Bear attack
-
విషాదం.. ఎలుగుబంటి దాడిలో ఇద్దరి మృతి
సాక్షి, శ్రీకాకుళం: జిల్లాలో శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ ఎలుగుబంటి ఇద్దరి ప్రాణాలను తీసేసింది. మరొకరు గాయపర్చింది. వివరాలు.. వజ్రపుకొత్తూరు మండలం అనకాపల్లిలో ఓ ఎలుగుబంటి బీభత్సం సృష్టించింది. జీడితోటలో పనిచేస్తున్న ముగ్గురు కార్మికులపై ఒక్కసారిగా దాడి చేసింది. జీడితోటలో పనిచేస్తున్న కార్మికులపై ఎలుగుబంటి దాడి చేసింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందగా.. మరో మహిళకు గాయాలయ్యాయి. మృతులను అప్పికొండ కూర్మారావు(45), లోకనాథం(46)గా గుర్తించారు. గాయపడిన మహిళలు స్థానికులు ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎలుగుబంటిని బంధించేందుకు చర్యలు ప్రారంభించారు. ఇద్దరి ప్రాణాలు పోవడం, ఓ మహిళ గాయాలతో ఆసుపత్రి పాలవ్వడంతో అనకాపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇదిలా ఉండగా ఎలుగు బంటి దాడి గురించి తెలుసుకున్న గ్రామస్తులు భయబ్రాంతులకు గురవుతున్నారు. ఎలుగుబంట్లు గ్రామాల్లోకి ప్రవేశించి మనుషుల ప్రాణాలు తోడేస్తున్న పట్టించుకోవడం లేదని అటవీశాఖ అధికారులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
Bear attack: క్రాష్ మార్కెట్..!
ముంబై: స్టాక్ మార్కెట్‌పై బేర్ ప్రతాపం చూపింది. ఫలితంగా కొత్త ఏడాదిలో జీవితకాల గరిష్టాల వద్ద ట్రేడవుతున్న సెన్సెక్స్ గత, 18 నెలల్లో భారీ పతనాన్ని బుధవారం చవిచూసింది. అధిక వెయిటేజీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరు(8.46%)పతనం, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు ఆందోళనలు, అమెరికా బాండ్లపై రాబడులు పెరగడం గతేడాది (2023) చైనా ఆర్థిక వృద్ధి నిరాశపరచడం తదితర పరిణామాలు ఇందుకు కారణమయ్యాయి. సెన్సెక్స్ ఒకటిన్నర శాతానికి పైగా నష్టపోవడంతో బీఎస్ఈలో రూ.4.69 లక్షల కోట్లు ఆవిరయ్యాయి. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.370 లక్షల కోట్లకు దిగివచి్చంది. కాగా గడిచిన 2 రోజుల్లో రూ.5.73 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. బ్యాంకింగ్, మెటల్, ఆయిల్ రంగ షేర్లు భారీగా అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. రోజంతా నష్టాల్లోనే ట్రేడింగ్ ఉదయం సెన్సెక్స్ 1,130 పాయింట్ల పతనంతో 71,999 వద్ద, నిఫ్టీ 385 పాయింట్ల నష్టంతో 21,647 వద్ద మొదలయ్యాయి. తర్వాత ఏ దశలోనూ కోలుకోలేదు. ఒకానొక దశలో సెన్సెక్స్ 1,699 పాయింట్లు క్షీణించి 71,429 వద్ద, నిఫ్టీ 482 పాయింట్లు దిగివచ్చి 21,550 వద్ద ఇంట్రాడే కనిష్టాలకు పడ్డాయి. చివరికి సెన్సెక్స్ 1,628 పాయింట్లు నష్టపోయి 71,501 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 460 పాయింట్లు పతనమై 21,572 వద్ద స్థిరపడ్డాయి. 2022 జూన్ 13 తర్వాత సూచీలకిదే అత్యంత భారీ పతనం కావడం గమనార్హం. ► చైనా ఆర్థిక వృద్ధి రేటు 2023లో (5.2%) అంచనాలు అందుకోలేకపోవడం, డాలర్ ఇండెక్స్ నెల గరిష్టానికి చేరుకోవడంతో మెటల్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. సెయిల్ 5%, టాటా స్టీల్, నాల్కో, జిందాల్ స్టీల్ షేర్లు 4% పతనమయ్యాయి. జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హిందాల్కో, ఎన్ఎండీసీ, వేదాంత, అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్లు 3%, హిందుస్థాన్ కాపర్, హిందాల్కో జింక్ షేర్లు 2.5% నుంచి ఒకశాతం చొప్పున నష్టపోయాయి. హెచ్‌డీఎఫ్‌సీకి.. రూ.1.07 లక్షల కోట్ల నష్టం హెచ్డీఎఫ్సీ బ్యాంకు డిసెంబర్ క్వార్టర్ ఫలితాలు నిరాశపరిచాయి. రుణ వృద్ధి, లిక్విడిటీ కవరేజ్ రేషియో(ఎల్‌సీఆర్)లపై ఆందోళన వ్యక్తం చేస్తూ బ్రోకరేజ్ సంస్థలైన సీఎల్ఎస్ఏ, మోర్గాన్ స్టాన్లీలు షేరు రేటింగ్ తగ్గించాయి. దీంతో హెచ్డీఎఫ్సీ బ్యాంకు షేరు 8.46% నష్టపోయి రూ.1,537 వద్ద ముగిసింది. బ్యాంకు మార్కెట్ విలువ ఒక్క రోజులోనే రూ.1.07 లక్షల కోట్లు ఆవిరై రూ.11.66 లక్షల కోట్లకు దిగివచి్చంది. అత్యంత విలువైన పీఎస్‌యూగా ఎల్ఐసీ ఎల్ఐసీ కంపెనీ అరుదైన రికార్డు సృష్టించింది. ప్రభుత్వ రంగ లిస్టెడ్ కంపెనీల్లో అత్యంత విలువైనదిగా అవతరించింది. ఈ షేరు ఇంట్రాడేలో 3% లాభపడి రూ.919 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. లాభాల స్వీకరణతో 1% నష్టంతో రూ.887 వద్ద ముగిసింది. మార్కెట్ విలువ రూ.5.60 లక్షల కోట్లకు చేరింది. ఎస్బీఐ షేరు 1.67% తగ్గింది. మార్కెట్ క్యాప్ రూ.5.58 లక్షల కోట్లుగా నమోదై రెండో స్థానానికి దిగివచ్చింది. కుప్పకూలింది ఇందుకే... హెచ్డీఎఫ్సీ బ్యాంకు పతన ప్రభావం అధిక వెయిటేజీ కలిగిన హెచ్డీఎఫ్సీ బ్యాంకు (8.46%) నష్టం పతనం సూచీల భారీ పతనానికి ప్రధాన కారణంగా నిలిచింది. నిఫ్టీ కోల్పోయిన మొత్తం 460 పాయింట్లలో హెచ్డీఎఫ్సీ బ్యాంకు వాటాయే 235 పాయింట్లు కావడం గమనార్హం. ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు వాయిదా ఆందోళన యూఎస్ ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్లపై ప్రభావం చూపించే అమెరికా డిసెంబర్ ద్రవ్యోల్బణ డేటా, ఉపాధి కల్పన గణాంకాలు అంచనాలకు మించి నమోదడవడంతో ‘వడ్డీ రేట్ల తగ్గింపు వాయిదా’ అంచనాలు తెరపైకి వచ్చాయి. దీంతో అమెరికాలో పదేళ్ల కాల పరిమితి కలిగిన బాండ్లపై రాబడులు(4.04%) ఒక్కసారిగా పెరిగాయి. విదేశీ పెట్టుబడులు ఈక్విటీల నుంచి బాండ్లలోకి తరలిపోతాయనే ఆందోళనలు అధికమయ్యాయి. అలాగే క్రూడాయిల్‌తో పాటు ఇతర కమోడిటీల ధరల పెంపునకు కారణమయ్యే డాలర్ ఇండెక్స్ సైతం నెలరోజుల గరిష్టానికి చేరడమూ ప్రతికూల ప్రభావాన్ని చూపింది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల డీలా ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు వడ్డీరేట్ల తగ్గింపు వాయిదా అంచనాలు, చైనా ఆర్థిక వ్యవస్థ బలహీన సంకేతాలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో ట్రేడయ్యాయి. ఆసియా మార్కెట్లు 2% క్షీణించి నెల రోజుల కనిష్టానికి దిగివచ్చాయి. యూరప్ మార్కెట్లు 2 శాతం మేర క్షీణించాయి. అమెరికా ఒక శాతానికి పైగా నష్టంతో ట్రేడవుతున్నాయి. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల పతన ప్రభావం దలాల్ స్ట్రీట్పైనా పడింది. -
విశాఖ జూ పార్క్‌లో దారుణం.. కేర్ టేకర్‌పై ఎలుగుబంటి దాడి
విశాఖపట్నం: విశాఖపట్నంలోని జూ పార్క్‌లో దారుణం జరిగింది. ఎలుగుబంటి రూమ్‌ని శుభ్రం చేస్తుండగా కేర్ టేకర్‌పై దాడి చేసింది. ఈ ఘటనలో బనవారపు నగేష్ బాబు(25) మృతి చెందాడు. నగేష్ అనే సంరక్షకుడు ఎలుగుబంటి ఉండే ఎన్ క్లోజర్ వద్ద క్లీనింగ్ కు వెళ్ళాడని జూ క్యూరేటర్ నందనీ సలారియా తెలిపారు. అదే సమయంలో ఎలుగుబంటి హెల్త్ చెకింగ్ కోసం వెళ్ళిన డాక్టర్ కీపర్ నగేష్ కోసం వాకబు చేశాడు. అప్పటికే ఎలుగుబంటి తన ఎన్ క్లోజర్ బయట ఉండడంతో తొలుత దానిని లోపలకు పంపి నగేష్ కోసం వెతకగా ఎన్ క్లోజర్ వెనక తీవ్ర రక్తస్రావమై గాయాలతో నగేష్ పడి ఉన్నాడని వెల్లడించారు. పోలీసులకు, వైద్యులకు సమాచారం ఇచ్చాం.. అంబులెన్స్ తెప్పించినా అప్పటికే నగేష్ మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారని పేర్కొన్నారు. ఎలుగుబంటి ఎన్ క్లోజర్ లోపలకి వెళ్ళిన వెంటనే క్లోజ్ చేయకపోవడం వల్లే అది బయటకు వచ్చి నగేష్ పై దాడి చేసిందని స్పష్టం చేశారు. రోజూవారి పనుల్లో భాగంగా ఎలుగుబంటి రూంలోకి కేర్ టేకర్ ప్రవేశించాడు. ఎలుగుబంటిని గమనించకుండా పనిలో నిమగ్నమయ్యాడు. ఇంతలో ఆయనపై ఎలుగుబంటి ఒక్కసారిగా దాడి చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఇదీ చదవండి: Video: సెల్ఫీల వివాదం.. గుంటూరులో జుట్లు పట్టుకొని కొట్టుకున్న యువతులు -
69 క్యాన్ల సోడాలు హాంఫట్
ఒట్టావా: కెనడాలో ఒక మహిళకి వింత అనుభవం ఎదురైంది. ఇంట్లో అవసరాల కోసం తెచ్చుకున్న సోడా క్యాన్లను ఒక ఎలుగు ఊది పారేసింది. షరోన్ రోజెల్ అనే మహిళ తెల్లవారుజామున కుక్క మొరగడంతో లేచి చూసింది. అప్పటికే తన కారు అద్దాలు బద్దలు కొట్టిన ఎలుగుబంటి అందులో ఉంచిన 72 సోడాల క్యాన్లలో ఏకంగా 69 తాగేసింది. బాల్కనీ నుంచి ఇదంతా చూసి రోజెల్ వాటి ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఒక ఎలుగు బంటి ఆ స్థాయిలో సోడాలు తాగడం అత్యంత అరుదు అని కొందరు వ్యాఖ్యానించారు. -
కొమురభీం జిల్లా: టోంకిని లోనవెల్లిలో ఎలుగుబంటి దాడి
-
రెచ్చిపోయిన ఎలుగుబంటి.. బైక్‌పై వెళ్తున్న వారిపై దాడిచేసి..
అడవి ఎలుగుబంటి ఆవేశంలో రెచ్చిపోయింది. రోడ్డు మీద బైక్‌పై వెళ్తున్న వారిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. ఎలుగుబంటి దాడిలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. ఈ దారుణ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివరాల ప్రకారం.. తమిళనాడులోని తెన్‌కాశిలో ఎలుగుబంటి హల్చల్ చేసింది. కరుతిలింగపురం గ్రామానికి చెందిన వైకుంఠమణి అనే వ్యక్తి శివసైలం నుంచి పెతన్‌పిళ్లై గ్రామానికి మసాలా దినుసులు తీసుకుని తన బైక్ మీద వెళ్తున్నాడు. బైక్‌పై వెళ్తున్నాడు. ఈ క్రమంలో మర్గమధ్యంలో ఉన్న అటవీ ప్రాతాన్ని దాటుతుండగా పొదల్లో నక్కిఉన్న ఎలుగుబండి ఒక్కసారిగా అతనిపై దాడిచేసింది. ఎలుగుబంటి దాడిలో బైక్ మీద నుంచి పడిపోయిన వైకుంఠమణిని తీవ్రంగా గాయపరిచింది. వైకుంఠమణిపై కూర్చున్న ఎలుగుబంటి అతడి తనకు కొరుకుతూ, గోళ్లలో రక్కుతూ దాడి చేసింది. ఇది గమనించిన స్థానికులు ఎలుగుబంటిపై రాళ్లు విసరడంతో వాళ్లు మీదకు దూసుకెళ్లి వారిని సైతం గాయపరిచింది. దీంతో మరో ఇద్దరు గాయపడ్డారు. అటుగా వస్తున్న మరికొంత మంది ఎలుగుబండిని బెదరించడంతో ఎలుగు.. అక్కడి నుంచి పారిపోయింది. స్థానికులు అనంతరం.. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. దాడి సమాచారం అందుకున్న వెంటనే అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకుని ఎలుగుబంటి కోసం గాలిస్తున్నారు. కాగా, ఎలుగుబంటి దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. தென்காசியில் பைக்கை வழிமறித்து 3 பேரை கடித்துக் குதறிய கரடி!!#tenkasi #bear #ATTACK pic.twitter.com/JD0kWjzMSs — A1 (@Rukmang30340218) November 6, 2022 -
ఎలుగుబంటి దాడి బాధితులకు 5 లక్షల ఎక్స్ గ్రేషియా
-
తిరుమలలో యువతిపై ఎలుగుబంటి దాడి
సాక్షి, తిరుపతి : తిరుమలలో యువతిపై ఎలుగుబంటి దాడి చేసింది. ఈ ఘటనలో ఆమె కాళ్లు చేతులకు గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ఆమెను అశ్విని ఆస్పత్రికి తరలించారు. టీటీడీ ప్రత్యేకాధికారి ధర్మారెడ్డి బాధితురాలిని పరామర్శించారు. కాగా గాయపడిన యువతి తెలంగాణకు చెందిన విజయలక్ష్మీగా పోలీసులు గుర్తించారు. భూగర్భ డ్యాం వద్ద స్నానం చేసి తిరిగి వస్తున్న క్రమంలో ఈ ఘటన జరిగినట్లు ఆమె పేర్కొందని తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటోందని వెల్లడించారు. -
అతడ్ని చూసి మమ్మీ అనుకున్నారు
మాస్కో : ఎలుగు బంటి దాడిలో గాయపడిన ఓ వ్యక్తి నెల రోజుల పాటు నరకం అనుభవించి ఎట్టకేలకు ప్రాణాలతో బయటపడగలిగాడు. ఎలుగు బంటి గుహలో ఆ నెల రోజులు తిండి తిప్పలు లేకుండా చివరకు ఓ మమ్మీలా తయారయ్యాడు. వివరాల్లోకి వెళితే.. రష్యాకు చెందిన అలెగ్జాండర్ అనే వ్యక్తి నెల రోజుల క్రితం మంగోలియాకు సమీపంలోని తువా అటవీ ప్రాంతానికి వెళ్లాడు. ఆ సమయంలో ఓ గోధుమరంగు ఎలుగు బంటి అతడిపై దాడి చేసి గాయపరిచింది. ఈ దాడిలో అలెగ్జాండర్ వెన్నెముక సైతం విరిగిపోయింది. కదలలేని పరిస్థితిలో అలెగ్జాండర్ అక్కడే కుప్పకూలిపోయాడు. దాడి అనంతరం ఆ ఎలుగుబంటి.. అలెగ్జాండర్‌ను తర్వాత తినొచ్చనే ఉద్ధేశ్యంతో గుహలో పాక్షికంగా పూడ్చేసి వెళ్లిపోయింది. అయితే ఊపిరి అందే స్థితిలో ఉన్న అతడు నెల రోజుల పాటు తిండి తిప్పలు లేకుండా జీవశ్చవంలా గడిపాడు. కొద్దిరోజుల క్రితం వేటకుక్కలతో ఆ ప్రాంతానికి వచ్చిన వేటగాళ్లు ఎలుగు బంటి గుహలో అతడ్ని గుర్తించారు. మట్టిలో కప్పిపెట్టబడి ఉన్న అతన్ని చూసిన వారు! మొదట అతన్ని ఓ మమ్మీగా భావించారు. అతడు బతికి ఉన్నాడని ధ్రువీకరించుకున్న వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం కోలుకున్న అలెగ్జాండర్ తను ఎదుర్కొన్న పరిస్థితుల్ని వైద్యులకు వివరించాడు. -
ఉద్దానంలో భల్లూక భయం
సాక్షి, పలాస (శ్రీకాకుళం): భల్లూకాలు అడవి వదిలి ఊళ్ల మీద పడుతున్నాయి. పలాస నియోజకవర్గంలోని ఉద్దానం ప్రాంతాలుగా పేరుపొందిన పలాస, వజ్రపుకొత్తూరు, మందస మండలాల్లోని జీడి తోటల్లో ఎలుగు బంట్లు స్వైర విహార చేస్తున్నాయి. ఒక్కోసారి రాత్రి పూట వీధుల్లోకి కూడా వచ్చేస్తున్నాయి. దీంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. ఇప్పటికే గత మూడేళ్లలో పదుల సంఖ్యలో రైతులు మృత్యువాత పడ్డారు. రాత్రి పగలు జీడి తోటల్లో పశువులు మందలతో రైతులు స్వేచ్ఛగా తిరుగుతూ తమ పనులను చక్కబెట్టుకునే వారు. అలాంటిది ఇప్పుడు గ్రామ పొలిమేరలు దాటి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీనికి కారణం లేకపోలేదు. గతంలో ఉన్న ఉద్దానం ప్రాం తంలోని పెద్ద కొండ, రట్టికొండ, బాతుపురం కొండలతో పాటు జీడి తోటలు చాలా చిక్కగా దట్టంగా ఉండేవి. సాయంత్రం వేళ తర్వాత ఎలుగు బంట్లు తమ దాహార్తిని తీర్చుకోవడానికి వాటికంటూ ప్రత్యేకంగా ఒక తోవలు ఉండేవి. ఇప్పుడు అవన్నీ తారుమారయ్యాయి. దీనికి తోడు గత ఏడాది అక్టోబరులో వచ్చిన తిత్లీ తుపానుకు జీడి చెట్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి. ఈ పరిస్థితిలో వాటికి అలవాటైన తోవలు కనుమరుగయ్యాయి. ఒక పక్క అవి ఉండటానికి తగిన ఆవాసాలు లేక మరో పక్క దాహార్తిని తీర్చుకోవడానికి దగ్గరలో చెరువులు ఇతర నీటి సదుపాయాలు లేకపోవడంతో.. ఉద్దానం ప్రాంతం నుంచి అటు సముద్రం వైపు ఇటు పల్లపు మైదాన ప్రాంతాల వైపు పరుగులు తీస్తూ ఊళ్లలోకి వస్తున్నాయి. ఇలా వస్తున్న క్రమంలో ఎలుగుబంట్లకు పగలు రాత్రి తేడా తెలీడం లేదు. ఎక్కడ చీకటి పడితే అక్కడ ఉండిపోవడం, ఎక్కడ పొద్దు తూరితే అక్కడ నుంచి బయలు దేరడం ప్రా రంభిస్తున్నాయి. ఈ సమయంలోనే ఎక్కువగా ప్రమాదాలు జరగుతున్నాయి. ♦ సోమవారం ఉదయం ఉద్దానం గ్రామాలైన లోహరబంద, రట్టి, బాహాడపల్లి తదితర గ్రామాల్లో ఎలుగుబంటి హల్ చల్ చేసింది. ఎలాంటి భయం లేకుండా మోటారు బైకులు శబ్దం వినిపిస్తున్నా ఖాతరు చేయకుండా నడుస్తూ వెళ్లి ప్రజలను ఆశ్చర్యం చేసింది. ఇది తాజా ఉదాహరణ మాత్రమే. రెండేళ్ల కిందట పలాస మండలం మామిడిపల్లి గ్రామానికి చెందిన మద్దిల జానకిరావు అనే పశువుల కాపరి తన జీడితోటలో పశువుల మంద వద్దకు వెళ్లి వస్తుండగా పిల్లల ఎలుగుబంటి దాడి చేసింది. అతను తీవ్రగాయాలపాలయ్యాడు. అదృష్టవశాత్తు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ♦ వజ్రపుకొత్తూరు మండలం మెట్టూరు ఒంకులూరుగెడ్డ సమీపంలో కాశీబుగ్గకు చెందిన ఒక బట్టల వ్యాపారి కాలకృత్యాల కోసం రోడ్డు పక్క కూర్చోగా ఎలుగు దాడి చేసింది. ఈ దాడి జరుగుతున్న సందర్భంగా ఆర్టీసి బస్సు కూడా అక్కడకు చేరింది. ఎంత మంది రాళ్లు విసిరి కేకలు వేసినా ఆయన మృత్యువు నుంచి తప్పించుకోలేకపోయాడు. వణుకుతున్న ఉద్దానం వజ్రపుకొత్తూరు రూరల్: ఉద్దాన తీర ప్రాంతంలో ఎలుగులు సంచరించడంతో ఉద్దాన ప్రజలు భయాందోళనతో వణుకుతున్నారు. గత రెండు రోజులుగా ఉద్దాన ప్రాంతంలో డెప్పూరు, అనకపల్లి, సీతానగర్, వంకులూరు, చీపురుపల్లి తదితర గ్రామాల్లో ఎలుగులు సంచరిస్తున్నాయని ప్రజలు వాపోతున్నారు. ఎలుగులు సంచరించడంతో ఏ సమయంలో ఏమవుతుందోనని వారు భయాందోళన చెందుతున్నారు. ముఖ్యంగా రాత్రి సమయంలో వీటి సంచారం ఎక్కువగా ఉంటోం దని, ఆరుబయట అడుగు పెట్టేందుకు భయపడుతున్నామని వారు వాపోతున్నారు. గతంలో ఈ ఎలుగులు చీపురుపల్లి, గుణుపల్లి, అనకపల్లి, గడూరు తదితర గ్రామాల్లో సంచరించి దాడులు చేయడంతో పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. అక్కపల్లి, రాజాం