తిరుమలలో చిరుత సంచారం | Leopard Wandering In Thirumala Recorded In CCTV Cameras Tirupati | Sakshi
Sakshi News home page

తిరుమలలో చిరుత సంచారం

Published Sun, Aug 29 2021 7:52 AM | Last Updated on Sun, Aug 29 2021 8:16 AM

Leopard Wandering In Thirumala Recorded In CCTV Cameras Tirupati - Sakshi

తిరుమల: తిరుమలలోని శ్రీకృష్ణ అతిథిగృహం వద్ద చిరుత సంచరించిన ఘటన శనివారం వెలుగుచూసింది. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో అతిథిగృహం సమీపంలోకి ఓ వరాహం వచ్చింది. అదే సమయంలో వరాహాన్ని వెంబడిస్తూ చిరుత చేరుకుంది. కొంతసేపు వరాహం కోసం వేచి ఉన్న చిరుత అనంతరం అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది. ఈ దృశ్యాలు అతిథి గృహంలోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఇప్పటివరకు కుక్కల కోసం తిరుమలలోని నివాసప్రాంతాలు, అతిథిగృహాల వద్దకు వస్తున్న చిరుతలు ప్రస్తుతం వరాహాల కోసం రావడం గమనార్హం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement