తిరువణ్ణామలైలో ఘనంగా కార్తీక దీపోత్సవం | Tiruvannamalai Karthigai Deepam Barani Deepam | Sakshi
Sakshi News home page

Tiruvannamalai: తిరువణ్ణామలైలో ఘనంగా కార్తీక దీపోత్సవం

Published Sun, Nov 26 2023 8:58 AM | Last Updated on Sun, Nov 26 2023 9:00 AM

Tiruvannamalai Karthigai Deepam Barani Deepam - Sakshi

తమిళనాడులోని తిరువణ్ణామలైలో కార్తీక మాస దీపోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలు ఈనెల 17న ప్రారంభమయ్యాయి. పూలతో అందంగా అలంకరించిన వాహనాల్లో ప్రతిరోజూ అన్నామలైయార్, నిమ్ములై అమ్మన్‌లను వీధుల్లో ఊరేగిస్తున్నారు. ఈ నేపధ్యంలోనే పంజరథ రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకల్లోని పలు ఘట్టాలు భక్తులను అమితంగా అలరిస్తాయి.

భరణి దీపం: 
కార్తీక దీపోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన భరణి దీపం వేడుకను ఈరోజు (ఆదివారం) ఉదయం 5 గంటలకు నిర్వహించారు. అన్నామలైయార్ గర్భగుడి ఎదుట శివాచార్యులు వేద మంత్రోచ్ఛారణలతో పారాణి దీపం వెలిగించారు. ఈ సందర్భంగా ఆయన అనేకత్వంలోని ఏకత్వాన్ని వివరించారు. అనంతరం అరుణాచలేశ్వర ఆలయం లోపలి ప్రాకారం చుట్టూ తిరుగుతూ నిన్నములైయమ్మన్‌తోపాటు అన్ని సన్నిధానాల్లో పారాణి దీపం వెలిగించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో స్వామివారి దర్శనం చేసుకున్నారు.

మహాదీపం: 
ఉత్సవాల్లో ‘మహాదీపం’ వేడుక ఉత్కృష్టంగా నిలుస్తుంది. ఆలయం వెనుకవైపు ఉన్న 2,668 అడుగుల ఎత్తయిన కొండపై నేటి (ఆదివారం) సాయంత్రం 6 గంటలకు మహాదీపం వెలిగిస్తారు.

గిరివాలం: 
కార్తీక దీపోత్సవాన్ని పురస్కరించుకుని స్వామివారి దర్శనం కోసం ఇప్పటికే 30 లక్షల మందికి పైగా భక్తులు గిరివాలానికి (ప్రదక్షిణ)  తరలివచ్చారు. ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం కొండపై  7 అడుగుల పొడవు, 200 కిలోల బరువు కలిగిన జ్యోతిని వెలిగిస్తారు.

3500 లీటర్ల నెయ్యి వినియోగం: 
మహాదీపం వెలిగించేందుకు భక్తుల నుంచి స్వీకరించిన 3500 లీటర్ల నెయ్యి, వెయ్యి మీటర్ల ఖాదీ వస్త్రాన్ని ఇంతకుముందే కొండపైకి తీసుకెళ్లారు. మహా దీపాన్ని వీక్షించేందుకు 2,500 మందిని మాత్రమే కొండపైకి ఎక్కేందుకు అనుమతించనున్నారు. కార్తీక దీపోత్సవం సందర్భంగా తిరువణ్ణామలై దీపాల వెలుగులతో మెరిసిపోతోంది.
ఇది కూడా చదవండి: నాడు కసబ్‌ను గుర్తించిన బాలిక ఇప్పుడేం చేస్తోంది?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement