బీహార్ రాజకీయాలపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌పై ప్రశాంత్ కిషోర్ మండిపడ్డారు. భాయ్ సాహెబ్‌కు ప్రజల గోడు వినే సమయం కూడా లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే ట్విట్టర్ వేదికగా ఓ వీడియోను షేర్ చేసి నితీశ్ కుమార్ సర్కార్‌ను టార్గెట్ చేశారు.
వివరాల ప్రకారం.. బీహార్‌లోని రాఘోపూర్ ప్రజలు తమ ప్రాంతానికి రోడ్డు నిర్మాణం చేయాలని నిరసనలకు దిగారు. తమ నివాస ప్రాంతాల నుంచి ప్రధాన రహదారి వరకు రోడ్డు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించి ఆందోళనలు చేపట్టారు. కాగా, తమ గ్రామం మీదుగా డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ వెళ్తున్నారన్న విషయం తెలుసుకున్న గ్రామస్తులు తమ గోడు తెలిపేందుకు రోడ్లపైకి వచ్చారు. ఈ నేపథ్యంలో తేజస్వీ కాన్వాయ్‌కి లైన్ క్లియర్ చేసే క్రమంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు.
రోడ్డుపై నిరసనలు తెలుపుతున్న గ్రామస్తులను బలవంతంగా అక్కడి నుంచి ఖాళీ చేయించారు. దీంతో, తేజస్వీ యాదవ్‌కు వ్యతిరేకంగా గ్రామస్తులు నినాదాలు చేశారు. ఈ క్రమంలో తన వాహనాన్ని ఆపిన తేజ్వసీ.. వారితో కొద్దిసేపు మాట్లాడారు. కానీ, రోడ్డు నిర్మాణం గురించి ఎలాంటి హామీ ఇవ్వకుండానే వెళ్లిపోయారు అంటూ ప్రశాంత్ కిషోర్ కామెంట్స్ చేశారు. మరోవైపు.. గ్రామస్తుల నిరసనలపై ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రోడ్డు నిర్మాణం కోసం రాఘోపూర్ ప్రజలు గత 30 ఏళ్లుగా పోరాడుతున్నారని అన్నారు. ఇప్పటికైనా వారికి రోడ్డు సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్బంగా స్థానికులు మీడియాతో మాట్లాడుతూ.. మా ప్రాంతంలో మౌలిక సదుపాయాలు సరిగా లేకపోవడంతో వర్షాకాలంలో పిల్లలు స్కూల్స్‌కు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బురద, వరద నీరు నిండిన రోడ్డు మీదుగా బడికి వెళ్లాల్సి వస్తోందన్నారుఉ. రోడ్డు విషయంపై మేమంతా స్థానిక నేతలకు ఎన్నో సార్లు దరఖాస్తులు పెట్టుకున్నాము. కానీ, ఫలితం మాత్రం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
बिहार के CM के बाद अब उनके Deputy की बारी।
— Prashant Kishor (@PrashantKishor) January 26, 2023
महोदय के अपने क्षेत्र राघोपुर में पिछले 34 वर्षों से सड़क नहीं बनने से नाराज़ लोग उनके क़ाफ़िले के सामने सड़कों पर लेट गए!
काम की बात तो छोड़ दीजिए, भाई साहेब ने गाड़ी से उतर कर लोगों से मिलना तक ज़रूरी नहीं समझा। pic.twitter.com/eyVmlprcHV
Comments
Please login to add a commentAdd a comment