మీర్‌పేట్: అత్త, మామ, భర్త తరుచూ సూటిపోటి మాటలతో మానసిక వేదనకు గురిచేస్తున్నారన్న కలతతో ఓవివాహిత బలవన్మరణానికి పాల్పడింది. మీర్‌పేట్ ఎస్సై భాస్కర్ తెలిపిన వివరాల మేరకు నగరంలోని ఎన్‌టీఆర్‌నగర్‌లో నివాసం ఉంటున్న రుక్మిణి(21)కు మీర్‌పేట్‌కు చెందిన సంతోష్(27)తో 2013లో వివాహం జరిగింది. వీరికి 8నెలల పాప కూడా ఉంది.
ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్న సంతోష్ తల్లి జ్యోతి, తండ్రి శ్యాంతో కలిసి మీర్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మీర్‌పేట్ నందిహిల్స్‌లో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో బుధవారం ఇంట్లో ఎవరులేని సమయంలో బెడ్‌రూంలో ఉన్న సీలింగ్ ప్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ప్రతి చిన్న పనికి కూడా భర్త, అత్త, మామలు సూటిపోటీ మాటలతో వేధిస్తుండేవారని దీంతో విసుగు చెంది రుక్మిణి ఆత్మహత్యకు పాల్పడిందని ఎస్సై తెలిపారు. మృతురాలి సోదరుడి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు చెప్పారు.
సూటిపోటి మాటలకు కలత చెంది..
Published Wed, Dec 16 2015 9:36 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
Advertisement
Advertisement