
సాక్షి, తిరుపతి : తిరుమలలో యువతిపై ఎలుగుబంటి దాడి చేసింది. ఈ ఘటనలో ఆమె కాళ్లు చేతులకు గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ఆమెను అశ్విని ఆస్పత్రికి తరలించారు. టీటీడీ ప్రత్యేకాధికారి ధర్మారెడ్డి బాధితురాలిని పరామర్శించారు. కాగా గాయపడిన యువతి తెలంగాణకు చెందిన విజయలక్ష్మీగా పోలీసులు గుర్తించారు. భూగర్భ డ్యాం వద్ద స్నానం చేసి తిరిగి వస్తున్న క్రమంలో ఈ ఘటన జరిగినట్లు ఆమె పేర్కొందని తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటోందని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment