rukmini
-
రుక్మిణి కోట చేసిన పనికి నాకు అన్నం కూడా పెట్టలేదు..
-
రుక్మిణీ కోట నా జీవితం నాశనం చేసింది..కంటతడి పెట్టిన జనసైనికుడు
-
ఎవరు ఈ రుక్మిణి కోట ?..పవన్ కళ్యాణ్ కి రుక్మిణి కోటకు ఉన్న సంబంధం అదే..
-
తోరణాలైనా వాడకముందే కడతేర్చాడు
వనపర్తి: పెళ్లిచేసుకున్న రెండు వారాలకే అనుమానంతో భార్యను, అత్తను కడతేర్చాడు ఓ యువకుడు. వనపర్తి జిల్లాకేంద్రంలో సంచలనం రేకెత్తించిన ఈ ఘటనకు సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు.. వనపర్తి జిల్లాకేంద్రంలోని ఎన్టీఆర్ కాలనీలో నివాసం ఉండే వెంకటేశ్వర్లు, రమాదేవి అలియాస్ జ్యోతి(45)ల కుమార్తె రుక్మిణి(21), ఏపీలోని కర్నూలుకు చెందిన శ్రావణ్ వివాహం ఈ నెల 1వ తేదీన వనపర్తిలో జరిగింది. పెళ్లి అయిన 13 రోజుల వ్యవధిలోనే భార్యభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. ఈ క్రమంలో భార్యను కాపురానికి తీసుకెళ్లడానికి శ్రావణ్ వనపర్తికి వచ్చాడు. రుక్మిణితోపాటు అత్త రమాదేవి, మామ వెంకటేశ్వర్లును కూడా మంగళవారం కర్నూలు నగరంలోని చింతలమునినగర్లో ఉన్న తమ ఇంటికి తీసుకువెళ్లాడు. అక్కడికి వెళ్లిన కొద్దిసేపటికే తల్లీకూతుళ్లపై కూరగాయలు కోసే కత్తితో శ్రావణ్ దాడికి తెగబడ్డాడు. తీవ్రంగా గాయపడిన జ్యోతి, రుక్మిణి అక్కడికక్కడే మృతిచెందగా, అడ్డుకోబోయిన వెంకటేశ్వర్లుకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో స్థానికులు స్పందించి వెంకటేశ్వర్లును ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పెళ్లి చేసుకున్న రెండు వారాలకే భార్యపై అనుమానంతో ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. -
Rukmini Banerji: స్మార్ట్ మామ్ ఈ రుక్మిణి.. ఏం చేస్తారంటే!
పిల్లలు స్కూలుకు వెళ్లి చదువుకుంటున్నారు. కానీ ఏడాది ఏడాదికి తరగతులు మాత్రమే మారుతున్నాయి. వారు నేర్చుకున్నది ఏమీ కనిపించడం లేదు. స్కూళ్లలో చదువుతోన్న యాభైశాతం మంది పిల్లలు కనీసం పదాలు కూడా సరిగా రాయలేకపోతున్నారు. చిన్నపాటి వాక్యాలను కూడా చదవలేకపోతున్నారు. ఇక గణితం అయితే అంతే సంగతులు. ఈ స్థితిని ‘లెర్నింగ్ ప్రావర్టీ’గా పరిగణించాల్సిన అవసరం ఉంది. దీని మీద దృష్టి కేంద్రీకరించకపోతే రేపటితరం భవిష్యత్ అంధకారమవుతుంది అని అర్థవంతంగా చెప్పారు డాక్టర్ రుక్మిణీ బెనర్జి. దీంతో వందకుౖ పెగా దేశాల విద్యావేత్తలు పోటీపడిన బహుమతిని అవలీలగా అందుకున్నారు రుక్మిణీ బెనర్జీ. పాఠశాల విద్యలో అభ్యసన ప్రక్రియను మెరుగు పరచడానికి ఆమె సూచించిన అంశాలకు గాను ఎడ్యుకేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ‘యిదన్’ బహుమతి అందుకున్నారు. ఈ బహుమతి కోసం 130 దేశాలకు చెందిన విద్యావేత్తలు పోటీపడగా బెనర్జీని బహుమతి వరించడం విశేషం. ఆర్థికవేత్త నుంచి విద్యావేత్తగా... బిహార్‌కు చెందిన డాక్టర్ రుక్మిణీ బెనర్జీ న్యూఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్ కాలేజీ, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో అర్థశాస్త్రాన్ని చదివి, ఆక్స్ఫర్డ్ యూనివర్శిటి స్కాలర్‌గా చేరారు. తరువాత చికాగో యూనివర్సిటీలో పీహెచ్డీ పూర్తి చేశారు. ఉన్నత విద్య పూర్తయ్యాక అమెరికాలోనే స్థిరపడిన బెనర్జి 1996లో ఇండియా వచ్చారు. అప్పుడు ముంబై కేంద్రంగా పనిచేస్తోన్న ఎన్జీవో ‘ప్రథమ్’లో చేరారు. అప్పటి నుంచి విద్యావ్యవస్థ అభివృద్ధే లక్ష్యంగా కృషిచేస్తున్నారు. వివిధ రకాల కార్యక్రమాల ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని స్కూలు పిల్లల అభ్యసనను మెరుగుపరుస్తున్నారు. ఈ క్రమంలోనే బెనర్జీ నేతృత్వంలోని బృందం ‘యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్టు’(ఏఎస్ ఈఆర్)ను విడుదల చేసింది. 2005–15 వరకు ఇంటింటికి తిరిగి సర్వే చేసి విడుదల చేసిన నివేదిక అది. వందరోజులకు పైగా గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించి ఆరు లక్షలమంది పిల్లల అక్షరాస్యత నాణ్యతపై సర్వే నిర్వహించారు. ఈ క్రమంలో అనేక స్కూళ్లను సందర్శించి ఎక్కువమంది పిల్లలు ప్రాథమిక అంశాలను కూడా చదవలేకపోవడం, చిన్నపాటి గుణింతాలు కూడా చేయలేకపోవడం గుర్తించి, అంతేగాక ‘టీచింగ్ ఎట్ ద రైట్ లెవల్’ (టీఏఆర్‌ఎల్) కార్యక్రమం ద్వారా విద్యార్థుల అభ్యసనను మెరుగు పరచవచ్చని సూచించారు. అంతేగాక టీఏఆర్ఎల్ను కొన్ని ప్రాంతాల్లో అమలు చేసి మంచి ఫలితాలను చూపించారు. ఈ కార్యక్రమానికి రుక్మిణి చేసిన కృషికి గుర్తింపుగా ఆమెను యిదన్ ప్రైజ్ వరించింది. ఏఎస్ఈఆర్.. ఏఎస్ఈఆర్తోపాటు .. పిల్లల కోసం హిందీ, ఇంగ్లీష్ భాషల్లో దినపత్రికల్లో ఆరి్టకల్స్ రాయడం, పిల్లలకు సులువుగా అర్థమయ్యే విధంగా కథల పుస్తకాలను బెనర్జీ రాస్తున్నారు. ఏఎస్ఈఆర్ నివేదిక రూపొందించే బృందాన్ని ముందుండి నడిపించారు. ఈ నివేదికను విడుదల చేసిన తరువాత బెనర్జి ప్రథమ్‌కు సీఈవో అయ్యారు. విద్యావ్యవస్థ అభివృద్ధిని గుర్తించిన బిహార్ ప్రభుత్వం 2008లో ‘మౌలానా అబుల్ కలామ్ శిక్షా పురస్కార్’తో సత్కరించింది. రాష్ట్రంలో ఈ అవార్డును అందుకున్న తొలి వ్యక్తి బెనర్జీనే. తాజాగా 2021 సంవత్సరానికి గాను విద్యాభివృద్ధికి కృషిచేస్తోన్న వారికిచ్చే ‘యిదన్’ బహుమతిని అందుకున్నారు. స్మార్ట్ మామ్ విద్యద్వారా మెరుగైన ప్రపంచాన్ని అందించేవారిని సత్కరించేందుకు గాను 2016లో చార్లెస్ చెన్ యిదన్ ‘ద యిదన్ అవార్డు’ను ఏర్పాటు చేశారు. ఈ బహుమతి పొందిన వారికి స్వర్ణ పతకంతోపాటు, 3.9 మిలియన్ డాలర్లు( మన రూపాయల్లో దాదాపు 29 కోట్లు) దీనిలో సగం మొత్తా్తన్ని విద్యాభివృద్దికి వినియోగించాలి. ‘‘యిదన్ ప్రైజ్ విద్యాభివృద్ధికి మరింత కృషిచేసే అవకాశం కల్పించింది. గత 15 ఏళ్లుగా పిల్లల అక్షరాస్యతపై పనిచేస్తున్నాం. మొహల్లా లెర్నింగ్ క్యాంపెయిన్‌లో భాగంగా వలంటీర్లతో ‘టీచింగ్ ఎట్ ది రైట్ లెవల్’ను అందిస్తున్నాము. ‘స్మార్ట్ మామ్’ పేరిట విద్యార్థుల తల్లులకు ఎస్ఎమ్ఎస్, వాట్సాప్ మెస్సేజ్‌ల ద్వారా చిన్నపాటి యాక్టివిటీలను అప్పజెప్పి వారి ద్వారా పిల్లల అభ్యసనను మెరుగుపరుస్తున్నాం. దీనికి మంచి స్పందన లభిస్తోంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పదివేల కమ్యూనిటీల్లో 30 నుంచి 35 వేలమంది తల్లులు పాల్గొంటున్న ఈ కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్తాము’’ అని రుక్మిణీ బెనర్జీ వివరించారు. చదవండి: కూచునే హక్కు మీకు ఉంది... -
ఖాదీ రవివర్మ
రవివర్మ చిత్రాలు గోడల మీద పెయింటింగ్స్‌గా, క్యాలెండర్లుగా కనిపించడం కొత్తకాదు. కాని అవి ఖాదీ వస్త్రాల మీదకు తర్జుమా కావడం పూర్తిగా కొత్త. గాంధీజీ 150వ జయంతి సందర్భంగా రవివర్మ ముని మనవరాలు రుక్మిణి వర్మ, డ్రస్ డిజైనర్ గౌరంగ్ షా ఖాదీ చీరల మీద రవివర్మ బొమ్మలను రూపు కట్టించారు. వీటి ప్రదర్శన ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ప్రఖ్యాత చిత్రకారుడు రాజా రవివర్మ ముని మనుమరాలు రుక్మిణి వర్మ నాట్యకారిణి. భరతనాట్యం, కథక్, కథాకళి ప్రదర్శనలు అనేకం ఇచ్చారు. బెంగళూరులో డాన్స్ స్కూల్, ‘రాజా రవివర్మ హెరిటేజ్ ఫౌండేషన్’ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రవివర్మ చిత్రాల ప్రదర్శన మీద ఆమె ముందు నుంచి కృషి చేస్తున్నారు. ఐదేళ్ల క్రితం డ్రస్ డిజైనర్ గౌరంగ్ షా ఆమెను కలిసి ఒక ప్రతిపాదన చేశారు. ‘గాంధీజీ 150 జయంతి మరో ఐదేళ్లలో రానున్న సందర్భంగా ఆయనకు నివాళిగా ఖాదీ వస్త్రాల మీద రవివర్మ చిత్రాలను రూపుదిద్దుతాను. అందుకు అంతగా వ్యాప్తిలోకి రాని చిత్రాలు ఇవ్వండి’ అని ఆ ప్రతిపాదన సారాంశం. అందుకు సమ్మతించిన రుక్మిణి రవివర్మ చిత్రాల్లో అరుదైన ఇంత వరకు ఎక్కువగా ప్రదర్శితం కాని ముప్పై చిత్రాలను ఇచ్చారు. ఆ చిత్రాలను ఖాదీ వస్త్రం మీద ఆవిష్కరింప చేయడం అనే మహా యజ్ఞాన్ని తలకెత్తుకున్నారు గౌరంగ్. ఐదేళ్ల సుదీర్ఘ శ్రమ తర్వాత ఆ బొమ్మలను ఖాదీ వస్త్రాల మీదకు తీసుకురాగలిగారు. ‘‘గాంధీజీ ఫాదర్ ఆఫ్ నేషన్. రవివర్మ ఫాదర్ ఆఫ్ ఆర్ట్. ఈ ఇద్దరి జయంతి–వర్థంతి ఒకే రోజు. గాంధీకి ఇష్టమైన ఖాదీలో రవివర్మ చిత్రాలను రూపొందించడానికి కారణం వాళ్లిద్దరినీ ఒక వేదిక మీదకు తీసుకు రావడమే. ఇందు కోసం రుక్మిణి వర్మను సంప్రదించినప్పుడు ఆమె వినూత్నమైన చిత్రాల హక్కులను ఇచ్చి మరీ ప్రోత్సహించారు. రవివర్మ చిత్రాల డిజిటల్ రూపాలను ఖాదీ వస్త్రాల మీద జాందానీ నేతలో పునఃసృష్టించాం. ఈ బొమ్మలు ఉన్న చీరల మొదటి ప్రదర్శనను 2019 అక్టోబర్ రెండవ తేదీన ముంబయిలో పెట్టాం. తర్వాత అహ్మదాబాద్, ఢిల్లీలో ప్రదర్శించాం. ఇప్పుడు హైదరాబాద్‌లో పెట్టాము. వచ్చే నెల బరోడాలో ఉంది. ఇలా దేశంలోని ప్రముఖ నగరాలన్నింటిలో ఎగ్జిబిషన్ పెట్టిన తర్వాత విదేశాలకు తీసుకెళ్లాలనేది నా ఆలోచన. ’’ అన్నారు గౌరంగ్ షా. ప్రదర్శనలో... హైదరాబాద్ ‘సప్తపరి’్ణలో ప్రదర్శితమవుతున్న ముప్పై చిత్రాల్లో దాదాపుగా పాతిక చిత్రాలు స్త్రీ ప్రధానంగా ఉన్నాయి. రిద్ధి– సిద్ధిలతో వినాయకుడు, ఉయ్యాల ఊగుతున్న మోహిని, సఖులతో పరిహాసాల మధ్య శకుంతల, వనవాసంలో సీత, సుభద్రను ఓదారుస్తున్న అర్జునుడు, కేరళ సంప్రదాయ దుస్తులలో వీణ మీటుతున్న సరస్వతి మొదలైన చిత్రాలు చీరల మీద నేతలో ఒదిగిపోయాయి. ఒక చిత్రంలో కృష్ణుడి ఆస్థానంలో ఇరవై మంది కొలువుదీరి ఉన్నారు. ఒక్కొక్కరి ముఖంలో ఒక్కో భావం, కళ్లలో కూడా చిత్రవిచిత్రమైన భావాలు వ్యక్తమవుతున్నాయి. ఆ భావాలు చీర మీద కూడా యథాతథంగా రూపుదిద్దుకున్నాయి. హరి–హర బేటీ చిత్రంలో అయితే ఒకే తల రెండుగా భ్రమింప చేస్తుంది. శివుడు అధిరోహించిన నంది వైపు నుంచి చూస్తే నంది తల కనిపిస్తుంది. విష్ణుమూర్తి వైపు నుంచి చూస్తే ఏనుగు తల కనిపిస్తుంది. రవివర్మ చిత్రకళలో చూపించిన ఇంతటి వైవిధ్యాన్ని నేతలో తీసుకురావడానికి నేతకారులకు మూడేళ్లు పట్టింది. 150/150 నేతలో ఆరువందల రంగులను ఉపయోగించారు. శ్రీకాకుళంలోని జాందానీ నేతకారుల చేతుల్లో వస్త్రం మీద రూపం పోసుకున్న చిత్రాలివి.– వాకా మంజులారెడ్డి -
కాలచక్రం
అంబాలాల్ వైవాహిక జీవితంలోని ఓ దశాబ్ద కాలం సంతాన సౌఖ్యం లేకుండానే గడిచిపోయింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా, డాక్టర్లతో పాటు స్వాములు, బాబాల చుట్టూ తిరిగినా, చివరికి మాయమంత్రాలు ప్రయోగించినా ఆయనకు సంతాన భాగ్యం కలగలేదు. ఇక తనకు సద్గతి ప్రాప్తించే మార్గం లేదనుకున్నాడు. తను పోయాక కొరివి పెట్టేవాడు లేనట్టే అని నిర్ధారణకొచ్చాడు. అయితే పదకొండో సంవత్సరం అద్భుతం జరిగింది. ఆయన భార్య రుక్మిణి గర్భం దాల్చింది. నవమాసాల తర్వాత పండంటి బిడ్డకి జన్మనిచ్చింది. అంతవరకు నిస్సారంగా గడిచిన ఆ దంపతుల జీవితంలోకి హఠాత్తుగా వసంతం వచ్చినట్టయింది. లేకలేక కలిగిన బిడ్డ నామకరణం వేడుకని అంబాలాల్ వైభవంగా జరిపాడు. బాగా ఆలోచించి కొడుక్కి భగవత్ ప్రసాద్ అనే పేరు పెట్టాడు. ఆ బిడ్డ నిజంగానే భగవంతుని ప్రసాదం గనుక ఆ పేరు పెట్టాడు. పైగా భగవత్‌ని పక్కన పెట్టినా ప్రసాద్ అన్న పొట్టి పేరు పలకటానికి సౌకర్యంగా ఉంటుంది. భగవత్ ప్రసాద్ తొలి పుట్టినరోజుని అంబాలాల్ ఘనంగా జరిపాడు. వీధిలోని వారందర్నీ పిలిచి స్వీట్లు పంచిపెట్టాడు. తనకొచ్చే నెలజీతాన్ని ఒక్కరోజులోనే ఖర్చు పెట్టేశాడు. అంబాలాల్‌కి తన ఏకైక కుమారుడంటే వల్లమాలిన ప్రేమ. ఎండవల్ల పిల్లవాడి శరీరం వేడెక్కినా కంగారుపడి వెంటనే పిల్లల డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లేవాడు. ఊర్లో దొరికే అన్ని రకాల ఆటబొమ్మల్ని తెచ్చి పిల్లవాడికిచ్చేవాడు. మూడేళ్ల వయసు రాగానే భగవత్ప్రసాద్ని నగరంలోనే పేరు పొందిన స్కూల్లో చేర్పించాడు. ప్రతిరోజూ ఉదయం తనే పిల్లవాణ్ణి స్కూలుకి తీసుకెళ్లి సాయంత్రం ఇంటికి తీసుకొచ్చేవాడు. సాయంత్రం స్కూలు వదలకముందే అక్కడికెళ్లి మైదానంలో కొడుకు కోసం ఎదురుచూస్తూ కూర్చునేవాడు. ఇంట్లో ఉన్నంతసేపు కూడా పిల్లవాడి బాధ్యత తనదే. భార్యని ఇంటి పనులకే పరిమితం చేశాడు.ఒక్కమాటలో చెప్పాలంటే అంబాలాల్ తన కొడుకుని అచ్చం ఓ రాకుమారునిలా పెంచాడు. అతను అడిగిన దాన్ని ఆగమేఘాల మీద తీసుకొచ్చి ఇచ్చేవాడు. చాక్లెట్ తింటానంటే చాక్లెట్ ప్యాకెట్ తీసుకొచ్చేవాడు. బిస్కెట్ కావాలంటే నాలుగైదు రకాల బిస్కెట్లు తీసుకొచ్చేవాడు. సినిమాకెళతానంటే సినిమాకి, పార్కుకెళతానంటే పార్కుకి తీసుకెళ్లేవాడు. అంబాలాల్‌కి వచ్చే జీతంలో ఓ పెద్ద భాగం కొడుకు విలాసాలకే ఖర్చయ్యేది.దాంతో నెలాఖరులో డబ్బుకి కటకట ఏర్పడి కొంత అప్పు చేయాల్సి వచ్చేది. కానీ కొడుకు ఆనందం కన్నా అప్పులు ముఖ్యం కాదు. ఈ రోజు కొడుకు కోసం చేస్తున్నదంతా వృథా కాదు.వృద్ధాప్యంలో ఇదే కొడుకు తనను ఊతకర్రలా ఆదుకుంటాడని అంబాలాల్ తన మనసుకు నచ్చచెప్పుకొనేవాడు. చిన్నతనంలోనే కొడుక్కి అడిగిందల్లా ఇచ్చేస్తూ విలాసాలకు అలవాటు చేస్తే రేపు పెద్దయ్యాక అతను మొండిగా తయారవుతాడని అంబాలాల్‌ని అప్పుడప్పుడు భార్య అడ్డుకొనేది. కానీ లేకలేక కలిగిన కొడుకు పట్ల భర్తకి గల ప్రేమను చూసి ముచ్చటపడి కోపాన్ని దిగమింగుకొనేది. అదృష్టవశాత్తు నాలుగేళ్ల తర్వాత అంబాలాల్ దంపతులకు మరో కొడుకు పుట్టాడు. భార్యాభర్తలిద్దరూ ఆనందంతో పొంగిపోయారు. అయితే ఇంట్లోకి కొత్త కుటుంబసభ్యుడు రావడంతో ఖర్చు పెరిగింది. దాంతో అంతవరకు భగవత్‌ప్రసాద్ కోసం పెడుతున్న దుబారా ఖర్చుకి కోత పడింది. ఖర్చులో మాత్రమే కాదు, భగవత్‌ప్రసాద్ కోసం అంబాలాల్ కేటాయించే సమయంలోనూ కోతపడింది. అంతకుముందు అంబాలాల్ ఇంటికి రాగానే భగవత్ప్రసాద్ను ఎత్తుకుని ముద్దుపెట్టుకునేవాడు. ఇప్పుడు తండ్రిని చూసి భగవత్‌ప్రసాద్ ‘నాన్నా... నాన్నా’ అని పిలుస్తుంటే వాణ్ణి ఎత్తుకోవడానికి చేతులు చాచి అంతలోనే చిన్నకొడుకు ఏడుపు విని ఆ ఎత్తిన చేతులతోనే చిన్నవాణ్ణి ఎత్తుకునేవాడు. అది చూసి భగవత్‌ప్రసాద్ కోపంతో ఏడుపు లంకించుకునేవాడు. ఒక్కోసారి మితిమీరిన కోపంతో చేతిలో ఉన్న వస్తువుని తండ్రిపైకి విసిరేసేవాడు. ఓరోజు అతను అలాగే తన చేతిలో ఉన్న కొయ్యబొమ్మను తండ్రిపైకి విసిరేశాడు. అంబాలాల్ గబుక్కున తలకాయ కిందికి వంచి తప్పించుకున్నాడు. లేకపోతే ఆ కొయ్యబొమ్మ తగిలి అతడి నెత్తి బొప్పికట్టేది. ఆ దృశ్యం చూసిన రుక్మిణి పరిగెత్తుకొచ్చి కోపంతో భగవత్‌ప్రసాద్ చెంప వాయించింది. దాంతో భగవత్ బిగ్గరగా ఏడుపు లంకించుకున్నాడు. ఇంతకుముందు ఇదే సంఘటన జరిగి ఉంటే అంబాలాల్ భార్యను చెడామడా తిట్టి భగవత్‌ని బుజ్జగించేవాడు. కానీ ఈసారి ఆయన మౌనంగా ఉండిపోయాడు. భార్యను తిట్టలేదు. భగవత్‌ను సముదాయించలేదు. దానికి బదులు చిన్నకొడుకుని ఎత్తుకుని ఆడించసాగాడు. అది చూసి భగవత్ కోపంగా మరింతగా రగిలిపోసాగాడు. కాలం గిర్రున తిరిగింది.అంబాలాల్ కొడుకులిద్దరూ పెరిగి పెద్దవారయ్యారు.స్వతహాగా పెద్దవాడికి ఉడుకురక్తం కాగా, చిన్నవాడైన రమేష్ శాంతిస్వరూపుడు.ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఉత్తర దక్షిణ ధ్రువాల మధ్య ఉన్నంత తేడా ఉండేది. భగవత్ చిన్న చిన్న విషయాలకే ఉద్రేకంతో ఊగిపోయేవాడు. ఓసారైతే అలిగి ఇంట్లోంచి బయటికెళ్లిపోయాడు. అంబాలాల్ అతని కోసం ఎక్కడెక్కడో వెదికాడు. భగవత్ వారం వరకు తన అమ్మమ్మ ఊర్లో ఉండి ఇంటికి తిరిగి వచ్చాడు. కొడుకు వ్యవహారం చూసి అంబాలాల్ కలత చెందేవాడు. ఎన్నో నోములు నోచి కన్న ఆ పిల్లవాడి పెంపకంలో ఎక్కడ తప్పు జరిగిందో ఆయనకు అంతు పట్టలేదు. మరోపక్క తమ రక్తమే పంచుకు పుట్టిన చిన్నవాడు అన్నకు పూర్తిగా భిన్నమైనవాడు. ఎప్పుడూ శాంతంగా, నమ్రతగా ఉంటాడు. పెద్దవాడు మనసుని గాయపరచినప్పుడల్లా అంబాలాల్ చిన్నవాడి ప్రేమతో సాంత్వన పొందేవాడు.భగవత్‌కి ఉద్యోగం దొరకగానే పెళ్లిచేశాడు అంబాలాల్.ఇంటికి కోడలు వచ్చింది. బాగా చదువుకున్న అమ్మాయి. ఉద్యోగం కూడా చేస్తోంది. అందువల్ల ఆమె అత్త మామల్ని పట్టించుకునేది కాదు. పైగా వారిపై భర్తకి లేనిపోని చాడీలు చెప్పేది. ఓరోజు ఏదో విషయం మీద రుక్మిణి కోడల్ని తిట్టింది. దాంతో కోడలు ఏడుపు లంకించుకుంది. అప్పుడే భగవత్ ఇంటికొచ్చాడు.తల్లి మీద మండిపడ్డాడు. ఇందులో రుక్మిణి తప్పేం లేదు. అంబాలాల్ సర్ది చెప్పబోయాడు. దాంతో భగవత్ మరింత రగిలిపోయాడు. మాటా మాటా పెరిగింది. అతడు అప్పటికప్పుడే భార్యతో కలిసి ఇల్లు వదిలి వెళ్లిపోయాడు.అప్పటికే రిటైరైన అంబాలాల్‌కి పింఛన్ డబ్బుతో ఇల్లు గడవడం కష్టంగా మారింది. కొడుకు హఠాత్తుగా ఇల్లు వదిలేసి పోవటాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయాడు. ఆయనకి గుండెనొప్పి వచ్చింది. రమేష్ వెంటనే తండ్రిని ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించాడు. గండం తప్పింది. అయితే అప్పటి నుంచి అంబాలాల్ రోజూ బీపీ, కొలెస్ట్రాల్ తగ్గించే మాత్రల్ని వాడాల్సి వచ్చింది. మరోపక్క రుక్మిణి ఆరోగ్యం కూడా క్షీణించింది. అదృష్టవశాత్తు అప్పుడే రమేష్‌కి ఉద్యోగం దొరికింది. దాంతో అందరూ నిశ్చింతగా ఊపిరి పీల్చుకున్నారు. మరో ఏడాదికల్లా రమేష్ పెళ్లి జరిగింది. తమ్ముడి పెళ్లికి భగవత్ రాలేదు.అయినా అంబాలాల్ పట్టించుకోలేదు. కష్టకాలంలో పెద్దకొడుకు తమను వదిలేసి వెళ్లిపోయినప్పుడే అతను చనిపోయినట్టు భావించాడు అంబాలాల్. తనకు రమేష్ ఒక్కడే కొడుకు అనుకున్నాడు.వృద్ధాప్యంలో తమకు ఊతకర్రలా సాయపడతాడని ఆశలన్నీ చిన్నకొడుకు మీదే పెట్టుకున్నాడు. రమేష్ భార్య కూడా భర్తలాగే శాంతంగా, సౌమ్యంగా ఉండేది. అత్తమామల్ని బాగా చూసుకునేది. ఓరోజు రమేష్ ఆనందంగా ఇంటికొచ్చాడు. తనకు ప్రమోషన్ లభించిందని, కంపెనీ తనను భార్యతో సహా అమెరికాకి పంపిస్తుందని చెప్పాడు. రమేష్కది శుభవార్తే కానీ అంబాలాల్‌కి మాత్రం అది దుర్వార్తగా కనిపించింది.ముసలితనంలో కొడుకు, కోడలు లేకుండా తాము ఎలా ఉండాలి? అనే చింత పట్టుకుంది. అయితే కొడుక్కి జీతం పెరగడం వల్ల తమకు సౌకర్యాలు కూడా పెరుగుతాయని ఆశ పుట్టింది. అరవై ఏళ్లుగా తను చీకటి, దుర్గంధం నిండిన పాతకాలం నాటి ఇంట్లోనే బతికాడు. ఇప్పుడు కొడుక్కి ఆదాయం పెరిగితే ఈ పాత కొంప అమ్మేసి మంచి ఇంట్లో హాయిగా ఉండొచ్చనుకున్నాడు. ఈ ఆశతోనే కొడుకు అమెరికాకి వెళ్లటానికి ఒప్పుకున్నాడు. రమేష్ కొంత అప్పుచేసి మంచి సూటు, బూటు, టై వంటివి కొనుక్కుని భార్యతో కలిసి అమెరికా విమానమెక్కాడు. ఎయిర్‌పోర్టులో కొడుకు కోడలు ఎక్కిన విమానం గాలిలోకి ఎగిరి కనుమరుగయ్యే వరకు కళ్లు విప్పార్చి చూశాడు అంబాలాల్. ఉదాసీనంగా ఇంటికి తిరిగొచ్చాడు. అతనికి అన్నం సయించలేదు. సరిగా నిద్రపట్టలేదు. అయితే మరుసటి రోజు ఉదయమే అమెరికా నుంచి ఫోనొచ్చింది. ఫోన్లో కొడుకు స్వరం వినగానే అంబాలాల్ ఆనందంతో పొంగిపోయాడు.‘‘నాన్నగారు! మేం అమెరికా చేరుకున్నాం’’ అవతలి నుంచి ఆనందంగా పలికాడు రమేష్.‘‘చాలా మంచిది బాబూ!’’‘‘మీ ఆరోగ్యం ఎలా ఉంది నాన్నా? నిన్న రాత్రి మాత్రలు వేసుకున్నారా?’’ ఆదుర్దాగా అడిగాడు రమేష్. కొడుక్కి తన ఆరోగ్యం పట్ల ఉన్న శ్రద్ధను చూసి అంబాలాల్ ఆనందంతో పొంగిపోయాడు. వేల మైళ్ల దూరం వెళ్లినా తన మందుల గురించి మర్చిపోని కొడుకు ఉన్నాడని గ్రహించాక ఆయనకి వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్టయింది. తర్వాత రమేష్ తన తల్లిని కూడా కుశల ప్రశ్నలు అడిగాడు. ఆనందంతో ఇద్దరి కళ్లు చెమ్మగిల్లాయి. వారం తర్వాత రమేష్ నుంచి నాలుగు పేజీల పెద్ద ఉత్తరం వచ్చింది. తాము విమానం ఎక్కినప్పటి నుంచి అమెరికాలో దిగే వరకు, తాముంటున్న నగర విశేషాలన్నీ రాశాడు. చివర్లో ‘మీరు సమయానికి మందులు వేసుకోండి. నేను లేనని నిర్లక్ష్యం చెయ్యకండి’ అని రాయటం మర్చిపోలేదు. అంత పెద్ద ఉత్తరంలో ఆ చివరి మాటలే అంబాలాల్‌ని ఆనందపరిచాయి. ఆ తర్వాత రమేష్ ఉత్తరాలు క్రమం తప్పకుండా రాసాగాయి. అంబాలాల్ కూడా ఎంతో ఓపికగా జవాబులు రాసేవాడు. తన కొడుకు తొందరగా తండ్రి కావాలని కోరుకునేవాడు. అయితే ఆ శుభవార్త వినటానికి అంబాలాల్‌కి చాలాకాలం పట్టింది. తనకు మనవడు పుట్టాడని తెలియగానే వీధిలోని వారందరికీ మిఠాయిలు పంచిపెట్టాడు. తండ్రి కోరికపై రమేష్ తన పుత్రుడి ఫొటో పంపించాడు. దాన్ని అంబాలాల్ వీధిలోని వారందరికీ చూపించాడు. ఫొటోని తన తలగడ కిందే పెట్టుకొని ఉదయం లేవగానే చూసేవాడు. అలా మనవడి ముఖం చూస్తే ఆయనకి రోజంతా ఉల్లాసంగా గడిచిపోయేది.అయితే తర్వాత మూడు నెలల వరకు రమేష్ నుంచి ఉత్తరం రాలేదు. నెలకి కనీసం ఒక్క ఉత్తరమైనా రాసే కొడుకు మూడు నెలలుగా ఉత్తరం రాయకపోవడంతో అంబాలాల్ కలవరపడ్డాడు. తీరిక దొరకలేదో లేక ఏదైనా సమస్యతో బాధపడుతున్నాడో తెలుసుకోవాలని తనే ఉత్తరం రాశాడు. జవాబు కోసం అసహనంగా ఎదురు చూడసాగాడు. నెల గడిచినా జవాబు రాలేదు. అంబాలాల్‌లో అసహనం పెరగసాగింది. ఐఎస్డీ కాల్ చెయ్యాలంటే రెండొందల దాకా బిల్లవుతుంది. అయినా ధైర్యం చేసి ఫోన్ చేశాడు. కోడలు మాట్లాడింది. రమేష్ ఆఫీసుకెళ్లాడని చెప్పింది. బిల్లు పెరుగుతుందనే భయంతో కుశల ప్రశ్నలడిగి ఫోన్ పెట్టేశాడు. కొద్ది రోజుల తర్వాత రమేష్ నుంచి ఉత్తరం వచ్చింది. అంబాలాల్ ఆత్రంగా తెరిచి చూశాడు. మునపటిలా పెద్ద ఉత్తరం కాదు. నాలుగంటే నాలుగు వాక్యాలున్నాయి. తనకు క్షణం కూడా తీరిక దొరకటంలేదని మాత్రమే రాశాడు. అంబాలాల్ ఉత్తరాన్ని రెండు మూడుసార్లు దీక్షగా చదివాడు. ఉత్తరంలో ఎక్కడా ‘నాన్నా, సమయానికి మందులు వేసుకోండి. అమ్మ ఎలా ఉంది?’లాంటి మాటలు లేవు. తొందర్లో మర్చిపోయినట్లున్నాడు. మరోసారి తీరిగ్గా ఉత్తరం రాస్తాడనుకున్నాడు. చాలాకాలానికి కొడుకు నుంచి ఉత్తరం వచ్చినందుకు అంబాలాల్ దంపతులు సంతోషంగా ఆరోజు మసాలా కిచిడీ వండుకొని తిన్నారు.మరో రెండు నెలలు గడిచినా రమేష్ నుంచి ఉత్తరం రాలేదు.అంబాలాల్‌లో మళ్లీ అసహనం పెరగసాగింది. కొడుకుతో మాట్లాడాలన్న తపన పెరిగింది. ధైర్యం చేసి మరోసారి ఐఎస్డీ కాల్ చేశాడు. అదృష్టవశాత్తు రమేష్ ఫోన్ ఎత్తాడు. అంబాలాల్ ఉత్సాహంగా మాట్లాడాడు. కాని రమేష్ ముక్తసరిగా మాట్లాడి ఫోన్ పెట్టేశాడు. అయినా అంబాలాల్ నిరాశపడలేదు. కొడుకుతో మాట్లాడినందుకు తృప్తిపడ్డాడు. బిల్ ఎక్కువవుతుందని అతను త్వరగా ఫోన్ పెట్టేశాడు. తర్వాత తనే తీరిగ్గా రమేష్ ఫోన్ చేస్తాడనుకున్నాడు.కానీ అలా జరగలేదు. రమేష్ నుంచి ఫోన్ రాలేదు. చాలారోజులు గడిచాయి. ఇప్పుడు అంబాలాల్‌కి ఫోన్ చేసే శక్తిలేదు. కంటిచూపు బాగా తగ్గింది. ఎలాగోలా కష్టపడి ఓ ఉత్తరం రాశాడు. జవాబు రాలేదు. నెల తర్వాత మరో ఉత్తరం రాశాడు. దానికీ సమాధానం లేదు. ఇంకో నెలకి మరొకటి రాశాడు. స్పందన రాలేదు. నాలుగో ఉత్తరం రాశాక ఓపిక నశించింది. జవాబు వస్తుందన్న ఆశ కూడా అడుగంటింది. పెద్దకొడుకు పోట్లాడి తన జీవితంలోంచి వెళ్లిపోయాడు. చిన్నకొడుకు పోట్లాడలేదు. కానీ ఎండాకాలంలో గాలిలోకి ఇంకిపోయే వాననీటిలా నిశ్శబ్దంగా నిష్క్రమించాడు. తేడా ఆచరణలోనే. ఫలితం ఒక్కటే!అంబాలాల్ తన వైవాహిక జీవితంలోని తొలి పదేళ్లు తనకు సంతానం లేదని బాధపడ్డాడు.ఇప్పుడు ఆయేన జీవనసంధ్యలోనూ అదే పరిస్థితి పునరావృతమైంది. ఓ కాలచక్రం పరిపూర్ణమైందనిపించింది. గుజరాతీ మూలం : విజయ్ శాస్త్రి అనువాదం: రంగనాథ రామచంద్రరావు -
అపార్ధం చేసుకొని మహిళ ప్రాణం తీశారు
చెన్నై : రోడ్డుపై ఆడుకుంటున్న పిల్లలకు చాకెట్లు ఇచ్చిన ఓ మహిళను అపార్ధం చేసుకున్న స్థానికులు ఆమెపై దాడిచేసి హతమార్చారు. ఈ దారుణమైన ఘటన తమిళనాడులోని తిరువన్నామలై జిల్లాలోని అతిమూర్‌లో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. చెన్నైకి చెందిన రుక్మిణి బంధువులు ఈ నెల మూడో తేదీన మలేషియా నుంచి రావడంతో.. వారితో కలిసి తమ కులదైవాన్ని దర్శించుకోవడానికి మంగళవారం సాయంత్రం అతిమూర్కు కారులో బయలుదేరారు. మార్గమధ్యలో రాత్రి నిదురించి ఉదయం వారి ప్రయాణాన్ని కొనసాగించారు. ఆ ప్రాంతానికి వెళ్లి చాలా ఏళ్లు కావడంతో వారు దారి తప్పారు. రోడ్డుపై వెళ్తున్న వారిని అడ్రస్ అడిగి ఆలయం వైపు బయలుదేరారు. ఆ సమయంలో రుక్మిణి రోడ్డుపై ఆడుకుంటున్న ఇద్దరు పిల్లలకు చాక్లెట్లు ఇచ్చారు. దీనిని అపార్ధం చేసుకున్న కొంతమంది.. వారిని కిడ్నాపర్లుగా భావించి ఊళ్లో వారికి సమాచారం అందించారు. అది నిజమని భావించిన గ్రామస్తులు వారి కారును అడ్డగించి.. ఒక్కసారిగా దాడికి దిగారు. ఈ దాడిలో రుక్మిణి అక్కడిక్కడే మరణించగా... తీవ్రంగా గాయపడిన ఆమె బంధువులను, కారు డ్రైవర్‌ను పోలీసులు తిరుమన్నామలై ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గ్రామస్తులు వారి వాహనాన్ని కూడా పూర్తిగా ధ్వంసం చేశారు. ఈ ఘటనపై పోలీసులు స్పందిస్తూ.. బాధితులను కిడ్నాపర్లు అంటూ పుకార్లు సృష్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ దాడి జరుగుతున్న సమయంలో కొంతమంది ఫొటోలు, వీడియోలు తీశారని.. నిందితులను గుర్తించడానికి వాటిని పరిశీలిస్తున్నట్టు తెలిపారు. -
వివాహిత ఆత్మహత్య
పెద్దపప్పూరు (తాడిపత్రి) : రుణదాతల ఒత్తిళ్లు ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి. ఒత్తిళ్లు తాళలేక ఓ వివాహిత కిరోసిన్ పోసుకుని నిప్పటించుకుని ఆత్మహత్య చేసుకుంది. పెద్దపప్పూరు మండలం నరసాపురంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. నరసాపురానికి చెందిన రవీంద్ర చేనేత కార్మికుడు. మగ్గం గిట్టుబాటు కాకపోవడంతో అప్పులపాలయ్యాడు. కుటుంబ పోషణ సైతం భారమైంది. దీంతో అప్పులుఇ చ్చిన వారు ఇంటి వద్దకు వచ్చి ఒత్తిడి తెచ్చేవారు. దీన్ని అవమానంగా భావించిన రవీంద్ర భార్య రుక్మిణి (40) సోమవారం ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఇరుగుపొరుగు వారు గమనించి మంటలు ఆర్పి.. తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు అక్కడి నుంచి కర్నూలుకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలికి కొడుకు, కుమారుడు ఉన్నారు. ఎస్ఐ శ్రీహర్ష సంఘటన స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసుకున్నారు. -
సూటిపోటి మాటలకు కలత చెంది..
మీర్పేట్: అత్త, మామ, భర్త తరుచూ సూటిపోటి మాటలతో మానసిక వేదనకు గురిచేస్తున్నారన్న కలతతో ఓవివాహిత బలవన్మరణానికి పాల్పడింది. మీర్పేట్ ఎస్సై భాస్కర్ తెలిపిన వివరాల మేరకు నగరంలోని ఎన్టీఆర్నగర్లో నివాసం ఉంటున్న రుక్మిణి(21)కు మీర్‌పేట్‌కు చెందిన సంతోష్(27)తో 2013లో వివాహం జరిగింది. వీరికి 8నెలల పాప కూడా ఉంది. ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్న సంతోష్ తల్లి జ్యోతి, తండ్రి శ్యాంతో కలిసి మీర్పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మీర్పేట్ నందిహిల్స్‌లో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో బుధవారం ఇంట్లో ఎవరులేని సమయంలో బెడ్రూంలో ఉన్న సీలింగ్ ప్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ప్రతి చిన్న పనికి కూడా భర్త, అత్త, మామలు సూటిపోటీ మాటలతో వేధిస్తుండేవారని దీంతో విసుగు చెంది రుక్మిణి ఆత్మహత్యకు పాల్పడిందని ఎస్సై తెలిపారు. మృతురాలి సోదరుడి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు చెప్పారు. -
చిట్టీల పేరుతో రూ.4 కోట్లకు కుచ్చుటోపీ
విజయవాడ : చిత్తూరు జిల్లాలో వనజాక్షి ఘటన మరవక ముందే విజయవాడలో చిట్టీల పేరుతో ఓ మహిళ ఘరానా మోసానికి పాల్పడింది. చిట్టీ డబ్బులను సొంత అవసరాలకు వినియోగించుకుని సభ్యులకు ఎగనామం పెట్టింది. పటమటకు చెందిన రుక్మిణి అనే చిట్టీ నిర్వాహకురాలు సుమారు రూ.4 కోట్లు వసూలు చేసి, ఆనక బిచాణా ఎత్తేసింది. ఈ విషయం తెలుసుకున్న బాధితులు ...రుక్మిణి ఇంటిపై దాడి చేశారు. ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇంట్లో ఫర్నిచర్ ధ్వంసం చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పటమట పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
దొంగలు దొరికారు
కనిగిరి : పలు చెయిన్ స్నాచింగ్, చోరీ కేసుల్లో నిందితులను కనిగిరి, పామూరు పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. మొత్తం 11 కేసులకు సంబంధించి ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి 11 బంగారు గొలుసులు, 2 బైకులు స్వాధీనం చేసుకున్నారు. కనిగిరి పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కందుకూరు డీఎస్పీ పి.శంకర్ ఆ వివరాలు వెల్లడించారు. ఏడాది నుంచి కనిగిరి, పామూరు, పీసీ పల్లి, సీఎస్ పురం మండలాల్లో చెయిన్ స్నాచింగ్‌లు, చోరీలు పెరిగిపోయాయి. కనిగిరి, పామూరు సర్కిళ్ల పరిధిలో ఐదుగురు దొంగలు రెండు ముఠాలుగా ఏర్పడి చోరీలకు పాల్పడుతున్నారు. ఏడాది క్రితం కనిగిరి సర్కిల్ పరిధిలోని మాచవరం గ్రామంలో సూరసాని రుక్మిణి బంగారు గొలుసును అపహరించారు. మూడు నెలల క్రితం స్థానిక గార్లపేట రోడ్డులో జి.అలివేలమ్మ, డి.నాగేంద్రమ్మ, ఇటీవల కాశీనాయన గుడివద్ద జయమ్మ, పెన్నా రాములమ్మ, గత నెల 25వ తేదీ సీఎస్ పురంలో ఆలా కొండమ్మ, పామూరు మండలం కంబాలదిన్నెలోని మరో మహిళ మెడలోని బంగారు గొలుసులను చోరీ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టి నిందితులైన పామూరు మండలం వీరభద్రాపురానికి చెందిన కొత్తకోట బాలాజీ, చీమలదిన్నె పిచ్చయ్య, రామగిరి సిద్దయ్యలను అరెస్టు చేశారు. వీరిలో పిచ్చయ్య, సిద్దయ్యలు బైక్‌పై సిద్ధంగా ఉంటారని, బాలాజీ అనే వ్యక్తి మహిళల మెడలో నుంచి గొలుసులు లాక్కుని వీరిబైక్పై ఎక్కగానే పరారయ్యేవారని డీఎస్పీ తెలిపారు. అదే విధంగా పీసీ పల్లి మండలంలో గతేడాది అక్టోబర్‌లో స్వాతి రైస్‌మిల్లు వద్ద నిద్రిస్తున్న పి.రమణమ్మ మెడలోని బంగారు సరుడు, ఈ ఏడాది సెప్టెంబర్‌లో పెదఅలవలపాడులో చెన్నుపాటి రత్తమ్మ, మారెళ్లలో సీతమ్మలకు చెందిన బంగారు గొలుసులు, అక్టోబర్‌లో పాకాల కొండమ్మ గొలుసులు అపహరణకు గురయ్యాయి. ఆయా కేసులకు సంబంధించి శీలం ప్రకాష్, తమ్మిశెట్టి వెంకట్రావులను పోలీసులు అరెస్టు చేశారు. కంభంకు చెందిన వీరిద్దరూ రాత్రి సమయంలో చోరీలు చేసేవారని డీఎస్పీ వెల్లడించారు. ఈ రెండు ముఠాల నుంచి కనిగిరి, పామూరు, సీఎస్ పురం పోలీస్స్టేషన్లలో నమోదైన ఏడు కేసులకు సంబంధించి 148 గ్రాముల బంగారు గొలుసులు, రెండు మోటారు సైకిళ్లు, పీసీ పల్లిలో నమోదైన 4 కేసులకు సంబంధించి 72 గ్రాముల (నాలుగు గొలుసులు) బంగారం స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వివరించారు. వాటి విలువ సుమారు రూ.6 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. కేసులను ఛేదించిన కనిగిరి, పామూరు సీఐలు యు.సుధాకర్‌రావు, డి.మల్లికార్జునరావు, పీసీ పల్లి, సీఎస్ పురం, పామూరు ఎస్సైలు, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. వీరికి రివార్డుకు సిఫార్సు చేయనున్నట్లు ఆయన తెలిపారు. -
అలరించిన నృత్యం
ఎంపీ బుట్టారేణుక ఎమ్మిగనూరురూరల్: విద్యార్థుల్లో అంతర్గతంగా దాగి ఉన్న సృజనాత్మకతను గుర్తించాలని ఎంపీ బుట్టా రే ణుక ఉపాధ్యాయులకు సూచించారు. బనవాసి జవహర్ నవోదయ విద్యాలయంలో మంగళవారం ప్రారంభమైన 27 రీజనల్‌స్థాయి ఎగ్జిబిషన్ కార్యక్రమం బుధవారం సాయంత్రం ముగిసింది. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ బుట్టా రేణుక హాజరై విద్యాలయ మైదానంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ జెండాను అవిష్కరించి స్టాల్స్‌ను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఇక్కడి విద్యార్థులను చూస్తుంటే తన చిన్ననాటి స్కూలు రోజులు గుర్తుకు వస్తున్నాయని చెప్పారు. విద్యార్థులు గురువులు చెప్పిన విషయాలను శ్రద్ధగా వినాలని తెలిపారు. నవోదయలో సీటు రావటం అదృష్టంగా భావించాలని చెప్పారు. విద్యార్థులు ఏర్పాటు చేసిన ప్రదర్శనలు ఆలోచింపజేసేలా ఉన్నాయని అభినందించారు. అనంతరం ఉత్తమ ప్రదర్శనలకు బహుమతులు అందజేశారు. అంతకుముందు ఎంపీ బుట్టా రేణుకను ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, విద్యాలయం బృందం సభ్యులు శాలువ, పూల మాలతో సన్మానించారు. పాఠశాలకు సంబంధించిన పుస్తకం, సీడీ ని ఎంపీ అవిష్కరించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ రుక్మిణి, సీఐ శ్రీనివాసరావు, రూరల్, పట్టణ ఎస్ఐలు నల్లప్ప, ఇంతియాజ్‌బాష తదితరులు పాల్గొన్నారు. -
కోలాహలంగా ఉట్లోత్సవం
తిరుచానూరు : గోకులాష్టమిని పురస్కరించుకుని తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం ఎదుట మంగళవారం సాయంత్రం ఉట్లోత్సవం కోలాహలం గా జరిగింది. రెండు రోజులుగా అమ్మవారి ఆలయం లో రుక్మిణి సత్యభామ సమేతంగా కొలువైన శ్రీకృష్ణస్వామి వారికి నిర్వహించిన గోకులాష్టమి వేడుకలు ఉట్లోత్సవంతో ముగిశాయి. ఇందులో భాగంగా వేకువజామున స్వామిని సుప్రభాతంతో మేల్కొలిపి నిత్యకైంకర్యాలు నిర్వహించారు. సాయంత్రం రుక్మిణి సత్యభామ సమేతంగా స్వామికి శ్రీకృష్ణస్వామి ముఖమండపంలో కన్నులపండువగా ఊంజల్‌సేవ నిర్వహించా రు. అనంతరం స్వామి వారు ఉభయదేవేరులతో సహా తిరుచ్చిపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. తరువాత ఆలయం ఎదుట స్వామిని కొలువుదీర్చి ఉట్లోత్సవం నిర్వహించారు. ఉట్టి కొట్టేందుకు స్థానికులు, భక్తులు ఉత్సాహం చూపారు. కార్యక్రమం లో ఆలయ స్పెషల్‌గ్రేడ్ డెప్యూటీ ఈవో చెంచులక్ష్మి, ఏఈవో నాగరత్న, సూపరింటెండెంట్లు వరప్రసాద్, కేపీ.వెంకటరత్నం, ఆర్జితం, ప్రసాదం ఇన్స్పెక్టర్లు గురవయ్య, ఆంజనేయులు, ఏవీఎస్వో రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా గరుడోత్సవం
కార్వేటినగరం, న్యూస్‌లైన్ : కార్వేటినగరంలోని రుక్మిణి, సత్యభామ సమేత వేణుగోపాలస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం గరుడసేవ వైభవం గా నిర్వహించారు. సాయంత్రం ఊంజల్ సేవ అనంతరం వాహన మండపానికి చేరుకున్న వేణుగోపాలుడు తన ప్రీతి పా త్రుడైన గరుడ వాహనాన్ని అధిరోహించి రాత్రి 8 గంటలకు గ్రామోత్సవానికి బయలుదేరారు. స్వామివారికి మహిళలు కర్పూ ర హారతులు సమర్పించి, మొక్కులు తీర్చుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వచ్చిన కోలాటాల బృందం, కేరళ వాయిద్యాలు, చెక్క భజనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఊరేగింపు ముందు వృషభ, గజరాజులు నడవగా స్వామివారు భక్తులను అనుగ్రహించారు. 10.45 గంటలకు స్వామికి వేదపండితులు ఏకాంతసేవ చేశారు. జేఈవో భాస్కర్, డెప్యూటీ ఈవో హరినాథ్, సూపరింటెం డెంట్ పీతాంబరరాజు, ఆలయాధికారి సి ద్ధారెడ్డి, జమేదార్ శివకేశవులు, ఓఎస్డబ్ల్యూ శ్రీనివాసులు పాల్గొన్నారు. మోహినీ అవతారంలో.. ఉదయం వేణుగోపాలుడు మోహినీ అవతారంలో పల్లకిపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. అంతకుముందు స్వా మిని ఉదయం ఐదు గంటలకు సుప్రభాతంతో మేల్కొలిపి నిత్య కైంకర్యాలు నిర్వహించారు. అనంతరం తోమాల, శుద్ధి, అర్చన, మొదటి గంట పూజలు చేశారు. ఉదయం ఎనిమిది గంటలకు మోహినీ అవతారంలో పట్టుపీతాంబరాలు, స్వర్ణాభరణాలను ధరించి పల్లకి వాహనంపై విహరించారు. అనంతరం ఆలయానికి చేరుకున్న స్వామికి 10 నుంచి 11 గంటల వరకు ఉభయ నాంచారుల సమేతంగా పాలు, తేనె, పెరుగు, పసుపు, చందనం, నారికేళ జలాలు, సుగంధ ద్రవ్యాలతో వేదపండితులు స్నపన తిరుమంజనం నిర్వహించారు. స్వామివారి తిరుపాదాలను మాడ వీధుల్లో ఊరేగించారు. రమణీయంగా ఊంజల్ సేవ బ్రహ్మోత్సవాల్లో భాగంగా సాయంత్రం రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలునికి ఊంజల్ సేవ ఘనంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానముల పరిధిలోని అన్నమయ్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో సంకీర్తనాలాపన, వేదపండితుల వేద మంత్రోచ్ఛారణ, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల్ సేవ సాగింది. నేడు హనుమంత వాహనం సోమవారం స్వామివారు హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. అనంతరం ఉభయ దేవేరులతో వసంతోత్సవంలో సేద తీరుతారు. రాత్రి గజ వాహనంపై ఊరేగుతారు. -
నింగిలోకి తొలి ‘సైనిక’ ఉపగ్రహం
సూళ్లూరుపేట, న్యూస్‌లైన్/ బెంగళూరు: భారత సైనిక అవసరాల కోసం రూపొందించిన తొలి ఉపగ్రహం ‘జీశాట్-7’ను విజయవంతంగా రోదసీలోకి పంపించారు. ఫ్రెంచి గయానాలోని కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి భారత కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి దాటాక 2 గంటలకు దీన్ని యూరోపియన్ అంతరిక్ష సహకార సంస్థ ఏరియన్‌స్పేస్‌కు చెందిన ఏరియన్-5 రాకెట్ ద్వారా ప్రయోగించి కక్ష్యలో ప్రవేశపెట్టారు. 34 నిమిషాల 25 సెకన్ల ప్రయాణం తర్వాత ఉపగ్రహం రాకెట్ నుంచి విడిపోయి తొలిదశ కక్ష్యలోకి వెళ్లింది. విడిపోవడానికి ఐదు నిమిషాలకు ముందు కర్ణాటక హసన్‌లోని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) మాస్టర్ కంట్రోల్ కేంద్రానికి ఉపగ్రహం నుంచి సంకేతాలు అందాయి. ఉపగ్రహంలోని సౌర ఫలకాలు విద్యుదుత్పత్తి ప్రారంభించాయి. జీశాట్-7 వచ్చే నెలాఖరుకల్లా సేవలు ప్రారంభిస్తుందని ఇస్రో తెలిపింది. 2,625 కేజీల బరువున్న అత్యాధునిక మల్టీబ్యాండ్ జీశాట్-7ను ఇస్రో స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసింది. దీని తయారీకి రూ.187 కోట్లు, ప్రయోగం, బీమా తదితరాలకు రూ.470 కోట్లు ఖర్చయ్యాయి. వచ్చే నెల 4 నాటికి నిర్దేశిత కక్షలోకి ప్రవేశపెడతారు. అంతరిక్ష ఆధారిత కమ్యూనికేషన్ వ్యవస్థ ద్వారా నౌకాదళాన్ని ఆధునీకరించి బలోపేతం చేయడానికి, సముద్ర ప్రాంతాలు, భూతలంపై నిఘా పటిష్టం చేయడానికి దీన్ని ప్రయోగించారు. ఈ ఉపగ్రహం తక్కువ స్థాయి వాయిస్ డేటాతోపాటు భారీస్థాయిలో సమాచారాన్ని పంపుతుందని ఇస్రో తెలిపింది.