injured peoples
-
రెచ్చిపోయిన ఎలుగుబంటి.. బైక్‌పై వెళ్తున్న వారిపై దాడిచేసి..
అడవి ఎలుగుబంటి ఆవేశంలో రెచ్చిపోయింది. రోడ్డు మీద బైక్‌పై వెళ్తున్న వారిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. ఎలుగుబంటి దాడిలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. ఈ దారుణ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివరాల ప్రకారం.. తమిళనాడులోని తెన్‌కాశిలో ఎలుగుబంటి హల్చల్ చేసింది. కరుతిలింగపురం గ్రామానికి చెందిన వైకుంఠమణి అనే వ్యక్తి శివసైలం నుంచి పెతన్‌పిళ్లై గ్రామానికి మసాలా దినుసులు తీసుకుని తన బైక్ మీద వెళ్తున్నాడు. బైక్‌పై వెళ్తున్నాడు. ఈ క్రమంలో మర్గమధ్యంలో ఉన్న అటవీ ప్రాతాన్ని దాటుతుండగా పొదల్లో నక్కిఉన్న ఎలుగుబండి ఒక్కసారిగా అతనిపై దాడిచేసింది. ఎలుగుబంటి దాడిలో బైక్ మీద నుంచి పడిపోయిన వైకుంఠమణిని తీవ్రంగా గాయపరిచింది. వైకుంఠమణిపై కూర్చున్న ఎలుగుబంటి అతడి తనకు కొరుకుతూ, గోళ్లలో రక్కుతూ దాడి చేసింది. ఇది గమనించిన స్థానికులు ఎలుగుబంటిపై రాళ్లు విసరడంతో వాళ్లు మీదకు దూసుకెళ్లి వారిని సైతం గాయపరిచింది. దీంతో మరో ఇద్దరు గాయపడ్డారు. అటుగా వస్తున్న మరికొంత మంది ఎలుగుబండిని బెదరించడంతో ఎలుగు.. అక్కడి నుంచి పారిపోయింది. స్థానికులు అనంతరం.. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. దాడి సమాచారం అందుకున్న వెంటనే అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకుని ఎలుగుబంటి కోసం గాలిస్తున్నారు. కాగా, ఎలుగుబంటి దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. தென்காசியில் பைக்கை வழிமறித்து 3 பேரை கடித்துக் குதறிய கரடி!!#tenkasi #bear #ATTACK pic.twitter.com/JD0kWjzMSs — A1 (@Rukmang30340218) November 6, 2022 -
స్థల వివాదంలో కత్తితో దాడి
తుమకూరు: తుమకూరు జిల్లాలోని మధుగిరి తాలూకాలోని మిడిగేశి గ్రామంలో ఒక ఆలయ స్థల వివాదం రక్తసిక్తంగా మారింది. దాడుల్లో ఒక వర్గానికి చెందిన ఇద్దరు హత్యకు గురయ్యారు. ఈ ఘోరం గురువారం రాత్రి జరిగింది. కత్తితో విచక్షణారహితంగా దాడి గ్రామంలో దేవాలయానికి చెందిన ఒక ఎకరా పొలంపై వివాదం నడుస్తోంది. ఈ పొలం పక్కనే ఉన్న భూమి కూడా తనదేనని శ్రీధర్ గుప్త గొడవచేసేవాడు. ఇది కోర్టులో ఉండగా రెండు వర్గాలకు చెందినవారు తరచూ గొడవపడేవారు. రాత్రి కూడా ఇలాగే ఘర్షణ జరిగింది. శ్రీధర్ గుప్త కత్తితో విచ్చలవిడిగా దాడి చేయడంతో రామాంజనయ్య (48), శిల్ప (38) అనే ఇద్దరు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన మల్లికార్జున అనే వ్యక్తికి తీవ్రంగా గాయపడి మధుగిరిలో చికిత్స చేయించి తుమకూరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. శ్రీధర్ గుప్త, అతని సంబం«దీకులు తమపై దాడి చేశారని మృతుల కుటుంబీకులు తెలిపారు. ఎస్పీ పరిశీలన విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ రాహుల్ కుమార్ శహాపూర్వాడ్ గ్రామానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను మధుగిరి ఆస్పత్రికి తరలించారు. మిడిగేశి పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా నిందితుడు శ్రీధర్ గుప్త పరారీలో ఉన్నాడు. (చదవండి: 18 నెలలుగా ఇంట్లోనే మృతదేహం.. గంగాజలం జల్లుతూ..!) -
ఆటో బోల్తా... ఏడుగురికి గాయాలు
భోగాపురం రూరల్: మండలంలోని సవరవిల్లి సమీపంలో జాతీయ రహదారిపై పాసింజర్ ఆటో గురువారం మధ్యాహ్నం అదుపుతప్పి రక్షణ కోసం ఏర్పాటుచేసిన ఇనుప రెయిలింగ్‌ను ఢీకొని బోల్తా పడింది. శ్రీకాకుళంలో పండగ నిమిత్తం వెళ్లిన ఒక కుటుంబం తిరిగి విశాఖపట్నం వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఆటో డ్రైవర్‌తో పాటు, ఆరుగురు వ్యక్తులు గాయాలపాలయ్యారు. ఒక మహిళ తలకు బలమైన గాయం తగిలి తీవ్ర రక్తస్రావమైంది. జాతీయ రహదారిపై రాకపోకలు చేసేవారు తమ వాహనాలను ఆపి గాయాలపాలైన వారికి సహాయక చర్యలు చేపట్టారు. కారు ఢీకొని వ్యక్తికి.. పార్వతీపురంటౌన్: జియ్యమ్మవలస మండలం నీచుకువలస గ్రామానికి చెందిన ముదిలి గోవిందనాయుడు మోటార్‌సైకిల్‌పై ఖడ్గవలస వస్తుండగా పిట్టలమెట్ట బస్టాప్ వద్ద వెనుకనుంచి వస్తున్న కారు ఢీకొట్టడంతో తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు 108 వాహనంలో క్షతగాత్రుడిని పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఔట్‌పోస్టు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ఆటో బోల్తా పడి మరో నలుగురికి.. పార్వతీపురంటౌన్: గుమ్మలక్ష్మీపురం మండలం మంగళాపురం గ్రామానికి చెందిన ఆరిక రఘురాములు, మండంగి కుమారి, కడ్రక లత్తులు ఆటో బోల్తా పడిన ప్రమాదంలో గాయపడ్డారు. బుధవారం సాయంత్రం వారంతా మదురువలస గ్రామంలో పెళ్లి ఫంక్షన్‌కు ఆటోలో వెళ్లి తిరిగి వస్తుండగా జి. శివడ గ్రామం దాటిన తరువాత మలుపువద్ద ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. గమనించిన స్థానికులు 108 వాహనం ద్వారా పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి వారిని తరలించారు. ఈ ఘటనపై ఔట్‌పోస్టు పోలీసులు కేసు నమోదు చేశారు. (చదవండి: బె‘ధర’గొడుతున్న చికెన్.. వేసవి కాలం కావడంతో.. భారీగా పెరిగిన రేట్లు!) -
‘పిచ్చి అల్లర్లను వెంటనే ఆపేయాలి’
-
రాజస్తాన్‌లో ఘోర విషాదం
-
రాజస్తాన్‌లో కూలిన పందిరి
బెర్మర్/జైపూర్: రాజస్తాన్‌లోని బెర్మర్ జిల్లాలో ఘోరప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఆలయం సమీపంలోని పాఠశాల మైదానంలో ఏర్పాటుచేసిన పందిరి ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో 14 మంది ప్రాణాలు కోల్పోగా, 50 మందికి పైగా భక్తులకు గాయాలయ్యాయి. జసోల్ ప్రాంతంలో ఉన్న రాణి భతియానీ ఆలయం వద్ద వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా భారీ పందిరిని ఏర్పాటుచేసిన నిర్వాహకులు ‘రామకథ’ నాటకాన్ని ప్రదర్శించారు. దీంతో వేడుకకు హాజరైన వందలాది మంది ప్రజలు అక్కడే కూర్చుని రామకథను చూస్తుండగా బలమైన గాలులకు పందిరి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ విషయమై ఏఎస్పీ రతన్‌లాల్ భార్గవ మాట్లాడుతూ.. ‘రామ కథ ప్రదర్శన జరుగుతుండగా ఒక్కసారిగా బలమైన గాలులు వీచాయి. దీంతో పందిరి ఓవైపు నుంచి కూలిపోవడం ఆరంభమైంది. ఈ నాటకానికి నేతృత్వం వహిస్తున్న మురళీధర్ మహరాజ్ దీన్ని గమనించి భక్తులను అప్రమత్తం చేశారు. దీంతో అక్కడినుంచి బయటపడేందుకు అందరూ ఒకేసారి ప్రయత్నించడంతో తొక్కిసలాటలాంటి పరిస్థితి నెలకొంది. చూస్తుండగానే ఈ పందిరి భక్తులపై కుప్పకూలిపోయింది’ అని తెలిపారు. ఇనుపరాడ్లు–టెంట్ల కింద చిక్కుకున్న ప్రజలను కాపాడేందుకు ప్రయత్నించిన తమకు విద్యుత్ షాక్ తగిలిందని ప్రత్యక్షసాక్షులు చెప్పారన్నారు. ఈ ప్రమాదంలో గాయపడ్డవారిని జిల్లాలోని వేర్వేరు ఆసుపత్రులకు తరలించామని చెప్పారు. 14 మంది చనిపోవడానికి గల కారణం పోస్ట్‌మార్టం తర్వాతే తెలుస్తుందని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ దిగ్భ్రాంతి ఈ దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘రాజస్తాన్‌లోని బర్మర్లో పందిరి కూలిపోవడం నిజంగా దురదృష్టకరం. తమ కుటుంబ సభ్యులను కోల్పోయినవారికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. అలాగే ఈ ప్రమాదంలో గాయపడ్డవారు వీలైనంత త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నా’ అని ప్రధాని ట్వీట్ చేశారు. మరోవైపు రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ఈ ప్రమాద విషయమై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ దుర్ఘటనలో చనిపోయినవారికి రూ.5 లక్షలు, గాయపడ్డవారికి రూ.2 లక్షల వరకూ నష్టపరిహారం అందజేస్తామని సీఎం తెలిపారు. ఈ ప్రమాదంపై జోధ్‌పూర్ డివిజినల్ కమిషనర్ బీఎల్ కోఠారి నేతృత్వంలో విచారణకు ఆదేశించామని చెప్పారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని యంత్రాంగాన్ని ఆదేశించారు.అనంతరం ఈ దుర్ఘటనపై విచారణ జరపాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ ప్రమాదంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. -
సిమెంట్ ట్యాంకర్‌ను ఢీకొన్న బస్సు
-
ట్రావెల్ బస్సు బోల్తా.. 10మంది పరిస్థితి విషమం
సాక్షి, విశాఖపట్నం: జిల్లాలోని ఎన్ఏడీ జంక్షన్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రావెల్స్ బస్సు విజయవాడ నుంచి విశాఖకు 50మంది ప్రయానికులతో బయలుదేరింది. వెంకటరమణ ట్రావెల్ బస్సును వేగంగా వచ్చిన టిప్పర్ ఢీ కొట్టింది. దీంతో ఆ బస్సు కూడలిలో బస్సు బోల్తా పడింది. బస్సులోని కొంతమంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. 10మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్ అక్కడి నుంచి జారుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన జరిగిన ప్రదేశానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సులోని ప్రయాణికులను బయటకు తీసి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. రోడ్డుపై బస్సును తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. -
ఆ చొరవే ఊపిరి పోసింది
క్షతగాత్రులను ఆస్పత్రిలో చేర్చిన ఎమ్మెల్యే రాజా జీజీహెచ్‌లో కోలుకుంటున్న బాధితులు తుని రూరల్ : ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మృత్యువుతో పోరాడుతున్న క్షతగాత్రులను ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా హుటాహుటిన ఏరియా ఆస్పత్రికి తరలించి ప్రాణాలను నిలబెట్టారు. ఫో¯ŒS చేశాం అంబులెన్సు వస్తుందని కొంతమంది, ప్రత్యామ్నాయ వాహనంలో తరలిస్తే తమకు ఏ కేసులు చుట్టుకుంటాయోనని మరికొందరు ఎదురు చూస్తుండగా అటుగా వచ్చిన ఎమ్మెల్యే చొరవ తీసుకోవడం ఎంతో మందిని కదిలించింది. గురువారం సాయంత్రం తుని మండలం మరువాడవద్ద జరిగిన ఆటో, మోటార్ సైకిల్ ఢీకొన్న సంఘటనలో ఇదే మండలం బుచ్చి సీతయ్యపేటకు చెందిన దంపతులు కె.సింహాచలం (పెదబాబులు), సీతారత్నం తీవ్రంగా గాయపడ్డారు. ఒక దశలో సింహాచలం మృతి చెందాడని భావించిన స్థానికులు అతన్ని పట్టించుకోలేదు. సీతారత్నాన్ని ఆస్పత్రికి తరలించేందుకు 108 అంబులెన్సు కోసం ఎదురు చూస్తుండిపోయారు. కేఓ మల్లవరంలో జరిగిన వివాహ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తున్న ఎమ్మెల్యే రోడ్డుపై పడిఉన్న దంపతులను చూసి వారిని ఎవరూ పట్టించుకోకపోవడంతో చలించిపోయారు. వెంటనే తన వాహనాన్ని పక్కన నిలిపి ఆటోగా పోతున్న ఆటోలో క్షతగాత్రులను ఎక్కించి తుని ఏరియా ఆస్పత్రికి తరలించారు. వెనుక తన వాహనంలో ఆస్పత్రికి వెళ్లి వైద్యులతో చర్చించి సత్వర వైద్యం అందించారు. సింహాచలానికి కాలు, సీతారత్నానికి వెన్నుముక తీవ్రంగా దెబ్బతిన్నాయి. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం కాకినాడ ఆస్పత్రిలో సింహాచలం, సీతారత్నం వైద్యసేవలు పొందుతూ కోలుకుంటున్నారు. సకాలంలో ఎమ్మెల్యే రాజా స్పందించి ఆస్పత్రికి తరలించడం వల్ల ప్రాణాపాయం నుంచి బయటపడ్డామని క్షతగాత్రులు పేర్కొన్నారు. ఎమ్మెల్యే సేవాహృదయంతో తమ పిల్లలను పోషించుకునేందుకు జీవించే అవకాశం లభించిందన్నారు. నేటి రాజకీయ నాయకుల్లో సేవాతత్పరత కానరావడంలేదని, అందుకు భిన్నంగా ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ఆపదలో ఉన్న ఎంతోమందిని ఆదుకోవడంతోపాటు ఇటువంటి సంఘటనల్లో తన ఔదార్యం చాటుకుంటున్నారని పలువురు పేర్కొన్నారు.