Kartika maasam
-
Guru Nanak Jayanti: కార్తీక పౌర్ణమి నాడే గురునానక్ జయంతి ఎందుకు చేస్తారంటే..
హిందువులు కార్తీక మాసాన్ని ఎంతో పవిత్రమైన మాసంగా భావిస్తారు. ఈ నెలలో పూజలు, వ్రతాలు, నోములు చేస్తుంటారు. ఇదే మాసంలోని ఈరోజు (నవంబర్ 15)కు ఒక ప్రత్యేకత ఉంది. ఈరోజున దేవ్ దీపావళి, కార్తీక పౌర్ణమి, గురునానక్ జయంతి మూడు పర్వదినాలు కలసి వచ్చాయి. అయితే కార్తీక పౌర్ణమి నాడే గురునానక్ జయంతిని ఎందుకు జరుపుకుంటారనే విషయానికి వస్తే..గురునానక్ జయంతి సిక్కులకు ఎంతో ముఖ్యమైన పండుగ. దీనిని సిక్కులు ప్రతి సంవత్సరం కార్తీక పూర్ణిమ రోజున జరుపుకుంటారు. దీనిని ‘గురుపర్వ’ లేదా ‘ప్రకాశ పర్వ’ అని కూడా అంటారు. సిక్కు మత స్థాపకుడు గురునానక్ దేవ్ ఈరోజునే జన్మించారు. ఆయన సిక్కుల మొదటి గురువు. గురునానక్ జయంతి సాధారణంగా అక్టోబర్ లేదా నవంబర్ నెలలో వస్తుంది. సిక్కులు గురునానక్ జయంతి వేడుకలను ఎంతో ఉత్సాహంతో జరుపుకుంటారు. ఈ రోజున గురుద్వారాలలో ప్రత్యేక వేడుకలు నిర్వహిస్తారు.ఈ సంవత్సరం సిక్కులు గురునానక్ దేవ్ 555వ జయంతిని జరుపుకుంటున్నారు. ఆయన 1469వ సంవత్సరంలో కార్తీక పూర్ణిమ రోజున జన్మించారని చెబుతుంటారు. అందుకే ప్రతీయేటా గురునానక్ జయంతిని కార్తీక పూర్ణిమ రోజున జరుపుకుంటారు. గురునానక్ జయంతికి రెండు రోజుల ముందు సిక్కులు ‘అఖండ పాత్’నిర్వహిస్తారు. గురుగ్రంథ సాహిబ్‌ను 48 గంటలపాటు నిరంతరం పఠిస్తారు.గురునానక్ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న సిక్కులు ఈ రోజు ఉదయాన్నే నగర కీర్తన నిర్వహించారు. ఈ సందర్భంగా సిక్కులు గురు గ్రంథ్ సాహిబ్‌ను పల్లకిలో మోస్తూ, షాబాద్ కీర్తనను ఆలపిస్తూ నగరంలో ఊరేగింపు నిర్వహించారు. ఈరోజంతా గురుద్వారాలలో కీర్తనలు ఆలపించనున్నారు. గురునానక్ దేవ్ బోధనలపై సిక్కు మత పెద్దలు ఉపన్యసించనున్నారు.గురునానక్ జయంతి రోజున గురుద్వారాలలో ప్రత్యేక ‘లంగర్’(అన్నదానం) నిర్వహించనున్నారు. దీనిలో అన్ని మతాలవారు కలిసి భోజనం చేస్తారు. ఇది సమాజానికి సమానత్వం, సౌభ్రాతృత్వం అనే సందేశాన్ని అందిస్తుంది. గురునానక్.. సమానత్వం, ప్రేమ, సేవ నిజాయితీలు అందరిలో ఉండాలనే సందేశాన్ని అందించారు. కులమతాలకు అతీతంగా అందరూ సోదరభావంలో మెలగాలని గురునానక్ తెలియజేశారు.ఇది కూడా చదవండి: Karthika Pournima: కార్తీక పౌర్ణమి విశిష్టత..! త్రిపుర పూర్ణిమ అని ఎందుకు పిలుస్తారు? -
తిరువణ్ణామలైలో ఘనంగా కార్తీక దీపోత్సవం
తమిళనాడులోని తిరువణ్ణామలైలో కార్తీక మాస దీపోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలు ఈనెల 17న ప్రారంభమయ్యాయి. పూలతో అందంగా అలంకరించిన వాహనాల్లో ప్రతిరోజూ అన్నామలైయార్, నిమ్ములై అమ్మన్లను వీధుల్లో ఊరేగిస్తున్నారు. ఈ నేపధ్యంలోనే పంజరథ రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకల్లోని పలు ఘట్టాలు భక్తులను అమితంగా అలరిస్తాయి. భరణి దీపం: కార్తీక దీపోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన భరణి దీపం వేడుకను ఈరోజు (ఆదివారం) ఉదయం 5 గంటలకు నిర్వహించారు. అన్నామలైయార్ గర్భగుడి ఎదుట శివాచార్యులు వేద మంత్రోచ్ఛారణలతో పారాణి దీపం వెలిగించారు. ఈ సందర్భంగా ఆయన అనేకత్వంలోని ఏకత్వాన్ని వివరించారు. అనంతరం అరుణాచలేశ్వర ఆలయం లోపలి ప్రాకారం చుట్టూ తిరుగుతూ నిన్నములైయమ్మన్‌తోపాటు అన్ని సన్నిధానాల్లో పారాణి దీపం వెలిగించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో స్వామివారి దర్శనం చేసుకున్నారు. మహాదీపం: ఉత్సవాల్లో ‘మహాదీపం’ వేడుక ఉత్కృష్టంగా నిలుస్తుంది. ఆలయం వెనుకవైపు ఉన్న 2,668 అడుగుల ఎత్తయిన కొండపై నేటి (ఆదివారం) సాయంత్రం 6 గంటలకు మహాదీపం వెలిగిస్తారు. గిరివాలం: కార్తీక దీపోత్సవాన్ని పురస్కరించుకుని స్వామివారి దర్శనం కోసం ఇప్పటికే 30 లక్షల మందికి పైగా భక్తులు గిరివాలానికి (ప్రదక్షిణ) తరలివచ్చారు. ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం కొండపై 7 అడుగుల పొడవు, 200 కిలోల బరువు కలిగిన జ్యోతిని వెలిగిస్తారు. 3500 లీటర్ల నెయ్యి వినియోగం: మహాదీపం వెలిగించేందుకు భక్తుల నుంచి స్వీకరించిన 3500 లీటర్ల నెయ్యి, వెయ్యి మీటర్ల ఖాదీ వస్త్రాన్ని ఇంతకుముందే కొండపైకి తీసుకెళ్లారు. మహా దీపాన్ని వీక్షించేందుకు 2,500 మందిని మాత్రమే కొండపైకి ఎక్కేందుకు అనుమతించనున్నారు. కార్తీక దీపోత్సవం సందర్భంగా తిరువణ్ణామలై దీపాల వెలుగులతో మెరిసిపోతోంది. ఇది కూడా చదవండి: నాడు కసబ్‌ను గుర్తించిన బాలిక ఇప్పుడేం చేస్తోంది? -
కొండగట్టు అంజన్న సేవలో మంత్రి హరీష్
కరీంనగర్ జిల్లాలోని కొండగట్టు ఆంజనేయస్వామిని తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్‌రావు, ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ శనివారం దర్శించుకున్నారు. స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా, కార్తీక మాసం నేపథ్యంలో అంజన్న ఆలయం భక్తులతో కిటకిటలాడింది. సుమారు 15 వేల మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారు.