
ముదిగుబ్బ: అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలంలోని మద్దన్నగారిపల్లి ప్రాథమిక పాఠశాలలో ప్రతిభ కనబరిచిన ఐదుగురు విద్యార్థులను ఆ పాఠశాల ఉపాధ్యాయుడు రమేశ్ తన సొంత ఖర్చుతో విమానంలో హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. ఆజాదీకి అమృత్ మహోత్సవంలో భాగంగా పాఠశాలకు చెందిన విద్యార్థులను జాతీయ నేతల వేషధారణలో బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు విమానంలో తీసుకెళ్లారు. ఏటా చదువులో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఎంపిక చేసి విమానంలో విహరింపజేస్తుంటారు. ఇందులో భాగంగానే ఈ ఏడాది ఐదుగురు విద్యార్థులను పిలుచుకెళ్లారు.
చదవండి: బ్యాంక్‌కు నిద్రలేని రాత్రి.. అర్ధరాత్రి పాము హల్‌చల్
చదవండి: గుజరాత్ కొత్త సీఎంగా భూపేంద్ర పటేల్
Comments
Please login to add a commentAdd a comment