సల్మాన్ కేసులో కీలక సాక్షి గైర్హాజరు | Key witness in blackbuck case fails to appear in court | Sakshi
Sakshi News home page

సల్మాన్ కేసులో కీలక సాక్షి గైర్హాజరు

Published Tue, Jun 30 2015 12:54 AM | Last Updated on Sun, Sep 3 2017 4:35 AM

సల్మాన్ కేసులో కీలక సాక్షి గైర్హాజరు

సల్మాన్ కేసులో కీలక సాక్షి గైర్హాజరు

జోధ్‌పూర్: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌పై నమోదైన కృష్ణజింకల వేట కేసులో కీలక సాక్షి చోగారామ్(65) కోర్టుకు గైర్హాజరయ్యాడు.  అతడు సోమవారం ఇక్కడి కోర్టుకు హాజరై వాంగ్మూలమివ్వాల్సి ఉంది. చోగారామ్ మానసిక స్థితి వాంగ్మూలమిచ్చేందుకు అనువుగా లేదని అతని కుమారుడు కోర్టుకు హాజరై వివరణ ఇచ్చాడు. తన తండ్రి పేరును సాక్షుల జాబితా నుంచి తీసేయాలన్నాడు. దీనికి సంబంధించి డాక్టర్లు ఇచ్చిన డాక్యుమెంట్లను సమర్పించాడు.

చోగారామ్ కోర్టులో వాంగ్మూలమివ్వగలడో లేదో పూర్తిస్థాయి వైద్యనివేదికను అందించాలని జడ్జి ఆదేశించారు. సల్మాన్ జింకలను కాల్చి చంపాక చోగారామ్ అతని వాహనాన్ని అపడానికి ప్రయత్నించినట్లు ఎఫ్‌ఐఆర్‌లో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement