
సాక్షి, తిరుమల:
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ప్రతిష్టాత్మకమైన గరుడ వాహన సేవ ఊరేగింపు బుధవారం రాత్రి 7.30 గంటలకు ప్రారంభించనున్నారు. రెండున్నర లక్షల మంది భక్తులు తిలకిస్తారని అధికారులు అంచనా. భద్రతకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఇప్పటికే తిరుమలలో 2,700 మందితో భద్రతను పటిష్టం చేశారు. అదనంగా 1000 మందిని విధులకు రప్పించారు. 650 టీటీడీ సీసీ కెమెరాలతో పాటు నాలుగుమాడ వీధులు, ముఖ్య కూడళ్లలో మరో 70 కెమెరాలను ఏర్పాటు చేశారు. ఆక్టోపస్ కమాండోలను, ఏఆర్ కమాండో సిబ్బందిని మఫ్టీలో సిద్ధంగా ఉంచారు.
ఏర్పాట్లపై ఉన్నతాధికారుల సమీక్ష..
టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌సింఘాల్, జేఈవో శ్రీనివాసరాజు, అనంతపురం రేంజ్ డీఐజీ ప్రభాకర్‌రావు, టీటీడీ సీవీఎస్‌వో రవికృష్ణ, తిరుపతి అర్బన్ జిల్లా ఎస్‌పీ అభిషేక్ మొహంతి గరుడవాహన సేవ ఏర్పాట్ల ను మంగళవారం వేర్వేరుగా సమీక్షించారు. తోపులాట, తొక్కిసలాట కు అవకాశం లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశాలిచ్చా రు. బుధవారం మధ్యాహ్నం నుంచే మాడ వీధుల గ్యాలరీల్లో భక్తులను అనుమతించనున్నారు. మాడ వీధుల్లో 1.80 లక్షల మంది ని అనుమతిస్తారు. మిగిలిన వారిని మాడ వీధుల వెలుపలే కట్టడి చేయనున్నారు. వీరి కోసం భారీ ఎల్‌సీడీ స్క్రీన్లు ఏర్పాటు చేశా రు. వీఐపీలు, డ్యూటీ అధికారులు, మీడి యా కూడా సాయంత్రం ఆరు గంటల్లోపే వాహన మండపానికి చేరుకోవాలని ఉత్తర్వులు ఇచ్చారు. రెండు ఘాట్‌రోడ్లలోనూ మంగళవారం అర్ధరాత్రి నుంచి ద్విచక్ర వాహనాలను అనుమతిండం లేదు.
ముందు జాగ్రత్త చర్యగా తిరుపతి నుంచే ట్రాఫిక్‌ను మళ్లించారు. తిరుమలలో కూడా ప్రత్యేక పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. ప్రైవేట్ వాహనాలను జీఎన్‌సీ టోల్‌గేట్ వద్ద నుంచే క్రమబద్ధీకరిస్తున్నారు. తిరుమలలో 7వేల వాహనాలకు పార్కింగ్ ఉంది. ఆ సంఖ్య దాటితే తిరుపతిలోనే నిలిపివేయనున్నారు. పరిమిత సంఖ్యలోనే పాసులు, బ్యాడ్జిలు జారీ చేయాలని నిర్ణయించారు. వీవీఐపీలు, వీఐపీలకు ఒకరికి ఐదులోపే రెండు రకాల బ్యాడ్జిలు అందజేస్తారు. వీరిని వాహనం మండపం కుడివైపున గ్యాలరీల్లోకి అనుమతిస్తారు. ఎడమవైపున టీటీడీ ఉద్యోగ, పోలీసులు, మరోవైపు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల ప్రతినిధులకు అందజేస్తారు. వీరిని ఆస్థా న మండపం కొత్త బ్రిడ్జి నుంచి అనుమతిస్తారు.
⇒ శ్రీవారి నిత్యాన్నప్రసాద సముదాయం, క్యూకాంప్లెక్స్‌లు, క్యూలు, నాలుగు మాడ వీధుల్లో రెండు లక్షల మందికి ఉచిత భోజన సౌకర్యం కల్పించనున్నారు.
⇒ తిరుమలలో పలు ప్రాం తాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. 108 అంబులెన్స్ సర్వీసులు కూడా పనిచేస్తున్నాయి.