గ్రామాల్లో రాత్రి సమయంలో ఎలుగులు సంచరించి కిరాణ దుకాణం, అంగన్వాడీ కేంద్రంలోకి ప్రవేశించి సరుకులు ధ్వంసం చేశాయి. దీంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఎలుగుల సంచారాన్ని నియంత్రించాలని వారు కోరుతున్నారు. గత ఏడాది ఇదే రోజు ఎలుగు దాడి గత ఏడాది ఎర్రముక్కాం, పితాతొళి, లోహరబంద, లింబుగాం తదితర ప్రాంతాల్లో ఎలుగుబంటి చేసిన దాడిలో ఇద్దరు చనిపోయారు. ఆరుగురు గాయాలపాలయ్యారు. ఆ దాడి జరిగి సరిగ్గా సోమవారానికి ఏడాది అవుతోంది. ఇప్పుడు అదే ప్రాంతంలో ఎలుగుబంట్లు తిరగాడటంతో ప్రజలు భయపడుతున్నారు. బాతుపురం కొండ సమీపంలో కూడా ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ విధంగా ఎలుగుబంట్లు ఉద్దానం ప్రాంతంలో విచ్చల విడిగా తిరుగుతున్నాయి. గతంలో ఇవి సంచరించడానికి రాత్రి పూట ఒక సమ యం అంటూ ఉండేది. రాత్రి పది గంటల తర్వాత తమ ఆవాసాల నుంచి బయటకు వచ్చి ఆహారం, మంచినీటి కోసం వచ్చేవి. ఇప్పుడు వాటికి ఒక సమయం అంటూ లేదని ఉద్దానం ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు వీటిపై దృష్టి సారించి ప్రజలను అప్రమత్తం చేయడంతోపాటు వాటిని సంరక్షించడానికి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
ఎలుగు దాడి : వెలుగులోకి వీడియో
సోంపేట : శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో ఆదివారం(జూన్ 10) ఓ ఎలుగుబంటి బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. భార్యాభర్తలపై దాడి చేసిన ఎలుగు వారిని చంపేసింది. మరో ఎనిమిది మందిని గాయపరిచింది. దీని దాడిలో రెండు ఎడ్లు కూడా తీవ్రంగా గాయపడ్డాయి. చివరకు ప్రజల దాడిలో ప్రాణాలు కోల్పోయింది. సోంపేట మండలం సిరిమామిడి పంచాయతీ ఎర్రముక్కాం గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బైపల్లి ఊర్మిళ(44) ఇల్లు ఊడ్చిన చెత్తను బయట వేయడానికి గ్రామ పొలిమేరల్లో ఉన్న తుఫాను రక్షిత భవనం వద్దకు వెళ్లింది. ఇంతలో ఆమెపై ఎలుగు దాడికి దిగింది. ఆమె కేకలు వేయడంతో భర్త తిరుపతి(48) ఊర్మిళను రక్షించడానికి ప్రయత్నించాడు. దీంతో అతనిపైనా ఎలుగు దాడిచేసింది. వీరిద్దరిని రక్షించడానికి గ్రామానికి చెందిన బైపల్లి దుర్యోధన, బైపల్లి పాపారావు, బైపల్లి రవి, బైపల్లి అప్పలస్వామి, రట్టి అప్పన్న ప్రయత్నించగా వారిని కూడా ఎలుగు గాయపరిచింది. దీంతో స్థానికులు క్షతగాత్రులను పలాస సామాజిక ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఊర్మిళ మరణించింది. బైపల్లి తిరుపతి, అప్పలస్వామి, దుర్యోధనల పరిస్థితి విషమించడంతో వారిని విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తిరుపతి కూడా కన్ను మూశాడు. వీరిపై దాడి చేసిన ఎలుగు సిరిమామిడి గ్రామానికి చెందిన కె. చిట్టయ్యతో పాటు మందస మండలానికి చెందిన బి.గోపాల్, జె.నారాయణ, ఎం.పాపారావులపైనా దాడి చేసింది. ఎర్రముక్కాం గ్రామానికి చెందిన బైపల్లి హేమరాజు కాడెడ్లపై దాడి చేయడంతో ఎద్దులకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో చుట్టు పక్కల గ్రామాల వారు హడలిపోయారు. తలుపులు వేసి ఇళ్లలోనే ఉండిపోయారు. ఆఖరకు మందస మండలం పితాళి గ్రామంలో ఎలుగును స్థానికులు హతమార్చారు. అయితే, ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఎలుగును తరిమేందుకు యత్నించిన ఓ యువకుడిపై అది తిరగబడింది. -
మళ్లీ భల్లూకాల అలజడి
మందస : ఉద్దానం ప్రజలను ఎలుగుబంట్లు భయభ్రాంతులకు గురిచేస్తూనే ఉన్నాయి. మండలంలోని ఎర్రముక్కాం, పాతపితాళిలలో భల్లూకం చేసిన బీభత్సం ఇంకా ప్రజల కళ్ల ముందు కదులుతూనే ఉంది. ఎర్రముక్కానికి చెందిన దంపతులు ఎలుగు దాడిలో దుర్మరణం చెందారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి నేటికీ ఆందోళనకరంగానే ఉంది. దీని నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటుండగానే గురువారం ఎలుగుబంట్లు బీభత్సం సృష్టించాయి. అరగంట వ్యవధిలోనే.. మందస మండలంలోని నల్లబొడ్లూరు గ్రామానికి చెందిన బొడ్డు గంగమ్మ ఉదయం 5.30 గంటలకు తోటల్లోకి వెళ్తుంగా ఒక్కసారిగా భల్లూకం దాడి చేసింది. కుడిచేయిపై కొంత భాగాన్ని కొరికేసింది. గ్రామస్తులు గమనించి, కేకలు వేసి తరమడంతో ఎలుగు పారిపోయింది. వీరు వెంటనే 108కు సమాచారం ఇవ్వడంతో ఈఎంటీ తారకేశ్వరరావు, పైలట్ వెంకటరావు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని చికిత్స చేశారు. అనంతరం గంగమ్మను పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఉదయం 6 గంటల సమయంలో సువర్ణాపురం గ్రామానికి చెందిన సాలీన భీమారావు తోటకు వెళ్తుండగా దారిలో ఎలుగుబంటి దాడి చేయడానికి ప్రయత్నించింది. సమయస్ఫూర్తితో వ్యవహరించి సమీపంలోని చెట్టు ఎక్కారు. ఆ ప్రాంతంలో కొంతసేపు తిరిగిన ఎలుగుబంటి వెళ్లిపోవడంతో ఆయన బతుకు జీవుడా అనుకుంటూ ఇంటికి చేరుకున్నారు. కేసుపురం సమీపంలోని జీడి, మామిడి తోటల్లో ఎలుగులు కనిపించడంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. తోటల్లోకి వెళ్లడానికి సాహసించలేకపోయారు. వరుస ఎలుగుబంట్లు దాడులతో ఉద్దాన ప్రాంత వాసులు హడలెత్తిపోతున్నారు. ప్రాణభయంతో రాత్రి వేళల్లో ఇంటి నుంచి రావడానికి భయపడుతున్నారు. ప్రాణనష్టంతో పాటు పెంచుకుంటున్న పశువులు, జంతువులను కూడా చంపివేస్తుండడంతో ఉద్దానవాసులు ఉలిక్కి పడుతున్నారు. దేవుడే రక్షించాడు: సాలీన భీమారావు ఎప్పుడూ లేనిది ఉదయాన్నే తోటకు వెళ్లాను. దారిలో ఓ ఎలుగుబంటి కనిపించింది. దాడి చేయడానికి ప్రయత్నించగా, దగ్గర్లో ఉన్న చెట్టు అప్రయత్నంగా ఎక్కేశాను. ఈ సమయంలోనే మరో ఎలుగుబంటి కూడా వచ్చింది. ప్రాణాలు అరచేత పట్టుకుని బిక్కుబిక్కుమంటూ చెట్టుపైనే ఉన్నాను. కొద్దిసేపు ఎలుగులు కదల్లేదు. ఈలోగా గ్రామస్తులు వచ్చి తరమడంతో వెళ్లిపోయాయి. ఎలుగుల నుంచి దేవుడే కాపాడాడు. -
ఎలుగుబంటి దాడిలో రైతుకు గాయాలు
కళ్యాణదుర్గం రూరల్ : మండలంలోని గోళ్ల గ్రామంలో ఎలుగుబంటి దాడిలో కుంట్లో శ్రీనివాసులు అనే రైతు గాయపడ్డారు. తన పొలంలో వేరుశనగ పంట సాగు చేయగా, శుక్రవారం రాత్రి కాపలాగా వెళ్లిన ఆయన శనివారం ఉదయమే ఇంటికి తిరిగొస్తుండగా ఎలుగుబండి దాడి చేసి గాయపరిచింది. -
ఎలుగుబంటి దాడి: నలుగురికి గాయాలు
కొత్తపల్లి: ఎలుగుబంటి దాడిలో నలుగురికి గాయాలైన సంఘటన కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలం సింగరాజుపల్లి గ్రామంలో శుక్రవారం వెలుగుచూసింది. గ్రామ శివారులోని అడవుల్లో నుంచి ఇళ్లలోకి వచ్చిన ఎలుగు బంటి అడ్డొచ్చినవారిపై దాడికి పాల్పడింది. ఈ ఘటనలో నలుగురికి గాయాలు కావడంతో.. వారిని ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఓ ఇంట్లో దూరిన ఎలుగుబంటిని స్థానికులు నిర్బంధించి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. క్షతగాత్రుల్లో ఓ మహిళ కూడా ఉంది. -
ఎలుగుబంటి దాడి: రైతుకు గాయాలు
కరీంనగర్: కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట మండలం అంకుషాపూర్‌లో ఎలుగుబంటి హల్ చల్ చేసింది. పంటకు నీళ్లు పెట్టడానికి వెళ్లిన రైతుపై ఎలుగుబంటి దాడి చేసింది. గ్రామానికి చెందిన మల్లారెడ్డి గురువారం ఉదయం మొక్కజొన్న పంటకు నీరు పెట్టడానికి వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. ఆ సమయంలో చేనులో నక్కిఉన్న ఎలుగుబంటి మల్లారెడ్డిపై దాడికి దిగింది. ఎలుగుబంటి దాడిలో గాయాపడిన మల్లారెడ్డి దాని నుంచి తప్పించుకొని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్ప పొందుతున్నాడు. గ్రామ శివారులో ఎలుగు తిరుగుతుండటంతో గ్రామస్థులు భయందోళనకు గురవుతున్నారు. -
ఎలుగుబంటి దాడిలో రైతు మృతి
అచ్చంపేట: ఎలుగుబంటి దాడిలో ఓ రైతు మృతిచెందిన ఘటన మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట మండలం గుంపన్‌పల్లిలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బోడ్యానాయక్(50) తన పొలం వద్దకు తెల్లవారుజామున వెళ్లాడు. కంచెలో ఎలుగుబంటి చిక్కుకుంది. దానిని అడవి పంది అనుకొని వెళ్లగొట్టేందుకు దగ్గరికి వెళ్లగా.. ఒక్కసారిగా అతనిపై దాడి చేసింది. దీంతో బోడ్యా నాయక్ అక్కడికక్కడే మృతి చెందాడు. కంచె ఉచ్చులో ఇరుక్కుపోయిన ఎలుగుబంటి బోడ్యా శరీర భాగాలను చీల్చి వేసింది. దీంతో ఎలుగుబంటిని బయటికి తీయడానికి హైదరాబాద్ జూ పార్కుకు సమాచారం ఇచ్చారు. ఎలుగుబంటికి బాణంతో మత్తు ఇంజక్షన్లు ఇచ్చి.. అది మత్తులోకి జారుకున్న తర్వాత బోనులోకి ఎక్కించి జూ పార్కుకు తరలించారు. -
మహిళపై ఎలుగుబంటి దాడి
కరీంనగర్ : వ్యవసాయ భూమి వద్ద పని చేసుకుంటున్న మహిళపై ఎలుగుబంటి దాడి చేసిన ఘటన కరీంనగర్ జిల్లాలో శనివారం చోటుచేసుకుంది. మానకొండూరు మండలం బంజరుపల్లిలో గ్రామానికి చెందిన మహిళ వరిచేనులో పని చేసుకుంటుండగా.. ఎలుగుబంటు దాడిచేసింది. దీంతో అప్రమత్తమైన మహిళ ఎలుగుబంటి నుంచి తప్పించుకుని ఫారెస్ట్ అధికారులకు ఫిర్యాదు చేసింది. అధికారులు పట్టించుకోకపోవడంతో.. గ్రామస్థులు భయాందోళనలో ఉన్నారు. -
ఎలుగుబంటి దాడి : వ్యక్తికి తీవ్రగాయాలు
అడవిలో కలప సేకరిస్తున్న వ్యక్తిపై ఎలుగుబంటి దాడి చేసి గాయపరిచిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలు... ఆదిలాబాద్ జిల్లా తిర్యాణి మండలం రొంపల్లి గ్రామ పంచాయతీ అర్జునలొద్ది గ్రామానికి చెందిన ఆత్రం కొండు మంగళవారం సాయంత్రం సమీపంలోని అడవిలో వెదురు నరుకుతుండగా ఎలుగుబంటి దాడి చేసింది. దీంతో అతడి తొడపై తీవ్ర గాయమైంది. స్థానికంగా వైద్య సౌకర్యం అందుబాటులో లేకపోవటంతో కుటుంబ సభ్యులు బుధవారం ఉదయం తిర్యాణి పీహెచ్‌సీకి తీసుకువచ్చారు. అయితే, తొడ కండరాన్ని ఎలుగుబంటి పూర్తిగా కొరికేయటంతో మెరుగైన వైద్యం కోసం మంచిర్యాలకు తరలించనున్నారు. -
సెవన్‌హిల్స్‌లో అరుదైన మైక్రో ప్లాస్టిక్ సర్జరీ
విశాఖపట్నం-మెడికల్: ఎలుగు బంటిల దాడిలో తల, ముఖ భాగాలపై తీవ్రంగా గాయాలైన ఓ వ్యక్తికి మైక్రో ప్లాస్టిక్ సర్జరీ విధానంలో ద్వారా అవయవాలను పునర్నిర్మించారు. ఈ అరుదైన శస్త్రచికిత్స విశాఖలోని సెవన్‌హిల్స్ ఆస్పత్రి ప్లాస్టిక్ సర్జరీ వైద్యురాలు డాక్టర్ అంజలీ సాప్లై, న్యూరోసర్జరీ చీఫ్ డాక్టర్ పి.వి.రమణలు విజయవంతంగా నిర్వహించారు. ఈ వివరాలను ఆస్పత్రిలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. ఒడిశాలోని గంజామ్ జిల్లాకు చెందిన నర్సింహులు (48) ఆగస్టు 24న జీడితోటలో పని చేస్తుండగా హఠాత్తుగా మూడు ఎలుగులు బంట్లు దాడిచేశాయి. ఈ దాడి లో అతడి ముఖం భాగాల్లో చర్మం పూర్తిగా లాగేయడంతో పాటు పుర్రె, బుగ్గ ఎముకలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఒడిశాలోని బరంపురంలో ప్రాథమిక చికిత్స అనంతరం అదే రోజు తమ ఆస్పత్రికి తీసుకువచ్చారన్నారు. పుర్రె ఎముక తొలగడంతో మెదడకు ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉందని ఎంఆర్ఐ స్కాన్ ద్వారా గుర్తించామన్నారు. దాన్ని నివారించేందుకు వెంటనే 10 గంటల పాటు శ్రమించి మైక్రోప్లాస్టిక్ సర్జరీ నిర్వహించినట్టు తెలిపారు. వీపు భాగంలోని చర్మాన్ని మాడు భాగంలో స్కిన్ గ్రాఫ్ట్ చేశారు. కొద్ది రోజులు ఐసీయూలో చికిత్స అనంతరం ముఖ భాగంలో దెబ్బతిన్న బుగ్గ, ముక్కు ఎముకలను బోన్ గ్రాఫ్టింగ్ ద్వారా సరిచేసి పునర్నిర్మించారు. ప్రస్తుతం రోగి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, రెండు రోజుల్లో డిశ్చార్జి చేయనున్నట్టు ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ దినకర్ తెలిపారు. -
ఎలుగుబంటితో తలపడిన పెంపుడు కుక్క
టోక్యో: ఎలుగుబంటి దాడి నుంచి ఆరేళ్ల బాలుడిని కాపాడిన ఓ పెంపుడు కుక్క ఉత్తర జపాన్ లో పతాక శీర్షికలకు ఎక్కింది. పోలీసులు, మీడియా దాన్ని హీరోగా కీర్తించాయి. షిబా ఇను అనే ఆరేళ్ల బాలుడు తన 80 ఏళ్ల ముత్తాతతో కలిసి శనివారం సాయంత్రం ఒడేట్ లో నది ఒడ్డుకు వాకింగ్ కు వెళ్లాడు. ఇదే సమయంలో మూడగులు ఎత్తున్న అడవి ఎలుగుబంటి ఒక్కసారిగా షిబాపై దాడి చేసింది. షిబా ముత్తాత భయంతో కారు దగ్గరకు పరుగులు తీశాడు. అయితే అక్కడే వున్న ఆయన పెంపుడు కుక్క గట్టిగా మొరుగుతూ, ఎలుగుబంటి వెంటపడింది. దీంతో ఎలుగుబంటి తోక ముడించింది. ఈ ఘటనలో షిబాకు స్వల్ప గాయాలయ్యాయని, చికిత్స అనంతరం అతడికి ఇంటికి పంపించినట్టు పోలీసులు తెలిపారు. సాహసం చేసిన కుక్క పేరు మెగో(క్యూట్) అని వెల్లడయింది. ఎప్పుడూ మౌనంగా, భయంగా ఉండే మెగో ఎలుగుబంటిని తరిమికొట్టడం పట్ల షిబా ముత్తాత అమితాశ్చర్యం వ్యక్తం చేశాడు. -
కరీంనగర్లో ఎలుగుబంటు దాడి
-
ఎలుగు దాడి నుంచి ఇద్దరిని కాపాడి.. చనిపోయిన కుక్కపిల్ల
అదో చిన్న కుక్కపిల్ల. డాషండ్ జాతికి చెందినది. బరువు గట్టిగా చూస్తే రెండు కేజీలు కూడా ఉండదు. దాని పేరు బ్రాడ్లీ. విశ్వాసానికి మారుపేరు. అందుకే.. యజమానిని కాపాడేందుకు ఏకంగా 181 కేజీల బరువున్న నల్లటి ఎలుగుబంటితో పోరాడి.. వాళ్లను రక్షించి తాను మాత్రం ప్రాణాలు కోల్పోయింది!! అమెరికాలోని మిషిగన్ రాష్ట్రంలో గల ఓస్కాడా కౌంటీలో ఈ సంఘటన జరిగింది. బ్రాడ్లీ అక్కడుండి ఎలుగుబంటితో పోరాడి ఉండకపోతే మాత్రం అది తప్పకుండా తమవాళ్లను చంపేసి ఉండేదని బ్రాడ్లీ యజమాని జాన్ ఫోర్స్ చెప్పారు. జాన్ ఫోర్స్ ఇంటికి గత వారం ఇద్దరు వ్యక్తులు వచ్చారు. వాళ్లు అక్కడకు సమీపంలో ఉన్న అడవిలోకి వెళ్లారు. తమతో పాటు బ్రాడ్లీని కూడా తీసుకెళ్లారు. తీరా అక్కడ ఉన్నట్టుండి ఓ పెద్ద నల్లటి ఎలుగుబంటి వాళ్ల ముందుకు వచ్చింది. దాంతో ఇక తమపని అయిపోయిందనే అనుకున్నారు. కానీ కుక్కపిల్ల మాత్రం ఒక్కసారిగా ఎలుగుబంటి మీదకు దూకి.. దాంతో అరివీర భయంకరంగా పోరాడింది. అలా ఓ గంట పోరాడిన తర్వాత అది ప్రాణాలు కోల్పోయింది. కానీ ఎట్టకేలకు ఎలుగుబంటి కూడా వెనుదిరిగింది. -
విశాఖలో ఎలుగుబంటు దాడి; ఇద్దరు మృతి
విశాఖ జిల్లాలో ఎలుగుబంటు దాడి చేసిన సంఘటనలో ఇద్దరు మరణించగా, మరో ముగ్గురు గాయపడ్డారు. జిల్లా గిరిజన ప్రాంతమైన దంబ్రిగూడ మండలంలో శుక్రవారం ఈ సంఘటన జరిగినట్టు అటవీ శాఖ అధికారులు తెలిపారు. చనిపోయినవారిని జి.బలరామ్ (49), కొర్రా సిబ్బో (51)గా గుర్తించారు. మృతులు గాటివలస గ్రామస్తులు. తీవ్రంగా గాయపడ్డ దామోదర్‌కు మొదట స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స చేసి అనంతరం మెరుగైన చికిత్స కోసం విశాఖ కింగ్‌జార్జ్ ఆస్పత్రికి తరలించారు. బలరామ్, సిబ్బో, దామోదర్‌తో పాటు మరికొందరు గిరిజనులు సంతకు అరకు వెళ్తుండగా ఎలుగుబంటి వారిపై దాడిచేసినట్టు బాధితులు తెలిపారు. మొదట బలరామ్‌పై దాడి చేయడంతో అక్కడికక్కడే చనిపోయాడు. అతణ్ని రక్షించేందుకు వెళ్లిన సిబ్బోను తీవ్రంగా గాయపరిచింది. సిబ్బో కూడా సంఘటన స్థలంలోనే మరణించగా, దామోదర్ తీవ్రంగా గాయపడగా, మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి.