mudigubba mandal
-
ప్రతిభకు గుర్తింపు: విద్యార్థులను ఆకాశాన తిప్పిన టీచర్
ముదిగుబ్బ: అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలంలోని మద్దన్నగారిపల్లి ప్రాథమిక పాఠశాలలో ప్రతిభ కనబరిచిన ఐదుగురు విద్యార్థులను ఆ పాఠశాల ఉపాధ్యాయుడు రమేశ్ తన సొంత ఖర్చుతో విమానంలో హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. ఆజాదీకి అమృత్ మహోత్సవంలో భాగంగా పాఠశాలకు చెందిన విద్యార్థులను జాతీయ నేతల వేషధారణలో బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు విమానంలో తీసుకెళ్లారు. ఏటా చదువులో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఎంపిక చేసి విమానంలో విహరింపజేస్తుంటారు. ఇందులో భాగంగానే ఈ ఏడాది ఐదుగురు విద్యార్థులను పిలుచుకెళ్లారు. చదవండి: బ్యాంక్‌కు నిద్రలేని రాత్రి.. అర్ధరాత్రి పాము హల్చల్ చదవండి: గుజరాత్ కొత్త సీఎంగా భూపేంద్ర పటేల్ -
పోలింగ్ కేంద్రంలో మహిళపై దాడి
అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం పొడరాళ్లపల్లి పోలింగ్ బూత్ లో టీడీపీ కార్యకర్తలు దొంగ ఓట్లను ప్రోత్సహిస్తున్నారు. ఓటు వేసేందుకు వచ్చిన రత్నాబాయి అనే మహిళ టీడీపీ కార్యకర్తల చర్యలను అడ్డుకుని... ఇదేం పనంటూ ప్రశ్నించింది. అంతే మమ్మల్నే ప్రశ్నిస్తావా అంటూ తెలుగుతమ్ముళ్లు మహిళ అని కూడా చూడకుండా రత్నాబాయిపై దాడి చేశారు. ఆ క్రమంలో రత్నబాయి తీవ్రంగా గాయపడింది. స్థానికులు వెంటనే స్పందించి రత్నాబాయిను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పొడరాళ్లపల్లిలో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. అలాగే విజయనగరం జిల్లా జామి మండలం జాగరం పోలింగ్ కేంద్రం వద్ద పోలీసులు ఓవరాక్షన్ చేశారు. ఓటు వేసేందుకు వచ్చిన ఓ యువకుడిపై పోలీసులు అకారణంగా దాడి చేశారు. దాంతో పోలీసుల తీరుపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అ కారణంగా ఎందుకు కొట్టారంటు ప్రశ్నించిన గ్రామస్తులకు పోలీసుల నుంచి నిర్లక్ష్యమైన సమాధానం వచ్చింది. అంతే పోలీసులుపై గ్రామస్తులు దాడి చేశారు. స్థానికంగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.