
ఇంటర్ ఇంగ్లిష్ పరీక్షకు 19,013 మంది డుమ్మా
సిటీబ్యూరో: ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం పరీక్షలు బుధవారం ప్రారంభించారు. తొలిరోజు ఇంగ్లిష్ పరీక్షకు విద్యార్థులు పెద్ద ఎత్తున గైర్హాజరయ్యారు. హైదరాబాద్‌లో 78,254 మందికి గాను 64,185 మంది (82.02 శాతం) హాజరవగా, రంగారెడ్డి జిల్లాలో 1,14,427కి గాను 1,09,483 మంది (95.67 శాతం) విద్యార్థులు పరీక్ష రాశారు.
జంట జిల్లాల్లో మొత్తం 19,013 మంది విద్యార్థులు గైర్హాజరు కావడం అధికారులను సైతం ఆశ్చర్యపరిచింది. కాగా బుధవారం జంట నగరాల్లో ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని ఆర్‌ఐఓ రవికుమార్ తెలిపారు. రంగారె డ్డి జిల్లాలో ఒక కేసు నమోదైందని ఆర్‌ఐఓ గౌరీ శంకర్ వెల్లడించారు.