garudaseva
-
నేడు పౌర్ణమి గరుడసేవ రద్దు
తిరుపతి: తిరుమలలో మంగళవారం నిర్వహించాల్సిన పౌర్ణమి గరుడ సేవను టీటీడీ రద్దు చేసింది. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా శ్రీవారికి గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే. అయితే శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు జరుగుతున్న కారణంగా మంగళవారం పౌర్ణమి గరుడసేవ ఉండదని, ఈ విషయాన్ని భక్తులు గమనించాలని తెలిపింది. నేడు టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం తిరుమల: టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి నేతృత్వంలో తిరుమలలోని అన్నమయ్య భవన్లో మంగళవారం జరగనుంది. ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్న ఈ సమావేశంలో అభివృద్ధి పనులతో పాటు మరిన్ని అంశాలపై పాలకమండలి చర్చించనుంది. ఈ సమావేశానికి టీటీడీ బోర్డు సభ్యులు హాజరుకానున్నారు. సర్వదర్శన టోకెన్ల జారీ పూర్తి ఈ నెల 23 నుంచి 2024, జనవరి 1వ తేదీ వరకు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన సర్వ దర్శన టోకెన్ల జారీని సోమవారం టీటీడీ పూర్తి చేసింది. తిరుపతిలోని విష్ణునివాసం, శ్రీనివాసం, గోవిందరాజస్వామి సత్రాలు, భూదేవి కాంప్లెక్స్, రామచంద్ర పుష్కరిణి, ఇందిరా మైదానం, జీవకోన హైస్కూల్, బైరాగిపట్టెడలోని రామానాయుడు హైస్కూల్, ఎంఆర్ పల్లిలోని జెడ్పీ హైస్కూల్లో 90 కౌంటర్లలో 10 రోజులకు గాను నాలుగు లక్షలకుపైగా సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్లను భక్తులకు అందించారు. తదుపరి సర్వదర్శనం టోకెన్లను జనవరి 2వ తేదీ నుంచి ఇవ్వనున్నారు. టోకెన్లు లేని భక్తులను దర్శనానికి అనుమతించరు. -
22, 23 తేదీల్లోశ్రీవారి ప్రత్యేక దర్శనం
తిరుమల: శ్రీవారి దర్శనం కోసం వచ్చే వయోవృద్ధులు, దివ్యాంగులు, ఐదేళ్ల లోపు వయసున్న పిల్లల తల్లిదండ్రులకు ఈ నెల 22, 23 తేదీల్లో టీటీడీ ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసింది. ప్రతి నెలా రెండు సాధారణ దినాల్లో వీరికి ప్రత్యేక దర్శనం కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ నెల 22న వయోవృద్ధులు (65 సంవత్సరాలు పైబడినవారు), దివ్యాంగులకు టీటీడీ 4 వేల టోకెన్లు జారీ చేయనుంది. ఉదయం 10 గంటల స్లాట్‌కు వెయ్యి, మధ్యాహ్నం 2 గంటలకు 2 వేలు, 3గంటల స్లాట్‌కు వెయ్యి టోకెన్లు జారీ చేస్తారు. ఎస్వీ మ్యూజియం ఎదురుగా ఉన్న కౌంటర్ల వద్ద వృద్ధులు, దివ్యాంగులకు ప్రస్తుతం ప్రతిరోజూ 1,400 టోకెన్లు జారీ చేస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభించి రెండు స్లాట్లకు సంబంధించిన టికెట్లు కేటాయిస్తారు. కావున భక్తులు ముందుగా వచ్చి టికెట్ల కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ఉదయం 10 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక క్యూ ద్వారా స్వామివారి దర్శనం కల్పిస్తారు. 5 సంవత్సరాల లోపు చంటిపిల్లలను, వారి తల్లిదండ్రులను 23వ తేదీన ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు సుపథం మార్గం ద్వారా దర్శనానికి అనుమతిస్తారు. సాధారణ రోజుల్లో ఒక సంవత్సరం లోపు చంటిపిల్లలకు, వారి తల్లిదండ్రులకు సుపథం మార్గం ద్వారా ప్రవేశం కల్పిస్తారు. భక్తుల కోరిక మేరకు ఐదేళ్లలోపు చంటిపిల్లలను, వారి తల్లిదండ్రులను ఈ రెండు రోజుల్లో సుపథం మార్గం ద్వారా అనుమతిస్తారు. నేడు తిరుమలలో పౌర్ణమి గరుడసేవ.. తిరుమలలో సోమవారం పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరుగనుంది. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా తిరుమలలో గరుడసేవ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రాత్రి 7 నుంచి 9 గంటల వరకు సర్వాలంకార భూషితుడైన మలయప్ప స్వామి గరుడ వాహనంపై ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు. -
నేడే గరుడ వాహన సేవ
-
అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు
-
నేడే గరుడ సేవ
సాక్షి, తిరుమల: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ప్రతిష్టాత్మకమైన గరుడ వాహన సేవ ఊరేగింపు బుధవారం రాత్రి 7.30 గంటలకు ప్రారంభించనున్నారు. రెండున్నర లక్షల మంది భక్తులు తిలకిస్తారని అధికారులు అంచనా. భద్రతకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఇప్పటికే తిరుమలలో 2,700 మందితో భద్రతను పటిష్టం చేశారు. అదనంగా 1000 మందిని విధులకు రప్పించారు. 650 టీటీడీ సీసీ కెమెరాలతో పాటు నాలుగుమాడ వీధులు, ముఖ్య కూడళ్లలో మరో 70 కెమెరాలను ఏర్పాటు చేశారు. ఆక్టోపస్ కమాండోలను, ఏఆర్ కమాండో సిబ్బందిని మఫ్టీలో సిద్ధంగా ఉంచారు. ఏర్పాట్లపై ఉన్నతాధికారుల సమీక్ష.. టీటీడీ ఈవో అనిల్కుమార్సింఘాల్, జేఈవో శ్రీనివాసరాజు, అనంతపురం రేంజ్ డీఐజీ ప్రభాకర్‌రావు, టీటీడీ సీవీఎస్వో రవికృష్ణ, తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ అభిషేక్ మొహంతి గరుడవాహన సేవ ఏర్పాట్ల ను మంగళవారం వేర్వేరుగా సమీక్షించారు. తోపులాట, తొక్కిసలాట కు అవకాశం లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశాలిచ్చా రు. బుధవారం మధ్యాహ్నం నుంచే మాడ వీధుల గ్యాలరీల్లో భక్తులను అనుమతించనున్నారు. మాడ వీధుల్లో 1.80 లక్షల మంది ని అనుమతిస్తారు. మిగిలిన వారిని మాడ వీధుల వెలుపలే కట్టడి చేయనున్నారు. వీరి కోసం భారీ ఎల్సీడీ స్క్రీన్లు ఏర్పాటు చేశా రు. వీఐపీలు, డ్యూటీ అధికారులు, మీడి యా కూడా సాయంత్రం ఆరు గంటల్లోపే వాహన మండపానికి చేరుకోవాలని ఉత్తర్వులు ఇచ్చారు. రెండు ఘాట్‌రోడ్లలోనూ మంగళవారం అర్ధరాత్రి నుంచి ద్విచక్ర వాహనాలను అనుమతిండం లేదు. ముందు జాగ్రత్త చర్యగా తిరుపతి నుంచే ట్రాఫిక్‌ను మళ్లించారు. తిరుమలలో కూడా ప్రత్యేక పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. ప్రైవేట్ వాహనాలను జీఎన్సీ టోల్గేట్ వద్ద నుంచే క్రమబద్ధీకరిస్తున్నారు. తిరుమలలో 7వేల వాహనాలకు పార్కింగ్ ఉంది. ఆ సంఖ్య దాటితే తిరుపతిలోనే నిలిపివేయనున్నారు. పరిమిత సంఖ్యలోనే పాసులు, బ్యాడ్జిలు జారీ చేయాలని నిర్ణయించారు. వీవీఐపీలు, వీఐపీలకు ఒకరికి ఐదులోపే రెండు రకాల బ్యాడ్జిలు అందజేస్తారు. వీరిని వాహనం మండపం కుడివైపున గ్యాలరీల్లోకి అనుమతిస్తారు. ఎడమవైపున టీటీడీ ఉద్యోగ, పోలీసులు, మరోవైపు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల ప్రతినిధులకు అందజేస్తారు. వీరిని ఆస్థా న మండపం కొత్త బ్రిడ్జి నుంచి అనుమతిస్తారు. ⇒ శ్రీవారి నిత్యాన్నప్రసాద సముదాయం, క్యూకాంప్లెక్స్లు, క్యూలు, నాలుగు మాడ వీధుల్లో రెండు లక్షల మందికి ఉచిత భోజన సౌకర్యం కల్పించనున్నారు. ⇒ తిరుమలలో పలు ప్రాం తాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. 108 అంబులెన్స్ సర్వీసులు కూడా పనిచేస్తున్నాయి. -
వైభవంగా గరుడోత్సవం
కార్వేటినగరం, న్యూస్‌లైన్ : కార్వేటినగరంలోని రుక్మిణి, సత్యభామ సమేత వేణుగోపాలస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం గరుడసేవ వైభవం గా నిర్వహించారు. సాయంత్రం ఊంజల్ సేవ అనంతరం వాహన మండపానికి చేరుకున్న వేణుగోపాలుడు తన ప్రీతి పా త్రుడైన గరుడ వాహనాన్ని అధిరోహించి రాత్రి 8 గంటలకు గ్రామోత్సవానికి బయలుదేరారు. స్వామివారికి మహిళలు కర్పూ ర హారతులు సమర్పించి, మొక్కులు తీర్చుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వచ్చిన కోలాటాల బృందం, కేరళ వాయిద్యాలు, చెక్క భజనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఊరేగింపు ముందు వృషభ, గజరాజులు నడవగా స్వామివారు భక్తులను అనుగ్రహించారు. 10.45 గంటలకు స్వామికి వేదపండితులు ఏకాంతసేవ చేశారు. జేఈవో భాస్కర్, డెప్యూటీ ఈవో హరినాథ్, సూపరింటెం డెంట్ పీతాంబరరాజు, ఆలయాధికారి సి ద్ధారెడ్డి, జమేదార్ శివకేశవులు, ఓఎస్డబ్ల్యూ శ్రీనివాసులు పాల్గొన్నారు. మోహినీ అవతారంలో.. ఉదయం వేణుగోపాలుడు మోహినీ అవతారంలో పల్లకిపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. అంతకుముందు స్వా మిని ఉదయం ఐదు గంటలకు సుప్రభాతంతో మేల్కొలిపి నిత్య కైంకర్యాలు నిర్వహించారు. అనంతరం తోమాల, శుద్ధి, అర్చన, మొదటి గంట పూజలు చేశారు. ఉదయం ఎనిమిది గంటలకు మోహినీ అవతారంలో పట్టుపీతాంబరాలు, స్వర్ణాభరణాలను ధరించి పల్లకి వాహనంపై విహరించారు. అనంతరం ఆలయానికి చేరుకున్న స్వామికి 10 నుంచి 11 గంటల వరకు ఉభయ నాంచారుల సమేతంగా పాలు, తేనె, పెరుగు, పసుపు, చందనం, నారికేళ జలాలు, సుగంధ ద్రవ్యాలతో వేదపండితులు స్నపన తిరుమంజనం నిర్వహించారు. స్వామివారి తిరుపాదాలను మాడ వీధుల్లో ఊరేగించారు. రమణీయంగా ఊంజల్ సేవ బ్రహ్మోత్సవాల్లో భాగంగా సాయంత్రం రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలునికి ఊంజల్ సేవ ఘనంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానముల పరిధిలోని అన్నమయ్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో సంకీర్తనాలాపన, వేదపండితుల వేద మంత్రోచ్ఛారణ, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల్ సేవ సాగింది. నేడు హనుమంత వాహనం సోమవారం స్వామివారు హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. అనంతరం ఉభయ దేవేరులతో వసంతోత్సవంలో సేద తీరుతారు. రాత్రి గజ వాహనంపై ఊరేగుతారు.