ఆహార పొట్లాలు అందిస్తున్న నటుడు ఆరి
తమిళసినిమా: కరోనా మహమ్మారి పేద కుటుంబాలను తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తోంది. అభాగ్యుల పరిస్థితి వర్ణనాతీతం. అలాంటి వారి ఆకలి దప్పికలు తీర్చడానికి పలువురు మానవతావాదులు ముందుకొస్తున్నారు. అదే విధంగా నటుడు ఆరి కూడా పేదవారి కడుపులు నింపడానికి సిద్ధమయ్యారు. ఇటీవల జరిగిన బిగ్‌బాస్ రియాల్టీ షోలో విన్నర్‌గా నిలిచిన ఈయన ఇప్పటికే మారువోమ్ మాట్రువోమ్ ట్రస్ట్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తాజాగా తిరువణ్ణామలైలోని గిరివలం ప్రాంతంలో కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్న నిరుపేదల ఆకలి తీర్చే ప్రయత్నం చేశారు. శుక్రవారం ఆ ప్రాంతంలోని 100 మంది పేదలకు అన్నం పొట్లాలు అందించారు.
చదవండి:
‘రియల్ హీరో’ మరో కీలక నిర్ణయం.. ‘సంభవం’ పేరుతో..
Comments
Please login to add a commentAdd a comment