తిరువణ్ణామలైలో అరుణాచలేశ్వర స్వామి కార్తీక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యూరుు. శుక్రవారం ఉదయం ధ్వజారోహణం కన్నుల పండువగా సాగింది. ఈ వేడుకను చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తజనులు తరలివచ్చారు. హరోంహర నామస్మరణలతో ఆలయ ఆవరణం మార్మోగింది.
వేలూరు, న్యూస్‌లైన్:
తిరువణ్ణామలైలోని అరుణాచలేశ్వర స్వామి కార్తీక బ్రహ్మోత్సవాలంటే భక్తులకు ఎంతో ఇష్టం. ప్రతి ఏటా పది రోజులు ఈ ఉత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతారుు. ఉదయం, సాయంత్రం వేళల్లో ఉత్సవమూర్తులు మాడవీధుల్లో ఊరేగుతూ భక్తజనులకు దర్శనమిస్తారు. ఈ సంవత్సరం నవంబర్ 8 నుంచి 17వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించేలా అధికారులు నిర్ణరుుంచారు. శుక్రవారం ఉదయం 6.21 గంటలకు ఆలయంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు. తెల్లవారుజామున 3 గంటలకు ఆలయ తలుపులను తెరిచి మూలవర్ సన్నిధిలో ప్రత్యేక అభిషేకం, ఆరాధనలు చేశారు. ఉత్సవమూర్తులు వినాయకుడు, మురుగన్,చంద్రశేఖరుడు, చండికేశ్వరుడు, అన్నామలై, ఉన్నామలై అమ్మవార్లను అలంకరించి ధ్వజస్తంభం వద్దకు తీసుకొచ్చారు.
అనంతరం మకర దీపారాధన జరిపారు. ఆలయ అర్చకులు వేదమంత్రాల నడుమ ధ్వజారోహణం నిర్వహించారు. భక్తుల హరోంహర నామస్మరణతో ఆలయ ఆవరణం మార్మోగింది. అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. తర్వాత ఉత్సవమూర్తులను మాడవీధుల్లో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ జ్ఞానశేఖరన్, డీఐజీ మురుగన్, ఎస్పీ ముత్తరసి, జిల్లా రెవెన్యూ అధికారి వలర్‌మధి, ఆర్డీవోలు ప్రియ, ఆలయ జాయింట్ కమిషనర్ తిరుమగల్, ఎమ్మెల్యే అరంగనాథన్, జెడ్పీ చైర్మన్ నైనాకన్ను, మున్సిపల్ చైర్మన్ బాలచందర్, మాజీ మంత్రి పిచ్చాండి, మున్సిపల్ మాజీ చైర్మన్ శ్రీధరన్ తదితరులు పాల్గొన్నారు.
వేడుకగా వాహనసేవలు
బ్రహ్మోత్సవాల సందర్భంగా శుక్రవారం వివిధ వాహనసేవలు నిర్వహించారు. ఉదయం పంచమూర్తులను వెండి వాహనంపై మాడవీధుల్లో ఊరేగించారు. రాత్రి హంస, అధికార నంది, చిన్న వృషభ వాహనాల్లో స్వామివారు ఊరేగారు. ఈ నెల 14న రథోత్సవం అత్యంత ఘనంగా జరగనుంది. అలాగే 17వ తేదీ ఉదయం 4 గంటలకు మూలవర్ సన్నధిలో భరణి దీపం, సాయంత్రం 6 గంటలకు ఆలయం వెనుకనున్న 2,668 అడుగుల ఎత్తు గల కొండపై మహాదీపం వెలిగించనున్నారు. ఈ దీపాన్ని ద ర్శించుకునేందుకు తమిళనాడు నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి ఇరవై లక్షల మందికిపైగా భక్తులు తరలిరానున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లను వేగవంతం చేశారు.
తిరువణ్ణామలైలో కార్తీక బ్రహ్మోత్సవాలు ప్రారంభం
Published Sat, Nov 9 2013 12:38 AM | Last Updated on Sat, Sep 2 2017 12:25 AM
Advertisement