అపార్ధం చేసుకొని మహిళ ప్రాణం తీశారు | Woman Mistaken To Be A Child Kidnapper and beaten to death By Mob in Tamilnadu | Sakshi
Sakshi News home page

అపార్ధం చేసుకొని మహిళ ప్రాణం తీశారు

Published Thu, May 10 2018 3:51 PM | Last Updated on Thu, May 10 2018 7:25 PM

Woman Mistaken To Be A Child Kidnapper and beaten to death By Mob in Tamilnadu - Sakshi

అపార్ధం చేసుకోని దాడికి దిగిన గ్రామస్తులు

చెన్నై : రోడ్డుపై ఆడుకుంటున్న పిల్లలకు చాకెట్లు ఇచ్చిన ఓ మహిళను అపార్ధం చేసుకున్న  స్థానికులు ఆమెపై దాడిచేసి హతమార్చారు. ఈ దారుణమైన ఘటన తమిళనాడులోని తిరువన్నామలై జిల్లాలోని అతిమూర్‌లో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. చెన్నైకి చెందిన రుక్మిణి బంధువులు ఈ నెల మూడో తేదీన మలేషియా నుంచి రావడంతో.. వారితో కలిసి తమ కులదైవాన్ని దర్శించుకోవడానికి మంగళవారం సాయంత్రం అతిమూర్‌కు కారులో బయలుదేరారు. మార్గమధ్యలో రాత్రి నిదురించి ఉదయం వారి ప్రయాణాన్ని కొనసాగించారు.

ఆ ప్రాంతానికి వెళ్లి చాలా ఏళ్లు కావడంతో వారు దారి తప్పారు. రోడ్డుపై వెళ్తున్న వారిని అడ్రస్‌ అడిగి ఆలయం వైపు బయలుదేరారు. ఆ సమయంలో రుక్మిణి రోడ్డుపై ఆడుకుంటున్న ఇద్దరు పిల్లలకు చాక్లెట్లు ఇచ్చారు. దీనిని అపార్ధం చేసుకున్న కొంతమంది.. వారిని కిడ్నాపర్లుగా భావించి ఊళ్లో వారికి సమాచారం అందించారు. అది నిజమని భావించిన గ్రామస్తులు వారి కారును అడ్డగించి.. ఒక్కసారిగా దాడికి దిగారు.

ఈ దాడిలో రుక్మిణి అక్కడిక్కడే మరణించగా... తీవ్రంగా గాయపడిన ఆమె బంధువులను, కారు డ్రైవర్‌ను పోలీసులు తిరుమన్నామలై ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గ్రామస్తులు వారి వాహనాన్ని కూడా పూర్తిగా ధ్వంసం చేశారు. ఈ ఘటనపై పోలీసులు స్పందిస్తూ.. బాధితులను కిడ్నాపర్లు అంటూ పుకార్లు సృష్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ దాడి జరుగుతున్న సమయంలో కొంతమంది ఫొటోలు, వీడియోలు తీశారని.. నిందితులను గుర్తించడానికి వాటిని పరిశీలిస్తున్నట్టు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/2

గ్రామంలో పరిస్థితిని సమీక్షిస్తున్న పోలీసులు

2
2/2

గ్రామంలో పరిస్థితిని సమీక్షిస్తున్న పోలీసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement