ఎలక్షన్ డ్యూటీకి రాలేదని టీచర్లపై వేటు | 2 teachers suspended after found missing on election duty | Sakshi
Sakshi News home page

ఎలక్షన్ డ్యూటీకి రాలేదని టీచర్లపై వేటు

Published Fri, Jun 19 2015 11:38 AM | Last Updated on Sun, Sep 3 2017 4:01 AM

2 teachers suspended after found missing on election duty

ముజఫర్నగర్: పంచాయతీ ఎన్నికల విధుల్లో హాజరుకాకుండా ఉన్న ఓ పాఠశాల ఉపాధ్యాయుడు, మరో టీచర్ ను సస్పెండ్ చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్లో చోటుచేసుకుంది. ఎస్ కే బాల్యాన్ ప్రధానోపాధ్యాయుడు మహబత్ అనే గ్రామంలో పనిచేస్తుండగా రోహిత్ కౌశిక్ అనే మరో ఉపాధ్యాయుడు వేరే పాఠశాలలో పనిచేస్తున్నారు. వీరిద్దరిని జిల్లా ఉన్నత కార్యాలయంలో ఓ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి విధులు అప్పగించారు. కానీ, వారు హాజరు కాకపోవడంతో వేటు వేశారు. కాగా, సస్పెండ్ వేటు పడిన ప్రధానోపాధ్యాయుడు ఆ జిల్లా ఉపాధ్యాయుల సంఘం కార్యదర్శి కూడా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement