సాక్షి, విజయవాడ: ఒక పీకే(పవన్ కల్యాణ్) అయిపోయాడు.. ఇప్పుడు ఇంకొక పీకే(ప్రశాంత్ కిషోర్) వచ్చాడంటూ.. మంత్రి జోగి రమేష్ విసుర్లు విసిరారు. తాజాగా ఏపీ రాజకీయాలపై ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. మంత్రి జోగి రమేష్ పలు ప్రశ్నలు సంధించారు.
‘‘ప్రశాంత్ కిషోర్‌కి అసలు ఆంధ్రాలో టీమ్ ఉందా?.. అతను సర్వేలెప్పుడు చేశాడు?. ఐ ప్యాక్ కి ప్రశాంత్ కిషోర్ కి సంబంధం లేదు. ఎల్లో మీడియాలో డబ్బాలు కొట్టేందుకు ఆయనేవో రెండు మాటలు మాట్లాడాడు. ప్రశాంత్ కిషోర్ పెట్టిన పార్టీ ఏమైంది?. ప్రశాంత్ కిషోర్ ని ఎవరూ పట్టించుకోరు. టీడీపీ రాసి ఇచ్చిన స్క్రిప్ట్‌నే పీకే చదువుతున్నారు’’ అంటూ విమర్శలు గుప్పించారు.
.. ‘చంద్రబాబు ఆడిస్తున్న డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని.. ఎంతంది పీకేలు వచ్చినా, చంద్రబాబు వచ్చినా జగన్ గెలుపును ఆపలేరని.. జగనన్న పాలనను ఆశీర్వదించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నార’ని మంత్రి జోగి రమేష్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment