దేవుడా..! | accedent in tiruvannamalai | Sakshi
Sakshi News home page

దేవుడా..!

Published Sat, Dec 10 2016 3:39 AM | Last Updated on Mon, Sep 4 2017 10:18 PM

accedent in tiruvannamalai

కారు, లారీ ఢీ
ఏడుగురి మృతి
మృతుల్లో నవ వధువు
ముగ్గురికి తీవ్ర గాయాలు
కన్నీరుమున్నీరైన బంధువులు


పెళ్లి పందిరి వాడనే లేదు. కాళ్లపారాణి ఆరనే లేదు. అంతలోనే విధి ఆ జంటను విడదీసింది. నవ వధువును ప్రమాదరూపంలో పొట్టన పెట్టుకుంది. మరో ఆరుగురిని కానరానిలోకాలకు పంపేసింది. తీవ్ర గాయాలతో వరుడు ఆస్పత్రి పాలయ్యాడు. ఈ విషాద ఘటన శుక్రవారం తిరువణ్ణామలై కొత్త బైపాస్‌ రోడ్డు యేందల్‌ ఎడపాళ్యం గ్రామం రింగ్‌రోడ్డు వద్ద చోటు చేసుకుంది.  –తిరువణ్ణామలై

తిరువణ్ణామలై:  
కారును, లారీ ఢీకొన్న ప్రమాదంలో నవవధువు సహా ఏడుగురు మృతిచెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన తిరువణ్ణామలై సమీపంలో చోటుచేసుకుంది. విల్లుపురం జిల్లా ఉలుందూ రు పేటకు తాలుకా పూమలైనూర్‌ గ్రామానికి  చెందిన వాసుదేవన్(30) తిరుకోవలూర్‌ ఆర్టీవో కార్యాలయం లో ఉద్యోగి. ఇతనికి  శశికళ(27)తో ఈనెల 5వ తేదీన వివాహం జరిగింది. ఈ దంపతులు గురువారం రాత్రి  బంధువులతో కలిసి కారులో తిరుమలకు బయలుదేరారు. కారు తిరువణ్ణామలై కొత్త బైపాస్‌ రోడ్డు యేంద ల్‌ ఎడపాళ్యం గ్రామం వద్ద వస్తుండగా తిరుకోవలూరు రింగ్‌రోడ్డు వద్ద శుక్రవారం వేకువజామున ఒంటి గంటకు హŸసూరు నుంచి పుదుచ్చేరికి లోడుతో వెళుతున్న లారీ కారును ఢీకొంది.

ఈ ప్రమాదంలో కా రులో ప్రయాణిస్తున్న నవ వధువు శశికళ, అళగిరి గ్రా మానికి చెందిన ఏలుమలై(39), భార్య సెల్వ కుమారి(37), కుమార్తె దర్శన(8), ఏమం గ్రామానికి చెందిన సేట్టు(60) భార్య కొలంజి(57), కారు డ్రైవర్‌ విజయకుమార్‌(20) ఏడుగురు సంఘటన స్థలంలో మృతి చెందారు. నవ వరుడు వాసుదేవన్, ఏమం గ్రామానికి చెందిన వీరన్, మృతి చెందిన ఏలుమలై కుమారుడు హాసన్ లకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన సహ వాహన దారులు వెంటనే తిరువణ్ణామలై పోలీసులకు సమాచారం అందజేశారు. సమాచారం అందుకున్న ఎస్పీ పొన్ని అక్కడికి చేరుకుని తీవ్ర గా యాలైన ముగ్గురిని తిరువణ్ణామలై ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. మృత దేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న కలెక్టర్‌ ప్రశాంత్‌ ము వడనేరే, వేలూరు డీఐజీ తమిళ్‌చంద్రన్, సంఘటన స్థలానికి చేరుకొని విచారణ జరపడంతో పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శిం చారు. గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందజేయాలని వైద్యాధికారులను ఆదేశించారు.  పోలీసులు లారీ డ్రైవర్‌ ఏలుమలైని అరెస్ట్‌ చేసి విచారణ చేస్తున్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement