున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సోమవారం ఆయనకు పుంసత్వ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ రోజు ఆశ్రమంలో ప్రవచనాల సందర్భంగా బిడదిని వదిలి తిరువణ్ణామలైకు వెళ్లిపోవాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. ఇక మళ్లీ ఈ ఆశ్రమానికి రానని చెప్పారు. కోర్టు కేసులకు మాత్రం హాజరవుతానన్నారు. నిత్యానంద మానసికంగా బాగా కుంగిపోయినట్లుగా భక్తులు భావిస్తున్నారు. ** -
బెలూన్‌లో వెళ్లి... నింగిలో పెళ్లి
మహాబలిపురంలో వినూత్నంగా వివాహం చేసుకున్న జంట చెన్నై, సాక్షి ప్రతినిధి: పెళ్లంటే నూరేళ్ల పంట. ఆ వేడుకను నూరేళ్ల పాటు గుర్తుండిపోయేలా చేసుకోవాలనుకున్నారు తమిళనాడుకు చెందిన జంట. తిరువ న్నామలైకి చెందిన దిలీప్ (23), పుదుచ్చేరికి చెందిన చాందిని (22)లకు పెద్దలు వివాహం నిశ్చయించారు. మార్వాడీ కుటుంబాలకు చెందిన వియ్యంకులు ఇద్దరూ బంగారు నగల వ్యాపారులు. వధువు చాందిని సోదరుడు వినోద్, తన చెల్లెలు పెళ్లి ప్రత్యేకంగా నిర్వహించాలనే ఆలోచనతో చెన్నైకి చెందిన ఒక ప్రైవేటు సంస్థను సంప్రదించారు. ఆకాశంలో విహరించే భారీ బెలూన్ను సిద్ధం చేశారు. మహాబలిపురంలో వివాహ రిసెప్షన్‌కు వధూవరులిద్దరినీ గుర్రాలపై ఊరేగింపుగా తీసుకువచ్చారు. దిలీప్, చాందిని పూలమాలలు చేతబట్టి బెలూన్ కింది భాగంలో అమర్చిన చిన్నపాటి వివాహవేదికపై నిలుచున్నారు. రాత్రివేళ చీకట్లను చీల్చుకుంటూ బెలూన్ మెల్లమెల్లగా ఆకాశంవైపు బయలుదేరి 200 అడుగుల ఎత్తుకు చేరింది. వేదిక చుట్టూ విద్యుత్ దీపాలు వెలిగాయి. బెలూన్‌పై భాగం నుంచి పూల వర్షం కురిసింది. చెవులు చిల్లులు పడేలా టపాసులు, తారాజువ్వల జోరులో భూమిపై నుంచి పెళ్లిపెద్దలు, బంధుమిత్రులు చూస్తుండగా వధూవరులిద్దరూ దండలు మార్చుకున్నారు. బెలూన్‌లో అమర్చిన కెమెరా ఈ వేడుకను క్లిక్ మనిపించింది. ఆ వెంటనే బెలూన్ కిందికి దిగివచ్చింది. గంధర్వ దంపతులు దివి నుంచి భువికి దిగివచ్చారని పెళ్లి పెద్దలంతా సంబరపడిపోయారు. స్వర్గంలో పెళ్లి చేసుకున్న అనుభూతి కలిగిందని వధూవరులు ఈ సందర్భంగా ఆనందం వ్యక్తం చేశారు. -
సంక్షేమానికి ఓటేయండి
రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను చూసి ఓటేయూలని అన్నాడీఎంకే అధినేత్రి, సీఎం జయలలిత ఓటర్లకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభంపై కరుణానిధి హయాంలో ఏమి చర్యలు తీసుకున్నారో చెప్పాలని జయ ప్రశ్నించారు. తిరువణ్ణామలైలోని సెంగం రోడ్డులోని అమ్మాపాళ్యంలో పార్లమెంట్ అభ్యర్థి వనరోజకు మద్దతుగా మంగళవారం నిర్వహించిన ప్రచార సభలో జయలలిత పాల్గొని ప్రసంగించారు. వేలూరు, న్యూస్‌లైన్: రాష్ట్రంలో అన్నాడీఎంకే ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిందని జయలలిత గుర్తు చేశారు. ముస్లింలకు వక్ఫ్‌బోర్డు స్థలాల కేటాయింపు, నోము బియ్యంతో పాటు పలు పథకాలు ప్రవేశ పెట్టామన్నారు. క్రైస్తవులకు జెరుసలేం వెళ్లేందుకు పలురాయితీలు కల్పించామని చెప్పారు. తాను అధికార పగ్గాలు చేపట్టిన సమయంలో విద్యుత్ సమస్యతో రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడుతుండగా, పరిశ్రమలు మూత పడే పరిస్థితుల్లో ఉన్నాయన్నారు. అధికార ంలోకి వచ్చిన వెంటనే 3,300 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు నూతన పథకాన్ని ప్రవేశ పెట్టామని చెప్పారు. అదే గత డీఎంకే సర్కారు విద్యుత్ ఉత్పత్తికి ఏ విధమైన చర్యలు చేపట్టలేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్ని రంగాలు అభివృద్ధి చెందాలని పలు సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టామని,కానీ కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంపై వివక్ష చూపుతూ ఎటువంటి నిధులు మంజూరు చేయలేదన్నారు. తిరువణ్ణామలై జిల్లాలోని సమస్యలను గుర్తించామన్నారు. కలసపాక్కం, సెంగంలో రూ.3.77 కోట్ల వ్యయంతో పలు రోడ్లు, బ్రిడ్జిలు నిర్మించామన్నారు. జిల్లాలో వైద్య కళాశాలను ప్రారంభించామన్నారు. తిరువణ్ణామలైలో క్రీడా మైదానానికి అన్ని వసతులు కల్పించామని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 30 పడకల వసతి కల్పించామని వివరించారు. కళసపాక్కం నుంచి గ్రామీణులు జిల్లా ఆస్పత్రికి వచ్చేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గుర్తించి పీహెచ్‌సీకి అన్ని వసతులు కల్పించామన్నారు. గతంలో తొమ్మిదేళ్లుగా కాంగ్రెస్ కూటమిలో డీఎంకే ప్రభుత్వం అభివృద్ధికి చర్యలు తీసుకోకుండా రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలి కుటుంబ అభివృద్ధి కోసమే పాటుపడిందన్నారు. ప్రస్తుతం డీఎంకే మ్యానిఫెస్టోలో నిత్యావసర ధరలను తగ్గిస్తామని కరుణానిధి తెలపడం సరికాదన్నారు. ఇన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ కూటమిలోని కరుణానిధికి నిత్యావసర ధరలు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. డీఎంకే, కాంగ్రెస్ ప్రభుత్వాలు కలిసి నెలకోసారి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడమే కాకుండా చమురు కంపెనీలకే ధరలను పెంచే హక్కును కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తే అప్పుడు కాంగ్రెస్ కూటమిలోని కరుణానిధి ఏమి చేశారని నిలదీశారు. వీటిన్నింటినీ అడ్డుకోలేని కరుణానిధికి ఎన్నికలు రావడంతో ఇవి గుర్తుకు వచ్చాయా? అని ఎద్దేవా చేశారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు డీఎంకే, కాంగ్రెస్ పార్టీలకు తగిన గుణపాఠం తెలపాలన్నారు. భారత దేశంలో ఆర్థికాభివృద్ధి ఛిన్నాభిన్నం కావడంతో పాటు రూపాయి విలువను కూడా నాశనం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం మనకు అవసరమా అని ప్రశ్నించారు. శ్రీలంకలోని తమిళుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి చేసిందో ప్రజలందరికీ తెలుసని, ఆ సమయంలో కరుణానిధి నోరు తెరవకుండా ప్రస్తుతం లంక తమిళుల కోసం పాటు పడతానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే కచ్చదీవుల కోసం సుప్రీంకోర్టులో కేసు వేశానని గుర్తు చేశారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో ని 40స్థానాలు కైవసం చేసుకునేందుకు ఓటును రెండాకుల గుర్తు కు వేయాలని తెలిపారు. ఈ సమావేశంలో పార్లమెంట్ అభ్యర్థి వనరోజ, జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్యే అగ్రిక్రిష్ణమూర్తి, నియోజకవర్గ ఇన్చార్జీ కమలకన్నన్, సేదు రామన్, అన్నాడీఎంకే నాయకు లు,కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం ముఖ్య మంత్రి ప్రత్యేక హెలికాప్టర్లో చెన్నైకి బయలుదేరి వెళ్లారు. పూర్ణకుంభ స్వాగతం: ముఖ్యమంత్రి జయలలిత ప్రత్యేక హెలికాప్టర్లో తిరువణ్ణామలైలోని సెంగం రోడ్డులో దిగారు. అక్కడి నుంచి అన్నాడీఎంకే పార్టీకి చెందిన మహిళలు అధిక సంఖ్యలో మేళ తాళాల నడుమ పూర్ణకుంభ స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి తిరువణ్ణామలై రాక సందర్భంగా ఎటుచూసినా అమ్మ బ్యానర్లతో నిండిపోరుుంది. రెండు వేల మందితో బందోబస్తు: ముఖ్యమంత్రి రాక సందర్భంగా రెండు వేల మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. సౌత్‌జోన్ ఐజీ మంజునాథన్ ఆధ్వర్యంలో డీఐజీలు మురుగన్, తమిళ్ చంద్రన్, ఎస్పీలు ముత్తరసి, విజయకుమార్, మనోహరన్ల ఆధ్వర్యంలో రెండు వేల మంది పోలీసులు పాల్గొన్నారు. -
భార్యను హత్యచేసి ఆత్మహత్య
వేలూరు, న్యూస్‌లైన్: కుటుంబ కలహాలతో క్షణికావేశంతో భార్యను హత్య చేసి కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన తిరువణ్ణామలై జిల్లాలో గురువారం ఉదయం చోటుచేసుకుంది. తిరువణ్ణామలైలోని గాంధీనగర్‌కు చెందిన పుగళేంది(36) సినిమా థియేటర్లో క్యాంటీన్లో పనిచేస్తున్నాడు. ఇతని భార్య భవాని(30). వీరికి సంజయ్(14), సౌమ్య(12) పిల్లలు. వీరు తిరువణ్ణామలైలోని ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నారు. వీరు పాఠశాల ముగించుకొని రామ్‌జీనగర్‌లోని తాత మారిముత్తు ఇంటికి ప్రతిరోజూ వెళ్లేవారు. బుధవారం సాయంత్రం కూడా వెళ్లారు. గురువారం ఉదయం గాంధీనగర్‌లోని ఇంటికి వచ్చారు. ఆ సమయంలో ఇంటి తలుపులు తెరిచి ఉండడంతో ఇంటికి వెళ్లి చూడగా తల్లి భవాని రక్తపు మడుగులో మృతి చెంది ఉండగా, తండ్రి పుగళేందిఉరి వేసుకొని ఉండడాన్ని చూసి కేకలు వేశారు. కేకలు విన్న స్థానికులు వచ్చి చూడగా అప్పటికే ఇద్దరూ మృతి చెంది ఉండడాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఇదిలా ఉండగా పుగళేంది భార్యను అనుమానించేవాడని, ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ ఏర్పడి భవానిని హత్య చేసి ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చునని స్థానికులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. తల్లిదండ్రులు మృతి చెందడంతో చిన్నారుల రోదనలు చూసి స్థానికులు కన్నీరు మున్నీరు అయ్యారు. -
తిరువణ్ణామలైలో కార్తీక బ్రహ్మోత్సవాలు ప్రారంభం
తిరువణ్ణామలైలో అరుణాచలేశ్వర స్వామి కార్తీక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యూరుు. శుక్రవారం ఉదయం ధ్వజారోహణం కన్నుల పండువగా సాగింది. ఈ వేడుకను చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తజనులు తరలివచ్చారు. హరోంహర నామస్మరణలతో ఆలయ ఆవరణం మార్మోగింది. వేలూరు, న్యూస్‌లైన్: తిరువణ్ణామలైలోని అరుణాచలేశ్వర స్వామి కార్తీక బ్రహ్మోత్సవాలంటే భక్తులకు ఎంతో ఇష్టం. ప్రతి ఏటా పది రోజులు ఈ ఉత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతారుు. ఉదయం, సాయంత్రం వేళల్లో ఉత్సవమూర్తులు మాడవీధుల్లో ఊరేగుతూ భక్తజనులకు దర్శనమిస్తారు. ఈ సంవత్సరం నవంబర్ 8 నుంచి 17వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించేలా అధికారులు నిర్ణరుుంచారు. శుక్రవారం ఉదయం 6.21 గంటలకు ఆలయంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు. తెల్లవారుజామున 3 గంటలకు ఆలయ తలుపులను తెరిచి మూలవర్ సన్నిధిలో ప్రత్యేక అభిషేకం, ఆరాధనలు చేశారు. ఉత్సవమూర్తులు వినాయకుడు, మురుగన్,చంద్రశేఖరుడు, చండికేశ్వరుడు, అన్నామలై, ఉన్నామలై అమ్మవార్లను అలంకరించి ధ్వజస్తంభం వద్దకు తీసుకొచ్చారు. అనంతరం మకర దీపారాధన జరిపారు. ఆలయ అర్చకులు వేదమంత్రాల నడుమ ధ్వజారోహణం నిర్వహించారు. భక్తుల హరోంహర నామస్మరణతో ఆలయ ఆవరణం మార్మోగింది. అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. తర్వాత ఉత్సవమూర్తులను మాడవీధుల్లో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ జ్ఞానశేఖరన్, డీఐజీ మురుగన్, ఎస్పీ ముత్తరసి, జిల్లా రెవెన్యూ అధికారి వలర్మధి, ఆర్డీవోలు ప్రియ, ఆలయ జాయింట్ కమిషనర్ తిరుమగల్, ఎమ్మెల్యే అరంగనాథన్, జెడ్పీ చైర్మన్ నైనాకన్ను, మున్సిపల్ చైర్మన్ బాలచందర్, మాజీ మంత్రి పిచ్చాండి, మున్సిపల్ మాజీ చైర్మన్ శ్రీధరన్ తదితరులు పాల్గొన్నారు. వేడుకగా వాహనసేవలు బ్రహ్మోత్సవాల సందర్భంగా శుక్రవారం వివిధ వాహనసేవలు నిర్వహించారు. ఉదయం పంచమూర్తులను వెండి వాహనంపై మాడవీధుల్లో ఊరేగించారు. రాత్రి హంస, అధికార నంది, చిన్న వృషభ వాహనాల్లో స్వామివారు ఊరేగారు. ఈ నెల 14న రథోత్సవం అత్యంత ఘనంగా జరగనుంది. అలాగే 17వ తేదీ ఉదయం 4 గంటలకు మూలవర్ సన్నధిలో భరణి దీపం, సాయంత్రం 6 గంటలకు ఆలయం వెనుకనున్న 2,668 అడుగుల ఎత్తు గల కొండపై మహాదీపం వెలిగించనున్నారు. ఈ దీపాన్ని ద ర్శించుకునేందుకు తమిళనాడు నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి ఇరవై లక్షల మందికిపైగా భక్తులు తరలిరానున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లను వేగవంతం చేశారు.