
సాక్షి, హైదరాబాద్: జాతీయ రాజకీయాలు, రాష్ట్రపతి ఎన్నికల్లో ఏం చేయాలనే అంశాలపై ప్రధానంగా.. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చర్చలు జరుపుతున్నారు.
ఈ రెండు అంశాలపై ఇప్పుడు సీఎం కేసీఆర్ ప్రధానంగా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం గత రెండు రోజలుగా ఎన్నికల వ్యూహకర్త పీకేతో వరుసగా చర్చిస్తున్నారు. అంతేకాదు రాష్ట్రపతి ఎన్నికల ఎజెండాగా మమతా బెనర్జీ పిలుపు ఇచ్చిన భేటీకి వెళ్లే విషయంపైనా పీకే నుంచి అభిప్రాయాన్ని తీసుకుంటున్నారు సీఎం కేసీఆర్. ఎన్డీఏ అభ్యర్థిని ఓడించడమే టార్గెట్.. మమతా బెనర్జీ విపక్షాల తరపున అభ్యర్థి ఎంపికకు పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందుకోసం 22 విపక్షాలకు 15న ఢిల్లీలో మమత ఆహ్వానం పంపారు.
అదే సమయంలో జాతీయ రాజకీయాల్లో టీఆర్‌ఎస్ పాత్ర కీలకం అని పీకే వెల్లడించారట. రాష్ట్రపతి ఎన్నికల కోసం విపక్షాల అభ్యర్థి ఎంపికలో కేసీఆర్ పాత్ర పై చర్చ వీరిరువురి నడుమ చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. గత రెండు రోజులుగా హైదరాబాద్‌లో ఉన్న పీకే.. ఈ మేరకు సీఎం కేసీఆర్‌తో వరుస భేటీలు జరుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment