ఎంపీ బుట్టారేణుక
ఎమ్మిగనూరురూరల్: విద్యార్థుల్లో అంతర్గతంగా దాగి ఉన్న సృజనాత్మకతను గుర్తించాలని ఎంపీ బుట్టా రే ణుక ఉపాధ్యాయులకు సూచించారు. బనవాసి జవహర్ నవోదయ విద్యాలయంలో మంగళవారం ప్రారంభమైన 27 రీజనల్‌స్థాయి ఎగ్జిబిషన్ కార్యక్రమం బుధవారం సాయంత్రం ముగిసింది. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ బుట్టా రేణుక హాజరై విద్యాలయ మైదానంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ జెండాను అవిష్కరించి స్టాల్స్‌ను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఇక్కడి విద్యార్థులను చూస్తుంటే తన చిన్ననాటి స్కూలు రోజులు గుర్తుకు వస్తున్నాయని చెప్పారు. విద్యార్థులు గురువులు చెప్పిన విషయాలను శ్రద్ధగా వినాలని తెలిపారు.
నవోదయలో సీటు రావటం అదృష్టంగా భావించాలని చెప్పారు. విద్యార్థులు ఏర్పాటు చేసిన ప్రదర్శనలు ఆలోచింపజేసేలా ఉన్నాయని అభినందించారు. అనంతరం ఉత్తమ ప్రదర్శనలకు బహుమతులు అందజేశారు. అంతకుముందు ఎంపీ బుట్టా రేణుకను ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, విద్యాలయం బృందం సభ్యులు శాలువ, పూల మాలతో సన్మానించారు. పాఠశాలకు సంబంధించిన పుస్తకం, సీడీ ని ఎంపీ అవిష్కరించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ రుక్మిణి, సీఐ శ్రీనివాసరావు, రూరల్, పట్టణ ఎస్‌ఐలు నల్లప్ప, ఇంతియాజ్‌బాష తదితరులు పాల్గొన్నారు.
అలరించిన నృత్యం
Published Thu, Sep 4 2014 2:11 AM | Last Updated on Thu, Mar 21 2019 9:07 PM
Advertisement