ఎలుగుబంటి దాడిలో నలుగురికి గాయాలైన సంఘటన కర్నూలు జిల్లాలో వెలుగుచూసింది.
ఎలుగుబంటి దాడి: నలుగురికి గాయాలు
Published Fri, Apr 21 2017 11:34 AM | Last Updated on Tue, Sep 5 2017 9:20 AM
కొత్తపల్లి: ఎలుగుబంటి దాడిలో నలుగురికి గాయాలైన సంఘటన కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలం సింగరాజుపల్లి గ్రామంలో శుక్రవారం వెలుగుచూసింది. గ్రామ శివారులోని అడవుల్లో నుంచి ఇళ్లలోకి వచ్చిన ఎలుగు బంటి అడ్డొచ్చినవారిపై దాడికి పాల్పడింది. ఈ ఘటనలో నలుగురికి గాయాలు కావడంతో.. వారిని ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఓ ఇంట్లో దూరిన ఎలుగుబంటిని స్థానికులు నిర్బంధించి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. క్షతగాత్రుల్లో ఓ మహిళ కూడా ఉంది.
Advertisement
Advertisement