సాక్షి, శ్రీకాకుళం: మందస మండలం హరిపురంలో తల్లీకూతుళ్ల హత్యయత్నం కేసులో టీడీపీ నేత కొట్ర రామారావే ఏ-1 నిందితుడిగా ఉన్నాడు. జిల్లాలో టీడీపీ నేతల అండతో కొట్ర రామారావు రెచ్చపోయాడు. దగ్గరి బంధువు దాలమ్మ, ఆమెక కూతురును వేధింపులకు గురిచేశాడు. బాధితులకు వారసత్వంగా వచ్చిన ఆస్తిని ఆక్రమించుకునేందుకు పలుమార్లు శారీరకంగా వారిని శారీరకంగా హింసించాడు.
కాగా, 2017 నుంచి బాధితులైన తల్లీకూతుళ్లు.. రామారావు అక్రమాలపై పోరాటం చేస్తున్నారు. అప్పటి ఎమ్మెల్యే గౌతు శివాజీ, ఎంపీ రామ్మోహన్ నాయుడు, కళా వెంకట్రావు అండతో రామారావు కేసును నీరుగార్చేలా చేశాడు. ఇక, అడ్డగోలు అబద్ధాలతో చంద్రబాబు, నారా లోకేష్ ట్విట్టర్‌లో అబద్ధాలు చెబుతూ పోస్టులు పెట్టడం గమనార్హం. నిందితులు వైఎస్సార్‌సీపీ నేతలుగా టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది. కానీ, స్థానికులు మాత్రం టీడీపీ నేతలే నిందితులని ముక్తకంఠంతో చెబుతున్నారు.
ఇదీ జరిగింది..
హరిపురంలో స్థల వివాదం ముదిరి సోమవారం ఇద్దరు మహిళలపై కంకర(గులకరాళ్లతో కూడిన మట్టి) పోసే వరకూ వెళ్లింది. కొట్ర రామారావు, ప్రకాశరావు, ఆనందరావులతో సమీప బంధువులైన కొట్ర దాలమ్మ, మజ్జి సావిత్రిలకు ఓ ఇంటి స్థలం విషయమై ఎప్పటి నుంచో వివాదం ఉంది. వీరి మధ్య ఊరి పెద్దలు కూడా రాజీ కుదర్చలేకపోయారు. హరిపురంలో స్థలాల ధరలు విపరీతంగా పెరగడంతో ఎవరికి వారే పట్టుదలకు పోయారు. ఈ తరుణంలో సోమవారం వివాదం మరింత ముదిరింది.
రామారావు, ఆనందరావు, ప్రకాశరావులు ట్రాక్టర్లతో వివాద స్థలంలో కంకర వేస్తుండగా.. దాలమ్మ, సావిత్రి అడ్డుకున్నారు. దీంతో ట్రాక్టర్ల వెనుక ఉన్న వీరిద్దరిపై అమాంతం మట్టిని కుమ్మరించేశారు. నడుంలోతు వరకు కూరుకపోవడంతో వారు పెద్దగా రోదించారు. వీరి కేకలు విన్న చుట్టు పక్కల వారు పారలతో కంకరను తీసి మహిళలను బయటకు లాగారు. దీనిపై వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల్ని అరెస్ట్ చేసేందుకు చర్యలకు ఉపక్రమించారు.
Comments
Please login to add a commentAdd a comment