
విశాఖపట్నం: విశాఖపట్నంలోని జూ పార్క్‌లో దారుణం జరిగింది. ఎలుగుబంటి రూమ్‌ని శుభ్రం చేస్తుండగా కేర్ టేకర్‌పై దాడి చేసింది. ఈ ఘటనలో బనవారపు నగేష్ బాబు(25) మృతి చెందాడు.
నగేష్ అనే సంరక్షకుడు ఎలుగుబంటి ఉండే ఎన్ క్లోజర్ వద్ద క్లీనింగ్ కు వెళ్ళాడని జూ క్యూరేటర్ నందనీ సలారియా తెలిపారు. అదే సమయంలో ఎలుగుబంటి హెల్త్ చెకింగ్ కోసం వెళ్ళిన డాక్టర్ కీపర్ నగేష్ కోసం వాకబు చేశాడు. అప్పటికే ఎలుగుబంటి తన ఎన్ క్లోజర్ బయట ఉండడంతో తొలుత దానిని లోపలకు పంపి నగేష్ కోసం వెతకగా ఎన్ క్లోజర్ వెనక తీవ్ర రక్తస్రావమై గాయాలతో నగేష్ పడి ఉన్నాడని వెల్లడించారు. పోలీసులకు, వైద్యులకు సమాచారం ఇచ్చాం.. అంబులెన్స్ తెప్పించినా అప్పటికే నగేష్ మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారని పేర్కొన్నారు. ఎలుగుబంటి ఎన్ క్లోజర్ లోపలకి వెళ్ళిన వెంటనే క్లోజ్ చేయకపోవడం వల్లే అది బయటకు వచ్చి నగేష్ పై దాడి చేసిందని స్పష్టం చేశారు.
రోజూవారి పనుల్లో భాగంగా ఎలుగుబంటి రూంలోకి కేర్ టేకర్ ప్రవేశించాడు. ఎలుగుబంటిని గమనించకుండా పనిలో నిమగ్నమయ్యాడు. ఇంతలో ఆయనపై ఎలుగుబంటి ఒక్కసారిగా దాడి చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: Video: సెల్ఫీల వివాదం.. గుంటూరులో జుట్లు పట్టుకొని కొట్టుకున్న యువతులు
Comments
Please login to add a commentAdd a comment