![Canadian woman watches a bear in her car drinking her sodas - Sakshi](/styles/webp/s3/article_images/2023/04/24/dear.jpg.webp?itok=_uXnKuOw)
ఒట్టావా: కెనడాలో ఒక మహిళకి వింత అనుభవం ఎదురైంది. ఇంట్లో అవసరాల కోసం తెచ్చుకున్న సోడా క్యాన్లను ఒక ఎలుగు ఊది పారేసింది. షరోన్ రోజెల్ అనే మహిళ తెల్లవారుజామున కుక్క మొరగడంతో లేచి చూసింది.
అప్పటికే తన కారు అద్దాలు బద్దలు కొట్టిన ఎలుగుబంటి అందులో ఉంచిన 72 సోడాల క్యాన్లలో ఏకంగా 69 తాగేసింది. బాల్కనీ నుంచి ఇదంతా చూసి రోజెల్ వాటి ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఒక ఎలుగు బంటి ఆ స్థాయిలో సోడాలు తాగడం అత్యంత అరుదు అని కొందరు వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment