attacked on woman
-
హరిపురం ఘటనపై విస్తుపోయే వాస్తవాలు.. చక్రం తిప్పిన టీడీపీ నేత!
సాక్షి, శ్రీకాకుళం: మందస మండలం హరిపురంలో తల్లీకూతుళ్ల హత్యయత్నం కేసులో టీడీపీ నేత కొట్ర రామారావే ఏ-1 నిందితుడిగా ఉన్నాడు. జిల్లాలో టీడీపీ నేతల అండతో కొట్ర రామారావు రెచ్చపోయాడు. దగ్గరి బంధువు దాలమ్మ, ఆమెక కూతురును వేధింపులకు గురిచేశాడు. బాధితులకు వారసత్వంగా వచ్చిన ఆస్తిని ఆక్రమించుకునేందుకు పలుమార్లు శారీరకంగా వారిని శారీరకంగా హింసించాడు. కాగా, 2017 నుంచి బాధితులైన తల్లీకూతుళ్లు.. రామారావు అక్రమాలపై పోరాటం చేస్తున్నారు. అప్పటి ఎమ్మెల్యే గౌతు శివాజీ, ఎంపీ రామ్మోహన్ నాయుడు, కళా వెంకట్రావు అండతో రామారావు కేసును నీరుగార్చేలా చేశాడు. ఇక, అడ్డగోలు అబద్ధాలతో చంద్రబాబు, నారా లోకేష్ ట్విట్టర్లో అబద్ధాలు చెబుతూ పోస్టులు పెట్టడం గమనార్హం. నిందితులు వైఎస్సార్సీపీ నేతలుగా టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది. కానీ, స్థానికులు మాత్రం టీడీపీ నేతలే నిందితులని ముక్తకంఠంతో చెబుతున్నారు. ఇదీ జరిగింది.. హరిపురంలో స్థల వివాదం ముదిరి సోమవారం ఇద్దరు మహిళలపై కంకర(గులకరాళ్లతో కూడిన మట్టి) పోసే వరకూ వెళ్లింది. కొట్ర రామారావు, ప్రకాశరావు, ఆనందరావులతో సమీప బంధువులైన కొట్ర దాలమ్మ, మజ్జి సావిత్రిలకు ఓ ఇంటి స్థలం విషయమై ఎప్పటి నుంచో వివాదం ఉంది. వీరి మధ్య ఊరి పెద్దలు కూడా రాజీ కుదర్చలేకపోయారు. హరిపురంలో స్థలాల ధరలు విపరీతంగా పెరగడంతో ఎవరికి వారే పట్టుదలకు పోయారు. ఈ తరుణంలో సోమవారం వివాదం మరింత ముదిరింది. రామారావు, ఆనందరావు, ప్రకాశరావులు ట్రాక్టర్లతో వివాద స్థలంలో కంకర వేస్తుండగా.. దాలమ్మ, సావిత్రి అడ్డుకున్నారు. దీంతో ట్రాక్టర్ల వెనుక ఉన్న వీరిద్దరిపై అమాంతం మట్టిని కుమ్మరించేశారు. నడుంలోతు వరకు కూరుకపోవడంతో వారు పెద్దగా రోదించారు. వీరి కేకలు విన్న చుట్టు పక్కల వారు పారలతో కంకరను తీసి మహిళలను బయటకు లాగారు. దీనిపై వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల్ని అరెస్ట్ చేసేందుకు చర్యలకు ఉపక్రమించారు. -
అపార్ధం చేసుకొని మహిళ ప్రాణం తీశారు
చెన్నై : రోడ్డుపై ఆడుకుంటున్న పిల్లలకు చాకెట్లు ఇచ్చిన ఓ మహిళను అపార్ధం చేసుకున్న స్థానికులు ఆమెపై దాడిచేసి హతమార్చారు. ఈ దారుణమైన ఘటన తమిళనాడులోని తిరువన్నామలై జిల్లాలోని అతిమూర్‌లో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. చెన్నైకి చెందిన రుక్మిణి బంధువులు ఈ నెల మూడో తేదీన మలేషియా నుంచి రావడంతో.. వారితో కలిసి తమ కులదైవాన్ని దర్శించుకోవడానికి మంగళవారం సాయంత్రం అతిమూర్కు కారులో బయలుదేరారు. మార్గమధ్యలో రాత్రి నిదురించి ఉదయం వారి ప్రయాణాన్ని కొనసాగించారు. ఆ ప్రాంతానికి వెళ్లి చాలా ఏళ్లు కావడంతో వారు దారి తప్పారు. రోడ్డుపై వెళ్తున్న వారిని అడ్రస్ అడిగి ఆలయం వైపు బయలుదేరారు. ఆ సమయంలో రుక్మిణి రోడ్డుపై ఆడుకుంటున్న ఇద్దరు పిల్లలకు చాక్లెట్లు ఇచ్చారు. దీనిని అపార్ధం చేసుకున్న కొంతమంది.. వారిని కిడ్నాపర్లుగా భావించి ఊళ్లో వారికి సమాచారం అందించారు. అది నిజమని భావించిన గ్రామస్తులు వారి కారును అడ్డగించి.. ఒక్కసారిగా దాడికి దిగారు. ఈ దాడిలో రుక్మిణి అక్కడిక్కడే మరణించగా... తీవ్రంగా గాయపడిన ఆమె బంధువులను, కారు డ్రైవర్‌ను పోలీసులు తిరుమన్నామలై ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గ్రామస్తులు వారి వాహనాన్ని కూడా పూర్తిగా ధ్వంసం చేశారు. ఈ ఘటనపై పోలీసులు స్పందిస్తూ.. బాధితులను కిడ్నాపర్లు అంటూ పుకార్లు సృష్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ దాడి జరుగుతున్న సమయంలో కొంతమంది ఫొటోలు, వీడియోలు తీశారని.. నిందితులను గుర్తించడానికి వాటిని పరిశీలిస్తున్నట్టు తెలిపారు. -
బీరుబాటిల్ తో కొట్టాడు..
ఇంటికి దారి కల్పించే విషయమై గొడవపడిన కానిస్టేబుల్ మద్యం సీసాతో మహిళను కొట్టి గాయపరిచాడు. అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని సిద్దయ్యగుట్ట ప్రాంతంలో హిందూపురం పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న చంద్రశేఖర్ నివాసం ఉంటున్నాడు. అదే వీధిలో ఉండే సుశీల ఇంటికి దారి కల్పించే విషయమై చంద్రశేఖర్‌తో విబేధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం ఇద్దరూ గొడవ పడ్డారు. కానిస్టేబుల్ చంద్రశేఖర్ మద్యం బాటిల్‌తో సుశీల చెంపపై గట్టిగా కొట్టటంతో ఆమె చెంప తీవ్రంగా దెబ్బతింది. బాధితురాలిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పోలింగ్ కేంద్రంలో మహిళపై దాడి
అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం పొడరాళ్లపల్లి పోలింగ్ బూత్ లో టీడీపీ కార్యకర్తలు దొంగ ఓట్లను ప్రోత్సహిస్తున్నారు. ఓటు వేసేందుకు వచ్చిన రత్నాబాయి అనే మహిళ టీడీపీ కార్యకర్తల చర్యలను అడ్డుకుని... ఇదేం పనంటూ ప్రశ్నించింది. అంతే మమ్మల్నే ప్రశ్నిస్తావా అంటూ తెలుగుతమ్ముళ్లు మహిళ అని కూడా చూడకుండా రత్నాబాయిపై దాడి చేశారు. ఆ క్రమంలో రత్నబాయి తీవ్రంగా గాయపడింది. స్థానికులు వెంటనే స్పందించి రత్నాబాయిను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పొడరాళ్లపల్లిలో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. అలాగే విజయనగరం జిల్లా జామి మండలం జాగరం పోలింగ్ కేంద్రం వద్ద పోలీసులు ఓవరాక్షన్ చేశారు. ఓటు వేసేందుకు వచ్చిన ఓ యువకుడిపై పోలీసులు అకారణంగా దాడి చేశారు. దాంతో పోలీసుల తీరుపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అ కారణంగా ఎందుకు కొట్టారంటు ప్రశ్నించిన గ్రామస్తులకు పోలీసుల నుంచి నిర్లక్ష్యమైన సమాధానం వచ్చింది. అంతే పోలీసులుపై గ్రామస్తులు దాడి చేశారు. స్థానికంగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.