పోలింగ్ కేంద్రంలో మహిళపై దాడి | TDP Supporters attacked on woman in polling booth | Sakshi
Sakshi News home page

పోలింగ్ కేంద్రంలో మహిళపై దాడి

Published Fri, Apr 11 2014 9:39 AM | Last Updated on Mon, Sep 17 2018 6:08 PM

TDP Supporters attacked on woman in polling booth

అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం పొడరాళ్లపల్లి పోలింగ్ బూత్ లో టీడీపీ కార్యకర్తలు దొంగ ఓట్లను ప్రోత్సహిస్తున్నారు. ఓటు వేసేందుకు వచ్చిన రత్నాబాయి అనే మహిళ టీడీపీ కార్యకర్తల చర్యలను  అడ్డుకుని... ఇదేం పనంటూ ప్రశ్నించింది. అంతే మమ్మల్నే ప్రశ్నిస్తావా అంటూ తెలుగుతమ్ముళ్లు మహిళ అని కూడా చూడకుండా రత్నాబాయిపై దాడి చేశారు. ఆ క్రమంలో రత్నబాయి తీవ్రంగా గాయపడింది. స్థానికులు వెంటనే స్పందించి రత్నాబాయిను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పొడరాళ్లపల్లిలో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది.

 

అలాగే విజయనగరం జిల్లా జామి మండలం జాగరం పోలింగ్ కేంద్రం వద్ద పోలీసులు  ఓవరాక్షన్ చేశారు. ఓటు వేసేందుకు వచ్చిన ఓ యువకుడిపై పోలీసులు అకారణంగా దాడి చేశారు. దాంతో పోలీసుల తీరుపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అ కారణంగా ఎందుకు కొట్టారంటు ప్రశ్నించిన గ్రామస్తులకు పోలీసుల నుంచి నిర్లక్ష్యమైన సమాధానం వచ్చింది. అంతే పోలీసులుపై గ్రామస్తులు దాడి చేశారు. స్థానికంగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement