అడవిలో కలప సేకరిస్తున్న వ్యక్తిపై ఎలుగుబంటి దాడి చేసి గాయపరిచిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
అడవిలో కలప సేకరిస్తున్న వ్యక్తిపై ఎలుగుబంటి దాడి చేసి గాయపరిచిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలు... ఆదిలాబాద్ జిల్లా తిర్యాణి మండలం రొంపల్లి గ్రామ పంచాయతీ అర్జునలొద్ది గ్రామానికి చెందిన ఆత్రం కొండు మంగళవారం సాయంత్రం సమీపంలోని అడవిలో వెదురు నరుకుతుండగా ఎలుగుబంటి దాడి చేసింది. దీంతో అతడి తొడపై తీవ్ర గాయమైంది.
స్థానికంగా వైద్య సౌకర్యం అందుబాటులో లేకపోవటంతో కుటుంబ సభ్యులు బుధవారం ఉదయం తిర్యాణి పీహెచ్‌సీకి తీసుకువచ్చారు. అయితే, తొడ కండరాన్ని ఎలుగుబంటి పూర్తిగా కొరికేయటంతో మెరుగైన వైద్యం కోసం మంచిర్యాలకు తరలించనున్నారు.