వ్యవసాయ భూమి వద్ద పని చేసుకుంటున్న మహిళపై ఎలుగుబంటి దాడి చేసిన ఘటన కరీంనగర్ జిల్లాలో శనివారం చోటుచేసుకుంది.
కరీంనగర్ : వ్యవసాయ భూమి వద్ద పని చేసుకుంటున్న మహిళపై ఎలుగుబంటి దాడి చేసిన ఘటన కరీంనగర్ జిల్లాలో శనివారం చోటుచేసుకుంది. మానకొండూరు మండలం బంజరుపల్లిలో గ్రామానికి చెందిన మహిళ వరిచేనులో పని చేసుకుంటుండగా.. ఎలుగుబంటు దాడిచేసింది. దీంతో అప్రమత్తమైన మహిళ ఎలుగుబంటి నుంచి తప్పించుకుని ఫారెస్ట్ అధికారులకు ఫిర్యాదు చేసింది. అధికారులు పట్టించుకోకపోవడంతో.. గ్రామస్థులు భయాందోళనలో ఉన్నారు.