
ప్రమాదానికి గురైన ట్రావెల్ బస్సు
సాక్షి, విశాఖపట్నం: జిల్లాలోని ఎన్‌ఏడీ జంక్షన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రావెల్స్ బస్సు విజయవాడ నుంచి విశాఖకు 50మంది ప్రయానికులతో బయలుదేరింది. వెంకటరమణ ట్రావెల్ బస్సును వేగంగా వచ్చిన టిప్పర్ ఢీ కొట్టింది. దీంతో ఆ బస్సు కూడలిలో బస్సు బోల్తా పడింది. బస్సులోని కొంతమంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. 10మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు.
ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్ అక్కడి నుంచి జారుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన జరిగిన ప్రదేశానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సులోని ప్రయాణికులను బయటకు తీసి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. రోడ్డుపై బస్సును తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment