ఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జమిలీ ఎన్నికలపై కసరత్తు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఎనిమిది సభ్యులతో హైలెవల్ కమిటీని కూడా ఏర్పాటుచేసింది. ఈ నేపథ్యంలో కేంద్రం జమిలీ ఎన్నికల నిర్ణయంపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్పందించారు. జమిలీ ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
కేంద్రం నిర్ణయం మంచిదైతే ఓకే..
తాజాగా ప్రశాంత్ కిషోర్ మీడియాతో మాట్లాడుతూ.. జమిలీ ఎన్నికలకు తన మద్దతు ఉంటుదన్నారు. అయితే, ఇది సరైన ఉద్దేశంతో చేస్తే దేశానికి ప్రయోజనకరంగా ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. దీన్ని మంచి ఉద్దేశంతో తీసుకువస్తే మంచిది అని పేర్కొన్నారు. ఇదే సమయంలో భారత్ వంటి అతిపెద్ద దేశాలలో సంవత్సరానికి 25 శాతం మంది ఎన్నికలకు ఓట్లు వేస్తూ ఉంటారు. ఒకే ఎలక్షన్ విధానం తీసుకువస్తే ఇది ఒకటి రెండుసార్లు మాత్రమే పరిమితం అవుతుందన్నారు. ఈ క్రమంలో ఖర్చులను తగ్గించడంతో పాటుగా, ప్రజలు ఒకేసారి నిర్ణయం తీసుకోవలసిన పరిస్థితులు ఉంటాయని వ్యాఖ్యలు చేశారు.
బిల్లును ప్రవేశపెట్టనివ్వండి..
ఇదే సమయంలో అసలు ఇది ఏ ఉద్దేశంతో తీసుకువస్తున్నారన్నదే ముఖ్యమని కీలక వ్యాఖ్యలు చేశారు. రాత్రికి రాత్రి పరివర్తన తీసుకురావాలని భావిస్తే అది తీవ్ర సమస్యగా మారుతుందన్నారు. ప్రభుత్వం బిల్లు తీసుకువస్తుంది కాబట్టి, ఆ బిల్లును ప్రవేశపెట్టాలన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దేశానికి మేలు జరిగే విధంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ విధానం ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగానే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 1967 వరకు 18 సంవత్సరాల పాటు దేశంలో ఒకేసారి ఎన్నికలు ఎలా జరిగాయో తెలిపారు. లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించేందుకు అనుకూలంగా పనిచేసే కారణాలను కూడా ఆయన వ్యక్తం చేశారు.
#WATCH | On 'One Nation, One Election', Prashant Kishor says, "If this is done with the correct intentions and there be a transition phase of 4-5 years, then it is in the interest of the country. This was once in effect in the country for 17-18 years. Secondly, in a country as… pic.twitter.com/beTAZqf0Gl
— ANI (@ANI) September 4, 2023
ఇది కూడా చదవండి: ఉదయనిధి 'సనాతన ధర్మ' వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందన ఏంటంటే..?
Comments
Please login to add a commentAdd a comment