Watch: Bear Attacking On Three People In Tamil Nadu Forest, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Bear Attack Video: రెచ్చిపోయిన ఎలుగుబంటి.. బైక్‌పై వెళ్తున్న వారిపై దాడిచేసి..

Published Mon, Nov 7 2022 11:09 AM | Last Updated on Mon, Nov 7 2022 1:19 PM

Bear Attacking Three People In Tamil Nadu Video Viral - Sakshi

అడవి ఎలుగుబంటి ఆవేశంలో రెచ్చిపోయింది. రోడ్డు మీద బైక్‌పై వెళ్తున్న వారిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. ఎలుగుబంటి దాడిలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. ఈ దారుణ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

వివరాల ప్రకారం.. తమిళనాడులోని తెన్‌కాశిలో ఎలుగుబంటి హల్‌చల్‌ చేసింది. కరుతిలింగపురం గ్రామానికి చెందిన వైకుంఠమణి అనే వ్యక్తి శివసైలం నుంచి పెతన్‌పిళ్లై గ్రామానికి మసాలా దినుసులు తీసుకుని తన బైక్‌ మీద వెళ్తున్నాడు. బైక్‌పై వెళ్తున్నాడు. ఈ క్రమంలో మర్గమధ్యంలో ఉన్న అటవీ ప్రాతాన్ని దాటుతుండగా పొదల్లో నక్కిఉన్న ఎలుగుబండి ఒక్కసారిగా అతనిపై దాడిచేసింది. ఎలుగుబంటి దాడిలో బైక్‌ మీద నుంచి పడిపోయిన వైకుంఠమణిని తీవ్రంగా గాయపరిచింది. వైకుంఠమణిపై కూర్చున్న ఎలుగుబంటి అతడి తనకు కొరుకుతూ, గోళ్లలో రక్కుతూ దాడి చేసింది.

ఇది గమనించిన స్థానికులు ఎలుగుబంటిపై రాళ్లు విసరడంతో వాళ్లు మీదకు దూసుకెళ్లి వారిని సైతం గాయపరిచింది. దీంతో మరో ఇద్దరు గాయపడ్డారు. అటుగా వస్తున్న మరికొంత మంది ఎలుగుబండిని బెదరించడంతో ఎలుగు.. అక్కడి నుంచి పారిపోయింది. స్థానికులు అనంతరం.. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. దాడి సమాచారం అందుకున్న వెంటనే అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకుని ఎలుగుబంటి కోసం గాలిస్తున్నారు. కాగా, ఎలుగుబంటి దాడికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement