
సాక్షి, శ్రీకాకుళం: జిల్లాలో శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ ఎలుగుబంటి ఇద్దరి ప్రాణాలను తీసేసింది. మరొకరు గాయపర్చింది. వివరాలు.. వజ్రపుకొత్తూరు మండలం అనకాపల్లిలో ఓ ఎలుగుబంటి బీభత్సం సృష్టించింది. జీడితోటలో పనిచేస్తున్న ముగ్గురు కార్మికులపై ఒక్కసారిగా దాడి చేసింది. జీడితోటలో పనిచేస్తున్న కార్మికులపై ఎలుగుబంటి దాడి చేసింది.
ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందగా.. మరో మహిళకు గాయాలయ్యాయి. మృతులను అప్పికొండ కూర్మారావు(45), లోకనాథం(46)గా గుర్తించారు. గాయపడిన మహిళలు స్థానికులు ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎలుగుబంటిని బంధించేందుకు చర్యలు ప్రారంభించారు.
ఇద్దరి ప్రాణాలు పోవడం, ఓ మహిళ గాయాలతో ఆసుపత్రి పాలవ్వడంతో అనకాపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇదిలా ఉండగా ఎలుగు బంటి దాడి గురించి తెలుసుకున్న గ్రామస్తులు భయబ్రాంతులకు గురవుతున్నారు. ఎలుగుబంట్లు గ్రామాల్లోకి ప్రవేశించి మనుషుల ప్రాణాలు తోడేస్తున్న పట్టించుకోవడం లేదని అటవీశాఖ అధికారులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment