kartika Brahmotsava lu
-
సర్వభూపాలునిపై సర్వాంతర్యామి
చంద్రగిరి(తిరుపతి జిల్లా): శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఆరవ రోజైన బుధవారం ఉదయం హరి అంతరంగ అలిమేలు మంగ సర్వభూపాలునిపై ఉట్టి కృష్ణుడు అలంకరణలో భక్తులను అనుగ్రహించారు. ఇందులో భాగంగా అమ్మవారిని వేకువజామున సుప్రభాతంతో మేల్కొల్పి నిత్యకైంకర్యాలు నిర్వహించారు. ఉదయం ఏడు గంటలకు అమ్మవారిని అద్దాల మహల్ నుంచి వేంచేపుగా వాహన మండపానికి తీసుకొచ్చి సర్వభూపాల వాహనంపై కొలువుదీర్చారు. పట్టుపీతాంబర స్వర్ణాభరణాలతో అమ్మవారిని చేతితో ఉట్టి కొడుతున్న శ్రీకృష్ణుడిగా అలంకరించారు. ఎనిమిది గంటలకు భక్తుల కోలాటాలు, భజన బృందాలు, మంగళ వాయిద్యాలు, జియ్యర్ స్వాముల ప్రబంధ పారాయణం నడుమ అమ్మవారు సర్వభూపాల వాహనంపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులను ఆశీర్వదించారు. స్వర్ణరథంపై సౌభాగ్యలక్ష్మి అమ్మవారు సాయంత్రం సౌభాగ్యలక్ష్మిగా స్వర్ణరథంపై తిరువీధుల్లో భక్తులను కటాక్షించారు. బ్రహ్మోత్సవాల్లో గరుడ వాహన సేవకు ముందు స్వర్ణరథోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా స్నపన తిరుమంజనం అనంతరం అమ్మవారిని మహాలక్ష్మి స్వరూపిణిగా అలంకరించి రథ మండపానికి వేంచేపుగా తీసుకొచ్చి స్వర్ణరథంపై కొలువుదీర్చారు. సాయంత్రం 4.20 గంటలకు భక్తుల కోలాటాలు, భజన బృందాలు నడుమ సర్వతేజోమయి అయిన అమ్మవారు స్వర్ణరథంపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. రాత్రి గరుడ వాహనంపై శ్రీవారి దేవేరి శ్రీపద్మావతి అమ్మవారు తిరువీధుల్లో విహరించారు. వాహన సేవల్లో తిరుమల పెద్ద జీయర్‌స్వామి, చిన్న జీయర్‌స్వామి, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, జేఈవో వీరబ్రహ్మం దంపతులు పాల్గొన్నారు. -
చిన్నశేషునిపై బద్రీనారాయణుడు
చంద్రగిరి(తిరుపతి జిల్లా): శ్రీవారి దేవేరి శ్రీపద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోజైన శుక్రవారం రాత్రి చిన్నశేష వాహనంపై తిరువీధుల్లో వెన్నముద్ద చేతబట్టిన కృష్ణుడి రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఇందులో భాగంగా అమ్మవారిని వేకువజామునే మేల్కొల్పి నిత్యకైంకర్యాలు నిర్వహించారు. మధ్యాహ్నం 12.30 గంటలకు శ్రీకృష్ణస్వామి ముఖమండపంలో నేత్రపర్వంగా అమ్మవారికి స్నపన తిరుమంజనం జరిపారు. సాయంత్రం ఆస్థాన మండపంలో వేడుకగా ఊంజల్‌సేవ నిర్వహించారు. అనంతరం అమ్మవారిని వేంచేపుగా వాహన మండపానికి తీసుకొచ్చి చిన్నశేష వాహనంపై కొలువుదీర్చారు. పట్టుపీతాంబర వజ్రవైడూర్య ఆభరణాలతో అమ్మవారిని బద్రీనారాయణుడిగా అలంకరించారు. రాత్రి ఏడు గంటలకు మంగళ వాయిద్యం, భజన బృందాలు, భక్తుల కోలాటాలు, జియ్యర్ స్వాముల దివ్యప్రబంధ పారాయణం, వేదపండితుల వేదపారాయణం నడుమ అమ్మవారు చిన్నశేష వాహనంపై తిరువీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. కాగా, బ్రహ్మోత్సవాల ప్రారంభ సూచికగా ఉదయం శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి పాల్గొన్నారు. అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువ్రస్తాల సమర్పణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి అమ్మవారికి పట్టువ్రస్తాలు సమర్పించారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు జేఈవో వీరబ్రహ్మం స్వాగతం పలికారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్టు చెప్పారు. ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. వర్షాలు సమృద్ధిగా కురిసి రాష్ట్రంలో సస్యశ్యామలంగా ఉండాలని, రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రారి్థంచినట్టు తెలిపారు -
తిరువణ్ణామలైలో కార్తీక బ్రహ్మోత్సవాలు ప్రారంభం
తిరువణ్ణామలైలో అరుణాచలేశ్వర స్వామి కార్తీక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యూరుు. శుక్రవారం ఉదయం ధ్వజారోహణం కన్నుల పండువగా సాగింది. ఈ వేడుకను చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తజనులు తరలివచ్చారు. హరోంహర నామస్మరణలతో ఆలయ ఆవరణం మార్మోగింది. వేలూరు, న్యూస్‌లైన్: తిరువణ్ణామలైలోని అరుణాచలేశ్వర స్వామి కార్తీక బ్రహ్మోత్సవాలంటే భక్తులకు ఎంతో ఇష్టం. ప్రతి ఏటా పది రోజులు ఈ ఉత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతారుు. ఉదయం, సాయంత్రం వేళల్లో ఉత్సవమూర్తులు మాడవీధుల్లో ఊరేగుతూ భక్తజనులకు దర్శనమిస్తారు. ఈ సంవత్సరం నవంబర్ 8 నుంచి 17వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించేలా అధికారులు నిర్ణరుుంచారు. శుక్రవారం ఉదయం 6.21 గంటలకు ఆలయంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు. తెల్లవారుజామున 3 గంటలకు ఆలయ తలుపులను తెరిచి మూలవర్ సన్నిధిలో ప్రత్యేక అభిషేకం, ఆరాధనలు చేశారు. ఉత్సవమూర్తులు వినాయకుడు, మురుగన్,చంద్రశేఖరుడు, చండికేశ్వరుడు, అన్నామలై, ఉన్నామలై అమ్మవార్లను అలంకరించి ధ్వజస్తంభం వద్దకు తీసుకొచ్చారు. అనంతరం మకర దీపారాధన జరిపారు. ఆలయ అర్చకులు వేదమంత్రాల నడుమ ధ్వజారోహణం నిర్వహించారు. భక్తుల హరోంహర నామస్మరణతో ఆలయ ఆవరణం మార్మోగింది. అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. తర్వాత ఉత్సవమూర్తులను మాడవీధుల్లో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ జ్ఞానశేఖరన్, డీఐజీ మురుగన్, ఎస్పీ ముత్తరసి, జిల్లా రెవెన్యూ అధికారి వలర్మధి, ఆర్డీవోలు ప్రియ, ఆలయ జాయింట్ కమిషనర్ తిరుమగల్, ఎమ్మెల్యే అరంగనాథన్, జెడ్పీ చైర్మన్ నైనాకన్ను, మున్సిపల్ చైర్మన్ బాలచందర్, మాజీ మంత్రి పిచ్చాండి, మున్సిపల్ మాజీ చైర్మన్ శ్రీధరన్ తదితరులు పాల్గొన్నారు. వేడుకగా వాహనసేవలు బ్రహ్మోత్సవాల సందర్భంగా శుక్రవారం వివిధ వాహనసేవలు నిర్వహించారు. ఉదయం పంచమూర్తులను వెండి వాహనంపై మాడవీధుల్లో ఊరేగించారు. రాత్రి హంస, అధికార నంది, చిన్న వృషభ వాహనాల్లో స్వామివారు ఊరేగారు. ఈ నెల 14న రథోత్సవం అత్యంత ఘనంగా జరగనుంది. అలాగే 17వ తేదీ ఉదయం 4 గంటలకు మూలవర్ సన్నధిలో భరణి దీపం, సాయంత్రం 6 గంటలకు ఆలయం వెనుకనున్న 2,668 అడుగుల ఎత్తు గల కొండపై మహాదీపం వెలిగించనున్నారు. ఈ దీపాన్ని ద ర్శించుకునేందుకు తమిళనాడు నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి ఇరవై లక్షల మందికిపైగా భక్తులు తరలిరానున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లను వేగవంతం చేశారు.