వైభవంగా గరుడోత్సవం
కార్వేటినగరం, న్యూస్‌లైన్ : కార్వేటినగరంలోని రుక్మిణి, సత్యభామ సమేత వేణుగోపాలస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం గరుడసేవ వైభవం గా నిర్వహించారు. సాయంత్రం ఊంజల్ సేవ అనంతరం వాహన మండపానికి చేరుకున్న వేణుగోపాలుడు తన ప్రీతి పా త్రుడైన గరుడ వాహనాన్ని అధిరోహించి రాత్రి 8 గంటలకు గ్రామోత్సవానికి బయలుదేరారు. స్వామివారికి మహిళలు కర్పూ ర హారతులు సమర్పించి, మొక్కులు తీర్చుకున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వచ్చిన కోలాటాల బృందం, కేరళ వాయిద్యాలు, చెక్క భజనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఊరేగింపు ముందు వృషభ, గజరాజులు నడవగా స్వామివారు భక్తులను అనుగ్రహించారు. 10.45 గంటలకు స్వామికి వేదపండితులు ఏకాంతసేవ చేశారు. జేఈవో భాస్కర్, డెప్యూటీ ఈవో హరినాథ్, సూపరింటెం డెంట్ పీతాంబరరాజు, ఆలయాధికారి సి ద్ధారెడ్డి, జమేదార్ శివకేశవులు, ఓఎస్‌డబ్ల్యూ శ్రీనివాసులు పాల్గొన్నారు.
మోహినీ అవతారంలో..
ఉదయం వేణుగోపాలుడు మోహినీ అవతారంలో పల్లకిపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. అంతకుముందు స్వా మిని ఉదయం ఐదు గంటలకు సుప్రభాతంతో మేల్కొలిపి నిత్య కైంకర్యాలు నిర్వహించారు. అనంతరం తోమాల, శుద్ధి, అర్చన, మొదటి గంట పూజలు చేశారు. ఉదయం ఎనిమిది గంటలకు మోహినీ అవతారంలో పట్టుపీతాంబరాలు, స్వర్ణాభరణాలను ధరించి పల్లకి వాహనంపై విహరించారు. అనంతరం ఆలయానికి చేరుకున్న స్వామికి 10 నుంచి 11 గంటల వరకు ఉభయ నాంచారుల సమేతంగా పాలు, తేనె, పెరుగు, పసుపు, చందనం, నారికేళ జలాలు, సుగంధ ద్రవ్యాలతో వేదపండితులు స్నపన తిరుమంజనం నిర్వహించారు. స్వామివారి తిరుపాదాలను మాడ వీధుల్లో ఊరేగించారు.
రమణీయంగా ఊంజల్ సేవ
బ్రహ్మోత్సవాల్లో భాగంగా సాయంత్రం రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలునికి ఊంజల్ సేవ ఘనంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానముల పరిధిలోని అన్నమయ్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో సంకీర్తనాలాపన, వేదపండితుల వేద మంత్రోచ్ఛారణ, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల్ సేవ సాగింది.
నేడు హనుమంత వాహనం
సోమవారం స్వామివారు హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. అనంతరం ఉభయ దేవేరులతో వసంతోత్సవంలో సేద తీరుతారు. రాత్రి గజ వాహనంపై ఊరేగుతారు.